
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మాదాపూర్‌లోని ఎన్‌ఎస్‌పీఐఆర్‌ఏ సంస్థలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లినట్లు గుర్తించారు. ఈ డబ్బులతో నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు సోదాలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment