chintal basti
-
చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్
సాక్షి,హైదరాబాద్ : చింతల్ బస్తీలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్చల్ చేశారు. ఎక్కడినుంచో బతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా? అంటూ చిందులు తొక్కారు. బుధవారం షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న నిర్మాణాల్ని అధికారులు కూల్చివేతలు చేపట్టగా, ఈ కూల్చివేతలపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ అధికారులపై దానం ఫైరయ్యారు. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం హుకుం జారీ చేశారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ దానం హెచ్చరిక జారీ చేశారు. -
చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల
-
ఖైరతాబాద్‌లో మొసలి పిల్ల కలకలం
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో బుధవారం భారీగా కురిసిన వానకు నాలాలన్నీ పొంగిపొర్లాయి. ఇదే క్రమంలో చింతల్ బస్తీ నాలాలో మొసలి పిల్ల ఒకటి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. చింతల్ బస్తీలో నిర్మాణంలో ఉన్న వంతెన దగ్గర నాలా వద్ద మొసలి పిల్ల ప్రత్యక్షమైంది. వెంటనే భయభ్రాంతులకు గురైన స్థానికులు మొసలిని కర్రలతో బెదిరించే ప్రయత్నం చేశారు. మొసలి పిల్ల అరవడం మొదలుపెట్టడంతో అక్కడివారంతా తలోదిక్కూ పరుగులు తీశారు. అక్కడివారు అప్రమత్తమై అటవీశాఖ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఫోన్ చేసి సమాచారమందించారు. భారీగా కురిసిన వర్షానికి రోడ్డు మీదకు వచ్చిన డ్రైనేజీ నీటి ఉధృతికి మొసలి రోడ్డుపైకి కొట్టుకుని వచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇది కూడా చదవండి: గణేష్ నిమజ్జనం.. మెట్రో సేవల సమయం పొడిగింపు.. -
స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
-
సదర్ ఉత్సవాలు: స్కూటితో పాటు మహిళను ఈడ్చుకెళ్లిన దున్నపోతు
సాక్షి, హైదరాబాద్: సదర్ ఉత్సవాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరంలో విషాదం చోటు చేసుకుంది. దున్నపోతు హల్చల్ చేసింది. రోడ్డుమీదకు వచ్చిన దున్నపోతు కనిపించిన వారిని కనిపించినట్లు కుమ్మేయసాగింది. ఆ వివరాలు.. (చదవండి: గాంధీభవన్‌లో ‘సదర్’ వేడుకలు) ఖైరతాబాద్ చింతల్‌బస్తీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదకు వచ్చిన దున్నపోతు బీభత్సం సృష్టించింది. దానికి ఎదురుగా కనిపించిన వారి మీదకు పరిగెత్తింది. దున్నపోతును కట్టడి చేయడానికి ప్రయత్నించినప్పటికి వీలు కాలేదు. ఈ క్రమంలో దున్నపోతు స్కూటీతో పాటు మహిళను ఈడ్చుకెళ్లింది. దున్నపోతు దాడిలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. చివరకు కొందరు యువకులు ఖైరతాబాద్ చౌరస్తాలో దున్నపోతును పట్టుకున్నారు. చదవండి: ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి.. -
చింతల్‌బస్తీ బాలుడి కిడ్నాప్‌తో కలకలం..
బంజారాహిల్స్: ఖైరతాబాద్ సమీపంలోని చింతల్‌బస్తీలో నివసించే అయిదేళ్ళ బాలుడు ఎస్. అంకిత్‌కుమార్‌ను ఓ యువకుడు కిడ్నాప్ చేసి ఆటోలో తీసుకెళ్ళాడు. దీంతో చింతల్‌బస్తీలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. చింతల్‌బస్తీలో నివసించే రంజిత్‌కుమార్–అపర్ణ దంపతుల కుమారుడు అంకిత్ స్థానిక రేడియంట్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. ఈ నెల 20న అమ్మమ్మ ఈశ్వరమ్మ మనవడు అంకిత్‌తో కలిసి మెహిదీపట్నం రైతు బజార్‌కు కూరగాయలకు వెళ్ళింది. సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో కూరగాయలు తీసుకున్న తర్వాత మనవడికి సోడా తాగిద్దామని బయటకు రోడ్డు పక్కన ఆగింది. అదే సమయంలో ఓ యువకుడు అక్కడికి వచ్చి నమస్తే అమ్మా..! అంటూ పరిచయం చేసుకున్నాడు. నువ్వు ఫలానా టెంటుహౌజ్ అంకుల్ భార్యవు కదా అంటూ అడిగాడు. దాంతో ఆమె అవునని చెబుతుండగానే మనవడు టాయ్‌లెట్ వస్తుందంటూ పక్కకు వెళ్ళి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఒక వైపు ఆ యువకుడు మాట్లాడుతూనే ఆమె తేరుకునేలోపు సిద్ధంగా ఉంచిన ఆటోలో అంకిత్‌ను ఎక్కించుకొని పరారయ్యాడు. ఈ ఘటనతో ఆమె షాక్‌కు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా హుటాహుటిన అంతా అక్కడికి చేరుకొని చుట్టుపక్కల గాలించారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ యువకుడు ఆటోలో అంకిత్‌ను ఎక్కించుకొని పరారవుతున్న దృశ్యాలు సీసీ ఫుటేజీలో కనిపించాయి. వారం రోజుల నుంచి తల్లిదండ్రులతో పాటు పోలీసులు బాలుడి కోసం అణువణువు గాలిస్తున్నారు. ఇంత వరకు ఆచూకీ దొరకలేదని బాధితులు వాపోయారు. బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన వాడై ఉంటాడని బాధితులు అనుమానిస్తున్నారు. తెలిసిన వ్యక్తే తమను అనుసరిస్తూ పక్కా ప్రణాళిక ప్రకారం కిడ్నాప్‌చేసి ఉంటాడని పేర్కొన్నారు. ఆచూకి తెలిసిన వారు 7337420266 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
చింతల్ బస్తీలో రోడ్లు అస్తవ్యస్థం
-
తాగిన మత్తులో భర్తను చంపేసింది
హైదరాబాద్: తాగిన మైకంలో భర్తను చంపేసిందో భార్య. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని చింతలబస్తీలో జరిగింది. వివరాలివీ.. నల్లగొండ జిల్లా గౌరారం గ్రామానికి చెందిన వెంకటేష్, సుగుణ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి చింతలబస్తీలోని ఉంటున్నారు. కూలి పనులు చేసుకునే వెంకటేష్‌కు ప్రమాదవశాత్తు కాలు విరిగింది. అప్పటి నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో కుటుంబభారం సుగుణపై పడింది. ఈ క్రమంలో వారిమధ్య తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి దంపతులు మద్యం తాగి ఆ మత్తులో వాదులాడుకున్నారు. కోపంతో రెచ్చిపోయిన సుగుణ రాడ్‌తో భర్త తలపై బాదింది. దీంతో వెంకటేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. సోమవారం ఉదయం వరకు ఈ విషయం బయటకు రాలేదు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.