ఏ న్యాయమూర్తికి..ఏయే కేసులు | Roster Of Telangana High Court Detailed Report For Cases | Sakshi
Sakshi News home page

Telangana High Court: ఏ న్యాయమూర్తికి..ఏయే కేసులు

Published Thu, Jan 23 2025 9:01 AM | Last Updated on Thu, Jan 23 2025 10:29 AM

Roster Of Telangana High Court Detailed Report For Cases

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు సంబంధించి యాక్టింగ్‌ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుజోయ్‌పాల్‌ విధుల నిర్వహణ ప్రారంభించారు. ఇందులో భాగంగా న్యాయమూర్తులకు రోస్టర్‌ (ఏయే కేసులు ఎవరికి) కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైడ్రా(Hydra)కు పిటిషన్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో.. మున్సిపాలిటీస్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగం.. గతంలో జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ వద్ద ఉండగా, దాన్ని మళ్లీ ఆయన వద్దే ఉంచారు. హోం శాఖ పిటిషన్లను జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డికి, రెవెన్యూ విచారణను జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డికి అప్పగించారు. ఎప్పటిలాగే ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్‌) విచారణను.. సీజే ధర్మాసనం వద్దే ఉంచారు. బుధవారం నుంచి ఈ నూతన రోస్టర్‌ అమల్లోకి వచ్చింది.

యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ సుజోయ్‌పాల్, 
జస్టిస్‌ జి.రాధారాణి ధర్మాసనం (డివిజన్‌ బెంచ్‌–1)
2025 నుంచి ఆల్‌ రిట్‌ అప్పీళ్లు (సర్వీస్‌ అండ్‌ నాన్‌ సర్వీస్‌), మెడికల్‌ అడ్మిషన్‌ రిట్‌ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌), సుమోటో రిట్‌ పిటిషన్లు, ధిక్కరణ అప్పీళ్లు, క్రిమినల్‌ ధిక్కరణ కేసులు, ఆదాయపు పన్ను, వాణిజ్య పన్ను, జీఎస్టీ, రుణాల రికవరీ ట్రిబ్యునల్, సెక్యూరిటైజేషన్‌ చట్టాలు, సర్వీస్‌ నిబంధనలకు సంబంధించిన చట్టాలు, నియమాలు, చట్టబద్ధమైన నిబంధనలను సవాలు చేసే అన్ని రిట్‌ పిటిషన్లు, పర్యావరణ, కాలుష్య నియంత్రణ చట్టం మ్యాటర్స్, ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టానికి సంబంధించినవి, వాటినుంచి ఉత్పన్నమయ్యే రిట్‌ పిటిషన్లు, ఇరు రాష్ట్రాలకు ప్రాజెక్టుల కేసులు, ఇతర బెంచ్‌ల్లో పేర్కొనని రిట్‌ పిటిషన్లు, తెలంగాణ లోకాయుక్త, ఉప లోకాయుక్త చట్టం కింద రిట్‌ పిటిషన్లు, పేటెంట్‌ అప్పీళ్లకు లేఖలు. 
అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభం. శుక్రవారం మధ్యాహ్నం 1:30 వరకు..

యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ సుజోయ్‌పాల్, 
జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం (స్పెషల్‌ బెంచ్‌)
సీఎస్‌ 13/1958, సీఎస్‌ 14/1958.. అడ్మిషన్లు, మధ్యంతర, తుది విచారణ శుక్రవారం మధ్యాహ్నం 2.15 గంటల నుంచి...

యాక్టింగ్‌ సీజే జస్టిస్‌ సుజోయ్‌పాల్‌
ఆర్బిట్రేషన్, రాజీ చట్టం, 1996లోని సెక్షన్‌ 11 కింద దాఖలు చేసే దరఖాస్తులు  జస్టిస్‌ పి.శామ్‌ కోషి, జస్టిస్‌ నామవరపు 
రాజేశ్వర్‌రావు (డివిజన్‌ బెంచ్‌–2)
2024 సంవత్సరం వరకు రిట్‌ అప్పీళ్లు (నాన్‌–సర్వీస్‌)  (ఏదైనా ఉంటే.. తుది విచారణ, వదిలివేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ)

