
సాక్షి,గుంటూరు: టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరని మాజీ మంత్రి పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు మెప్పు కోసం ఎంపీ లావు లోక్‌సభలో విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.
మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్నినాని మీడియాతో మాట్లాడారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు బెదిరింపులకు ఎవరూ భయపడరు. పార్లమెంటును అడ్డు పెట్టుకుని కక్షసాధింపు రాజకీయాలు చేయటం మానుకోవాలి. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భారీగా లిక్కర్ స్కాం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు లిక్కర్ షాపులను చెరపట్టారు. ప్రతిచోటా బెదిరించి కమీషన్లు, లంచాలు తీసుకుంటున్నారు. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వీటిపై పార్లమెంటులో మాట్లాడాలి
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేలకోట్లు దేశం దాటి వెళ్లినట్టు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆరోపణలు చేశారు. అప్పుడు ఆయన మా పార్టీలోనే ఉన్నారు కదా? మరెందుకు మాట్లాడలేదు?.లావు శ్రీకృష్ణ దేవరాయలు ఫ్లెమింగో పక్షిలాంటివాడు.
టీడీపీ గూటిలో చేరి చంద్రబాబు మాటలను చిలక పలుకులుగా మాట్లాడుతున్నారు. పల్నాడు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని శ్రీకృష్ణ రాష్ట్ర అభివృద్ధి కోసం వాడితే ఉపయోగ పడుతుంది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణను ఆపటానికి, పోలవరానికి నిధులు తేవటానికి తన అధికారాన్ని వాడుకుంటే మంచిది. రాయలసీమ లిఫ్టు ఎత్తిపోతల పథకం కోసం వాడితే మంచిది.దక్షినాది రాష్ట్రాల్లో తగ్గబోతున్న సీట్ల గురించి మాట్లాడాలి.కనీసం పల్నాడులో నీటి ఎద్దడి గురించి కూడా మాట్లాడటం లేదు.

కేవలం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టు చదవటమే లావు శ్రీకృష్ణ దేవరాయలు పనిగా పెట్టుకున్నారు.ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మొత్తాన్ని టీడీపీ నేతలే చెరబట్టారు.కమీషన్లు, వాటాల కోసం వ్యాపారుల గొంతు మీద కత్తి పెట్టారు.చంద్రబాబు, లోకేష్ తో సహా అందరూ దోపిడీ చేస్తున్నారు. ఇదికదా అసలైన లిక్కర్ స్కాం అంటే? ఇవేమీ కనపడటం లేదా శ్రీకృష్ణ దేవరాయలూ? అవినీతి, అక్రమాలు చేసిన చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది.దానిపై ఐటీ శాఖ పూర్తి విచారణ ఎందుకు చేయటంలేదో శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నించాలి.
పాపపు సొమ్ము చంద్రబాబుకి చేరిందని ఈడీ చెప్పింది.దానిపై శిక్షలు వేయమని శ్రీకృష్ణ దేవరాయలు గట్టిగా అడగాలి.స్కిల్ స్కాం విచారణ మొదలవగానే చంద్రబాబు పిఏ శ్రీనివాస్ దుబాయ్ ఎందుకు పారిపోయాడో ప్రశ్నించాలి. శ్రీనివాస్ పదేపదే దుబాయ్ ఎందుకు వెళ్తున్నాడో? ఆయన వెనుకే లోకేష్ ఎందుకు వెళ్తున్నాడో ప్రశ్నించాలి.
బేవరేజ్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో తప్పుడు వాంగ్మూలం తీసుకుని వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్టు చేయాలని చూస్తున్నారు.ఏదోలా వైఎస్ జగన్ మీద అక్రమ కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడేదే లేదని’ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment