రూ.1600 కోట్లు ప్రజాధనం వృథా
కమీషన్ల కోసమే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం
ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపణ
పేరవరం(ఆత్రేయపురం):
రూ.1600 కోట్లతో పురషోత్తపట్నం ఎత్తిపోతల ప«థకం నిర్మించడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. ఆయన ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. భవిష్యత్ లో ఎత్తిపోతల పథకం నిర్మాణం వ్యయం రూ.1600 కోట్లులో 22.5 శాతం టెండర్లు ఖారారు చేసి తద్వారా వచ్చే రూ.400 కోట్లు కమీషన్లు సీఎం చంద్రబాబు , లోకేష్ జేబుల్లోకి చేరుతాయని ఆరోపించారు. నదుల అనుసందానం పేరుతో నిధుల అనుసంధానం చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ఎన్నికల్లో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గెలుపించినందువల్ల ఇక్కడి రైతులకు ఏవిధమైన ప్రయోజనం ప్రభుత్వం చేకూర్చలేదని కేంద్రం ఇచ్చిన పథకాలు మినహ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి పధకాలు చేపట్టలేదని ఆయన ఆరోపించారు. అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం కాంట్రక్టర్కే ఈ కాంట్రక్టు దక్కుతుందని రైతుల పేరు చెప్పి కోట్లు ప్రజాధనం దోపిడి చేయడం దారణమన్నారు. అసెంబ్లీలో స్పీకర్ను కలిసి బహిరంగగా పార్టీలు మార్చిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై ప్రశ్నించినట్లు తెలిపారు. పరోక్షంగా పార్టీ పిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రజాస్వామ్యహితం గా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయిన చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిని కేంద్రం ముందు తాకట్టుపెట్టారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులకు ప్రతి సంవత్సరం నియోజక అభివృద్ధికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ అభివృద్ధికి రూ.3 కోట్లు కేటాయిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఓడిన వారికి నిధులు కేటాయిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో జెడ్పీ ప్రతిపక్షనేత సాకా ప్రసన్నకుమార్, మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కనుమూరి శ్రీనివాసరాజు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్, జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం సభ్యులు రాయి వెంకటేశ్వరరావు, జిల్లా వైఎస్సార్సీపీ కార్యదర్శి మార్గన గంగాదరరావు, ఎంపీపీ కోట చెల్లయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దండు సుబ్రహ్మణ్య వర్మ తదితరులు పాల్గొన్నారు.