ఆదాయపు పన్ను ట్రిబ్యునల్‌ అప్పీళ్లు, ఆదాయపు పన్ను కేసులు, గిఫ్ట్‌ ట్యాక్స్‌ కేసులు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ అప్పీళ్లు, వెల్త్‌ ట్యాక్స్‌ కేసులు, వెల్త్‌ ట్యాక్స్‌ అప్పీళ్లు, అర్బిట్రేషన్‌ అండ్‌ కాన్సిలేషన్‌ చట్టం 1996 రిట్‌ పిటిషన్లు, వాణిజ్య అప్పీలేట్‌ విభాగ కేసులు, కమర్షియల్‌ కోర్ట్సు యాక్ట్‌–2015కు సంబంధించిన సివిల్‌ మిసిలేనియస్‌ అప్పీళ్లు, సివిల్‌ రివిజన్‌ పిటిషన్లు, డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌ అండ్‌ సెక్యూరిటైజేషన్‌ కింద దాఖలు చేసే దరఖాస్తులు, పిటిషన్లు, సీఆర్‌పీలు, ఇన్‌కమ్‌ ట్యాక్స్, కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్, కమర్షియల్‌ ట్యాక్స్‌ అండ్‌ జీఎస్టీ రిట్‌ పిటిషన్లు, రిఫర్‌ చేసిన కేసులు, పన్ను సవరణ కేసులు (టీఆర్‌సీలు అండ్‌ టీఆర్‌ఈవీసీలు), సుప్రీంకోర్టు లీవ్‌ పిటిషన్లు, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల సరీ్వస్, నాన్‌–సర్వీస్‌ అంశాలు, హైకోర్టు, జ్యుడిïÙయల్‌ సర్వీస్, జిల్లా కోర్టుల రిట్‌ పిటిషన్లు, మనీలాండరింగ్‌ నిరోధక చట్టం–2002 కింద ఉత్పన్నమయ్యే సివిల్‌ మిసిలేనియస్‌ సెకండ్‌ అప్పీళ్లు, వినియోగదారుల రక్షణ చట్టం–1986 రిట్‌ పిటిషన్లు, మోటార్‌ ప్రమాద సివిల్‌ ఇతర అప్పీళ్లు
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ  

జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, 
జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి (డివిజన్‌ బెంచ్‌–3)
2024 సంవత్సరం వరకు రిట్‌ అప్పీళ్లు (సర్వీస్‌),  
తుది విచారణ, వదిలేసిన అడ్మిషన్లు, ఇంటర్లోక్యుటరీ.. 
రిట్‌ పిటిషన్లు (సర్వీస్, క్యాట్, శ్యాట్‌), ల్యాండ్‌ గ్రాబింగ్‌ (ప్రొహిబిషన్‌) చట్టం–1982 రిట్‌ పిటిషన్లు, సిటీ సివిల్‌ కోర్టు అప్పీళ్లు, సివిల్‌ రివిజన్‌ పిటిషన్లు, భూ సేకరణ అప్పీల్‌ సూట్లు, భూ కబ్జా అప్పీళ్లు, స్పెషల్‌ అప్పీళ్లు, ఒరిజినల్‌ సైడ్‌ అప్పీళ్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ మౌషుమి భట్టాచార్య, 
జస్టిస్‌ పి.శ్రీసుధ (డివిజన్‌ బెంచ్‌–4)
2019 సంవత్సరం నుంచి క్రిమినల్‌ అప్పీళ్లు, హెబియస్‌ కార్పస్‌ మ్యాటర్స్, ఫ్యామిలీ కోర్టు అప్పీళ్లు, ఫస్ట్‌ అప్పీళ్లు, లీగల్‌ సరీ్వసెస్‌ అథారిటీ చట్టం–1987 రిట్‌ పిటిషన్లు, ఆల్‌ సీఎంఏలు (కమర్షియల్‌ కోర్టుల యాక్ట్‌ కాకుండా..) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌
కంపెనీ అప్లికేషన్లు, కంపెనీ పిటిషన్లు, కంపెనీ అప్పీళ్లు, రిఫర్డ్‌ కంపెనీ కేసులు, కమర్షియల్‌ డివిజన్‌ కేసులు, ఎగ్జిక్యూటివ్‌ పిటిషన్లు.. 
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): సెంట్రల్‌ గవర్నమెంట్, సెంట్రల్‌ గవర్నమెంట్‌ అండర్‌ టేకింగ్స్, సెంట్రల్‌ గవర్నమెంట్‌ కార్పొరేషన్స్, మైన్స్, ఇండస్ట్రీస్, కామర్స్, విద్య, భూ సేకరణ, హౌసింగ్‌ శాఖ, జనరల్‌ అడ్మిని్రస్టేషన్‌ డిపార్ట్‌మెంట్‌ అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ కె.లక్ష్మణ్‌
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): మున్సిపాలిటీస్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్, యూనివర్సిటీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులు, 2023, జనవరి 1 నుంచి 2024, జూలై 30 వరకు ఎఫ్‌ఐఆర్‌/చార్జిïÙట్ల రద్దు రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌), క్రిమినల్‌ పిటిషన్లు  అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): హోం, ఎక్సైజ్, లా అండ్‌ లెజిస్లేషన్‌ డిపార్ట్‌మెంట్, వక్ఫ్‌ బోర్డు, ల్యాండ్‌ రిఫామ్స్‌ కేసులు, తిరుమల తిరుపతి దేవస్థానం, ఎక్కడా పేర్కొనని రిట్‌ పిటిషన్లు, 2022 వరకు ఎఫ్‌ఐఆర్‌/చార్జిషీట్ల రద్దు రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌), క్రిమినల్‌ పిటిషన్లు  అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ పి.శ్రీసుధ
2014 మోటార్‌ యాక్సిడెంట్‌ సీఎంఏలు  
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
(సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్‌  జి.రాధారాణి
 2009 వరకు రిట్‌ పిటిషన్లు (సర్వీస్‌) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
(సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్‌ తుకారాంజీ
సెకండ్‌ అప్పీళ్లు: అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
 2013 వరకు మెటార్‌ యాక్సిడెంట్‌ సీఎంఏలు 
 అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ టి.మాధవీదేవి
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): పంచాయతీరాజ్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్, సివిల్‌ సప్‌లై అండ్‌ ఎసెన్షియల్‌ కమొడిటీస్, కో–ఆపరేటివ్‌ సొసైటీలు, ఫుడ్, అగ్రికల్చర్, మార్కెట్‌ కమిటీలు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
అడ్మిని్రస్టేటివ్‌ ట్రిబ్యునల్‌ నుంచి బదిలీ చేసిన రిట్‌ పిటిషన్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ కె.సురేందర్‌
క్రిమినల్‌ అప్పీళ్లు: అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
(సోమ, బుధ, శుక్రవారం.. ఉదయం 10.30 గంటల నుంచి)

జస్టిస్‌ కె.సురేందర్, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌ 
(స్పెషల్‌ డివిజన్‌ బెంచ్‌)
∙2018 వరకు క్రి మినల్‌ అప్పీళ్లు, క్రి మినల్‌ కన్ఫర్మేషన్‌ 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ సూరేపల్లి నందా
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): సాంఘిక, గిరిజన, బీసీ, మైనారిటీ సంక్షేమం, మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమం, స్టేట్‌ కార్పొరేషన్లు, అండర్‌ టేకింగ్స్‌ 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ జువ్వాడి శ్రీదేవి
2024, జూలై 1 నుంచి ఎఫ్‌ఐఆర్‌/చార్జిషీట్ల రద్దు రిట్‌ పిటిషన్లు(నాన్‌ సర్వీస్‌), క్రిమినల్‌ పిటిషన్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ ఎన్‌వీ శ్రావణ్‌కుమార్‌
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): స్టాంప్స్‌ అండ్‌ రిజి్రస్టేషన్, ఎనర్జీ, పర్యావరణం, అటవీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మత్స్య పరిశ్రమ, పశు సంవర్థకం, ఎండోమెంట్‌ 
 అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 10.30 గంటల నుంచి.. 
శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు.. ఆ తర్వాత స్పెషల్‌ బెంచ్‌ విధులు 

జస్టిస్‌ ఎంజీ ప్రియదర్శిని
2016 నుంచి మెటార్‌ యాక్సిడెంట్‌ సీఎంఏలు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): 2019 నుంచి రెవెన్యూ పిటిషన్లు, అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్, ఇరిగేషన్‌ అండ్‌ కమాండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌.. 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌
క్రిమినల్‌ రివిజన్‌ కేసులు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ నగేశ్‌ భీమపాక
2018 నుంచి 2021 వరకు రిట్‌ పిటిషన్లు (సర్వీస్‌) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌): ట్రాన్స్‌పోర్టు, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్, ఫ్యాక్టరీలు, లేబర్‌ మ్యాటర్స్, ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్, ట్రైనింగ్, యూత్‌ సరీ్వస్, స్పోర్ట్స్, హెల్త్, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ సంక్షేమం, సమాచార హక్కు చట్టం 2005, ఆర్థికం, ప్రణాళిక 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
సివిల్‌ మిసిలేనియస్‌ అప్పీళ్లు, సివిల్‌ మిసిలేనియస్‌ సెకండ్‌ అప్పీళ్లు 
  అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ పుల్ల కార్తీక్‌
2022 నుంచి రిట్‌ పిటిషన్లు (సర్వీస్‌) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ కె.శరత్‌
2018 వరకు రెవెన్యూ రిట్‌ పిటిషన్లు (నాన్‌ సర్వీస్‌) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ జె.శ్రీనివాస్‌రావు
ఫస్ట్‌ అప్పీళ్లు, సిటీ సివిల్‌ కోర్టు అప్పీళ్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ

జస్టిస్‌ నామవరపు రాజేశ్వర్‌రావు
2010 నుంచి 2012 వరకు రిట్‌ పిటిషన్లు (సర్వీస్‌) 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
  (సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి
2015.. మోటార్‌ యాక్సిడెంట్‌ సీఎంఏలు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
(సింగిల్‌గా ఉన్నప్పుడు విచారణ)

జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌
2013 నుంచి 2017 వరకు రిట్‌ పిటిషన్లు (సర్వీస్‌) 
 అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
(సోమవారం, బుధవారం, శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచి..)

జస్టిస్‌ కె.సుజన
బెయిల్స్, ట్రాన్స్‌ఫర్‌ క్రిమినల్‌ పిటిషన్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
సివిల్‌ అడ్మిషన్లు: 2024, సెపె్టంబర్‌ 21 నుంచి సివిల్‌ రివిజన్‌ పిటిషన్లు, ఒరిజినల్‌ సివిల్‌ సూట్స్, ఒరిజినల్‌ పిటిషన్లు, ట్రాన్స్‌ఫర్‌ సివిల్‌ మిసిలేనియస్‌ పిటిషన్లు 
అడ్మిషన్, ఇంటర్లోక్యుటరీ, తుది విచారణ 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement