క్రేజీ క్యాండిల్‌ లైట్‌ కన్సర్ట్‌.. | Candlelight Concerts In Hyderabad Live Classical Music | Sakshi
Sakshi News home page

క్రేజీ క్యాండిల్‌ లైట్‌ కన్సర్ట్‌..

Published Wed, Nov 13 2024 11:27 AM | Last Updated on Wed, Nov 13 2024 11:27 AM

Candlelight Concerts In Hyderabad  Live Classical Music

సిటీలో ఘనంగా ప్రారంభం కానున్న గ్లోబల్‌ కన్సర్ట్‌ 

పారిస్‌ నుంచి న్యూయార్క్‌ వరకూ యమ క్రేజ్‌ 

ఈ నెల 15న గ్లోబల్‌ సింఫనీగా సందడి చేయనున్న నిఖిత్‌ దోర్బలా 

లైవ్‌ యువర్‌ సిటీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘క్యాండిల్‌ లైట్‌ కన్సర్ట్‌’ హైదరాబాద్‌ నగరానికి కూడా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో ఊర్రూతలూగించిన ఈ సిరీస్‌ ‘ట్రిబ్యూట్‌ టు కోల్డ్‌ ప్లే’ పేరుతో హైదరాబద్‌లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న బంజారాహిల్స్‌లోని రాడిసన్‌ బ్లూ ప్లాజా హోటల్‌ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రీమియర్‌ షో ప్రారంభించనున్నారు. 

ఈ ‘క్యాండిల్‌ లైట్‌ కన్సర్ట్‌’లో భాగంగా స్థానిక ఫేమస్‌ మ్యూజిక్‌ ఆర్టిస్టుల సంగీత స్వరాలతో పోడియం హోరెత్తనుంది. క్యాండిల్‌ లైట్స్‌ వెలుతురులో సంగీతాన్ని ఆస్వాదించే వినూత్న వేదికకు మన నగరం సాక్షిగా నిలవనుంది. ఈ వేడుక ప్రారంభం మాత్రమే.. రానున్న డిసెంబర్‌ నెలలో హయత్‌ హైదరాబాద్‌ గచ్చిబౌలి వేదికగా ‘క్వీన్‌ వర్సెస్‌ అబ్బా’ పేరుతో మరో కన్సర్ట్‌కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో సారంగి, తబలా వంటి కాలాతీత శాస్త్రీయ వాయిద్యాలతో అలరించనున్నారు. 

పారిస్‌ టూ న్యూయార్క్‌..
‘క్యాండిల్‌ లైట్‌ కన్సర్ట్‌’ సాధారణంగా నిర్వహించే కన్సర్ట్‌లాంటిది కాదు. పారిస్‌లోని చారిత్రాత్మక వేదికలు మొదలు న్యూయార్క్‌లోని మోడ్రన్‌ వేదికల వరకూ ప్రపంచ ప్రయాణం చేసి మిలియన్ల మ్యూజిక్‌ లవర్స్‌ను అలరించిన గ్లోబల్‌ షో. 

ఈ కన్సర్ట్‌కు అంతర్జాతీయంగా ప్రత్యేక ఫ్యాన్‌ బేస్‌ ఉండటం విశేషం. ప్రస్తుతం యావత్‌ ప్రపంచం అంతా హైదరాబాద్‌ వైపు చూస్తున్న వేళ లైవ్‌ యువర్‌ సిటీ అంటూ నగరానికి విచ్చేసింది. ప్రముఖ భారతీయ పియానిస్ట్‌ నిఖిత్‌ దోర్బలా సందడి చేయనున్న షో ఈ నెల 15న జరగనుండగా, డిసెంబర్‌ 6, 22, జనవరి 11 తేదీల్లో నగరంలోని విభిన్న వేదికల్లో ఈ సంగీత కచేరి జరగనుంది.  

(చదవండి:

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement