Lavu Sri Krishna Devarayalu
-
లావుకు చుక్కలు చూపిస్తున్నారు!
చంద్రబాబు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇపుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతే కాదు కృష్ణదేవరాయాలను నమ్ముకుని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరు మంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజక వర్గాల అభ్యర్ధులను మార్చేయాలని కూడా కృష్ణ దేవరాయాలు షరతు విధించారట. ఇపుడా అభ్యర్ధులంతా కృష్ణ దేవరాయలు ఎలా గెలుస్తారో తామూ చూస్తాం అంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణ దేవరాయలు కూడా ఇపుడు ఆత్మపరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు.2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత అయిదేళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణల్లో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుండి బీసీ అభ్యర్ధిని బరిలో దించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణ దేవరాయలకు గుంటూరు లోక్ సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే వెంటనే చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లి కృష్ణ దేవరాయలు నరసరావు పేట లోక్ సభ టికెట్‌కు బేరం పెట్టారు.తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని.. తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్సార్సీపీలోని తన అనుచరులు మక్కెన మల్లికార్జున రావు,జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే యరపతినేనిని తప్పించి ఆ సీటును జంగాకృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులును తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కెన మల్లికార్జునరావుకు ఇవ్వాలని షరతు పెట్టారు. అంతే కాదు జీ.వి.ఆంజనేయులును నరసరావు పేటకు బదలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు.నరసరావు పేటలో మాజీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతే కాదు చిలకలూరి పేట సీటును మాజీ మంత్రి పత్తి పాటి పుల్లారావుకు ఇవ్వద్దని అన్నారట. పెదకూర పాడు సీటును కొమ్మాల పాటి శ్రీధర్ కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్ధులను,నియోజక వర్గాలను మార్చి తన అనుచరులక తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు నీకెలా కావాలంటే అలాగే చేద్దాం ముందు చేరు అన్నారు. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కెన మల్లికార్జున రావు, జంగా కృష్ణమూర్తిలకు టికెట్లు దక్కలేదు.లావు మార్చమన్న పత్తిపాటి, చదలవాడ అరవింద్,జి.వి.ఆంజనేయులు, యరపతినేని శ్రీనివాస్‌లకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇపుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తమ స్థానాలకే ఎసరు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని పత్తిపాటి, చదలవాడ, యరపతినేని, జి.వి.ఆంజనేయులు, కొమ్మాల పాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. యరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేనూ చూస్తాను అని సవాల్ చేశారట.ఈ నియోజక వర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్దంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ తమ నియోజక వర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చదలవాడకు టికెట్ ఇవ్వద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇపుడు తన సన్నిహిత వర్గాలతో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కెన, జంగా కృష్ణమూర్తిల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండి పడుతున్నారని సమాచారం. బహుశా ఈ పరిణామాలన్ని చూసేనేమో.. ఆయన ఏపీలో టీడీపీ గెలుపు కష్టమేనంటూ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. -
బీసీలకు దేశం ఝలక్ !
