
సాక్షి,హైదరాబాద్ : చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్‌చల్ చేశారు. ఎక్కడినుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా? అంటూ చిందులు తొక్కారు.
బుధవారం షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాల్ని అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ కూల్చివేతలపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం హుకుం జారీ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు.

Comments
Please login to add a commentAdd a comment