సాక్షి, నరసరావుపేట: దశాబ్దాలుగా బీసీల పార్టీ అని చెప్పుకుంటూ వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న టీడీపీ మరోసారి బడుగు, బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచింది. బీసీ జనాభా అధికంగా ఉన్న నరసరావుపేటలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణ కులాల వారే ఎంపీలుగా గెలుపొందుతున్నారు. అయితే బీసీలకు రాజకీయంగా అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పరంపరను మార్చేందుకు ఈ దఫా వైఎస్సార్ సీపీ తరఫున నరసరావుపేట లోకసభ అభ్యర్థిగా యాదవ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అనిల్‌కుమార్‌యాదవ్‌ను పోటీలో నిలిపారు. ఈ మంచి ఆలోచనను ప్రశంసించిన బీసీ సంఘాలు టీడీపీ సైతం బీసీ అభ్యర్థిని పోటీలో ఉంచాలని కోరాయి. అయితే పెత్తందారుల ప్రతినిధిగా పేరు పొందిన చంద్రబాబు నాయుడు వారి డిమాండ్‌ను పక్కనపెట్టి కమ్మ సామాజిక వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులును ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం ప్రకటించారు. దీనిపై బీసీలు తీవ్రంగా మండిపడుతున్నారు. సీట్ల కేటాయింపులో బీసీలకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారని, ఈ ఎన్నికల్లో ఓటుతో బాబుకు బుద్ధి చెబుతామంటున్నారు. లావు వ్యతిరేకించినా చదలవాడకే .. పల్నాడు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న నరసరావుపేట అసెంబ్లీ సీటును ఎట్టకేలకు చదలవాడ అరవింద్‌బాబుకు శుక్రవారం టీడీపీ అధిష్టానం కేటాయించింది. ఈ సీటు కోసం పోటీ పడిన కడియాల, నల్లపాటి వర్గాలు ఈ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గత ఎన్నికల్లో 30 వేలకుపైగా ఓట్ల తేడాతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఓడిన వ్యక్తిని మళ్లీ బరిలోకి దింపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పేట టికెట్ హామీతోనే టీడీపీలోకి వెళ్తున్నాను అంటూ ప్రచారం చేసుకున్న వైఎస్సార్ సీపీ బహిష్కృత నేత అట్ల చినవెంకటరెడ్డికి చంద్రబాబు మొండిచేయి చూపారు. చదలవాడ అరవింద్‌కు టికెట్ ఇవ్వడానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు తొలి నుంచి వ్యతిరేకిస్తున్నారు. తను పోటీలో ఉంటే సరైన పోటీ ఇవ్వలేమని, ఒకటి రెండు పేర్లు సూచించారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే లావు తీరుకు వ్యతిరేకంగా రెండు రోజుల కిందట మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లావు, చదలవాడ వర్గాల మధ్య వైరం మరింత పెరిగింది. పురుగుమందు తాగిన వెంకటరామిరెడ్డిని ఎంపీ లావు కనీసం పరామర్శించలేదని, మా ఓట్లు మీకు అవసరం లేదా అని చదలవాడ వర్గీయులు ప్రశ్నిస్తున్నారు. యాదవ వర్గానికి మొండిచేయి... నరసరావుపేట అసెంబ్లీ నుంచి యాదవ సామాజిక వర్గ నేతను పోటీలో ఉంచుతామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఆ స్థానం నుంచి జంగా కృష్ణమూర్తిని బరిలో దింపాలని లావు శ్రీకృష్ణ ప్రయత్నించారు. మరో ఎన్ఆర్ఐ నేత పేరును పరిశీలించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు టికెట్ ఇవ్వాలని ఆ వర్గం డిమాండ్ చేసింది. అయితే శుక్రవారం ప్రకటించిన జాబితాలో యాదవ నేత పేరు లేకపోవడంతో ఆ వర్గం తీవ్ర నిరాశకు లోనైంది. గురజాల, నరసరావుపేటలలో ఏదో ఒక చోట టికెట్ ఇస్తామని ఆశ చూపి చివరకు మొండిచేయి చూపారని, రానున్న ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. -
టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం
-
ఇస్రోలో నారీశక్తి అభినందనీయం : శ్రీకృష్ణదేవరాయలు
-
బర్త్‌డే కేక్‌లా రాష్ట్ర విభజన
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ లబ్ధి కోసం బర్త్‌డే కేక్‌లా రాష్ట్రాన్ని విభజించారని లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు విమర్శించారు. అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించడమే కాకుండా తొమ్మిదో బడ్జెట్లోనూ రాష్ట్రంపై సవతి ప్రేమే చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం లోక్‌సభలో బడ్జెట్ పద్దులపై వైఎస్సార్సీపీ తరఫున చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడారు. సంఖ్యా పరంగా ఏపీ నుంచి 25 మంది ఎంపీలు మాత్రమే ఉన్నా ప్రత్యేకహోదా విషయంలో గట్టిగా గళం వినిపిస్తామని తేల్చిచెప్పారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. పార్లమెంటు వేదికగా నాటి ప్రధాని ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీలో తగిన సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. రాముడు అరణ్యవాసానికి వెళ్లినప్పుడు భరతుడు మాదిరిగా ప్రధాని మోదీ ఏపీని భుజాలకు ఎత్తుకోవాలని పేర్కొన్నారు. ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ జోక్యం చేసుకొని మీరు భరతుడే కదా అని చమత్కరించారు. తొమ్మిదేళ్లు అయినా రైల్వే జోన్ కూడా ఏం పూర్తికాలేదని భరత్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా రూ.55 వేల కోట్లను ఆమోదించడం లేదని అన్నారు. విశాఖ, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వండి ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలతో పోటీ పడేలా విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం వంటివి తయారు కావాలని ఎంపీ భరత్ పేర్కొన్నారు. విశాఖపట్నం, విజయవాడలకు మెట్రో ప్రాజెక్టులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హోదా ప్రకటించినా దాని ఊసే లేదు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ విభజన అనంతరం ఏపీకి ప్రత్యేకహోదా ప్రకటించారని కానీ ప్రస్తుతం ఆ ఊసే లేదన్నారు. 1950ల్లో తగిన సాంకేతికత లేకున్నా నాగార్జునసాగర్ కట్టారని.. ఆ ప్రాజెక్టుకు పట్టిన సమయం కన్నా పోలవరం ప్రాజెక్టుకు ఎక్కువ సమయం పడుతోందన్నారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారని మండిపడ్డారు. తెలంగాణ ఇవ్వాల్సిన రూ.6,800 కోట్లు విద్యుత్ బకాయిల సమస్యను పరిష్కరించాలన్నారు. ఏపీలో వైద్య కళాశాలలకు కేంద్రం సహకారం అందించాలని విన్నవించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించే యోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోంది: వైఎస్సార్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రైల్వే ప్రాజెక్టులపై కేంద్రం సాకులు చెబుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, గురుమూర్తి మండిపడ్డారు. ఏపీ భవన్‌లోని గురజాడ హాలులో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టులో రాష్ట్ర వాటాను తగ్గించాలని, విభజన హామీలపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. గట్టిగా ప్రశ్నిస్తాం: ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తామని ప్రకటించిన హామీలను నెరవేర్చాలని పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో గట్టిగా ప్రశ్నిస్తామని ఎంపీ శ్రీ కృష్ణదేవరాయలు అన్నారు. రైల్వే పరంగా బడ్జెట్లో రాష్ట్రానికి ఈ సారి రూ. 8500 కోట్లు కేటాయించామని గణాంకాల్లో చెబుతున్నా, వాటిని ఏ విధంగా ఖర్చు చేయబోతోందీ రైల్వే శాఖ సవివరంగా చెప్పాలని కోరుతున్నామని తెలిపారు. రాష్ట్రం వైపు నుంచి భూసేకరణకు మేము డబ్బులివ్వడం లేదని రైల్వే సాకులు చెబుతోందన్నారు. అయితే ఇవన్నీ 2014 కుముందు మంజూరయిన వాటి గురించి కేంద్రం చెబుతోంది తప్ప రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన మార్పులు, రాష్ట్ర ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడడం లేదన్నారు. తిరిగి చర్చలు జరిపి, రాష్ట్ర వాటా విషయంలో మార్పులు చేయాలని తమ విజ్ఞప్తిగా పేర్కొన్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో దీనిపై పార్లమెంటులో గట్టిగానే ప్రశ్నిస్తామన్నారు. జాతీయ రహదారుల విషయంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జాతీయ రహదారిపైకి అరగంటలో చేరుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారని, దీనికనుగుణంగానే ఎక్కువ జాతీయ రహదారులను మంజూరు చేయించుకోగలిగామని, జగన్ గారి ఆశయసాధన కోసం త్వరితంగా ఈ పనులు పూర్తి చేయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వాటా తగ్గించాలి నడికుడి–శ్రీకాళహస్తి ప్రాధాన్యమైన రైల్వే లైను. కేంద్ర రాష్ట్రాల మధ్య 2014కు మందు కుదిరిన ఒప్పందాన్నే ఇప్పుడూ కొనసాగించాలనడం సరికాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అప్పటి ఆర్థిక స్థితి వేరు ...విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉంది. బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోనే ఇలాంటి ఒప్పందాలను మార్చుకున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. మన రాష్ట్ర వాటా విషయంలో తగ్గించాలన్నది మా విన్నపం. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పట్టుబడతామని వివరించారు. మోడల్ బస్టాండుగా తిరుపతి: ఎంపీ డాక్టర్ ఎం. గురుమూర్తి తిరుపతి తీర్థయాత్రా నగరం కనుక, ఇక్కడి బస్టాండును సమున్నతంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి గడ్కరీ విజయవాడ వచ్చినప్పుడు, సీఎం జగన్ ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనికనుగుణంగా రూ. 500 కోట్లతో మోడల్ బస్టాండుకు వచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ గురుమూర్తి అన్నారు. అలానే, తిరుపతిలో రోప్‌వే కు సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ప్రతిపాదించాం. శ్రీకాళహస్తిలోనూ రోప్వేకు ప్రతిపాదనలు తయారు చేశాం. విద్యా పరంగా అభివృద్ధి కోసం.. నైలెట్ సంస్థ ను తిరుపతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించామని, దీనికి సంబంధించి ఒక బృందం కూడా వచ్చి సర్వే చేసింది. అవసరమైన భవనాలనూ గుర్తించి, కేంద్రానికి ప్రతిపాదనలు చేశామని, దీనికి త్వరలో అనుమతులు రానున్నాయని పేర్కొన్నారు. తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయం: ఢిల్లీ వచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ గారు- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి తిరుపతిలో కేంద్ర ఫోరెన్సిక్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆ ఫైలు మహిళా భద్రతా విభాగం డైరెక్టరేట్ వద్ద ఉందని, అదీ సాకారమయ్యే అవకాశముందని తెలిపారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఎప్పటి నుంచో సైదాపురం మండలంలో రెండు కేంద్రీయ విద్యాలయ భవనాలు శిథిల స్థితిలో ఉన్నాయని , ఇవి నిర్మించి 50 ఏళ్లయిందని చెప్పారు. ఈ పాఠశాలల భవనాల నిర్మాణానికి కేంద్ర మంత్రి భూపేంద్రయాదవ్ స్పష్టమైన హామీ ఇచ్చి, ప్రతిపాదనలు పంపాలని కోరారని చెప్పారు. స్టాప్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలూ చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని ఎంపీ గురుమూర్తి తెలిపారు. జాతీయ ఉత్సవ పోర్టల్‌లో తిరుపతి, శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాలు: తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల కేలండర్‌ను జాతీయ ఉత్సవ పోర్టల్‌లో కాని, జాతీయ పర్యాటక కేలండర్లో కాని చూపడం లేదన్నారు. తమ విజ్ఞప్తి మేరకు మొన్ననే ఉత్సవ పోర్టల్‌లో చేర్చారని ఎంపీ గురుమూర్తి చెప్పారు. శ్రీకాళహస్తి, కాణిపాకం బ్రహ్మోత్సవాల వివరాలనూ ఉత్సవ పోర్టల్‌లో చూపాలని కోరామని, వాటినీ ఆ పోర్టల్‌లో చూపుతారని ఆశిస్తున్నామన్నారు. తిరుపతిలో ప్లానిటోరియం ఏర్పాటుకు కేంద్రాన్ని కోరామని, రూ. 13 కోట్లతో ప్లానిటోరియం ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చిందని చెప్పారు. దీనికీ బదులిస్తున్నామన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆహార ప్రయోగశాల ఏర్పాటుకు రూ. 10 కోట్లు మంజూరయిందని ఎంపీ గురుమూర్తి చెప్పారు. మహిళా విశ్వవిద్యాలయంలో మరో ప్రాజెక్టు కోసం రూ.2 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! తిరుపతి స్విమ్స్‌లో కేన్సర్ పరికరాల కొనుగోలు కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సామాజిక బాధ్యత పథకం (సీఎస్ఆర్) కింద అవసరమైన పరికరాల కోసం రూ. 22 కోట్లు కేటాయించిందని, ఒప్పందం కూడా కుదుర్చుకున్నామని చెప్పారు. రహదారుల పరంగా చూస్తే రూ. 7వేల కోట్లతో జాతీయ రహదారి పనులు పురోగతిలో ఉన్నాయని పేర్కొన్నారు. రూ.560 కోట్లతో క్రిబ్కో యూనిట్ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. శ్రీకాళహస్తి–నడికుడికి మరిన్ని కేటాయింపులపై అడుగుతాం శ్రీ కాళహస్తి– నడికుడి రైల్వే పనులకు రూ. 220 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్న అసంతృప్తి ఉందని, దీన్ని వ్యతిరేకిస్తున్నామని, ఎక్కువ నిధుల మంజూరు కోసం ఒత్తిడి చేస్తామని తెలిపారు. కృష్ణపట్నం ప్రాంతంలో కార్గో టెర్మినల్ అనుమతులు తుది దశలో ఉన్నాయని, దీనికీ త్వరగా అనుమతులు ఇస్తే అక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నామని చెప్పారు. ఈ పనులన్నింటి విషయంలో సీఎం జగన్ తమను పరుగులు పెట్టిస్తూ, అభివృద్ధి సాధనకు తమను ఎంతగానో ప్రోత్సహిస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని తెలిపారు. -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో అవమానించే వారిపై చర్యలు తీసుకునేలా జీవో నంబరు 50ని ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆత్మగౌరవం కాపాడేలా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన మిగిలిన హామీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. తమ అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జి వెల్లడించారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం)