roster
-
హైకోర్టు ‘రోస్టర్’లో సమూల మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తులు విచారించే సబ్జెక్టుల్లో (రోస్టర్‌లో) సమూల మార్పులు జరిగాయి. హైకోర్టుకు కొత్తగా నలుగురు న్యాయమూర్తులు వచ్చిన నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ మార్పులు చేశారు. కొత్త న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లకు సీనియర్ న్యాయమూర్తుల పక్కన ధర్మాసనాల్లో స్థానం కల్పించారు. జస్టిస్ నూనెపల్లి హరినాథ్‌కు సింగిల్ జడ్జిగా బాధ్యతలు అప్పగించారు. కీలకమైన బెయిల్ పిటిషన్లను ఎవరూ ఊహించని విధంగా న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అప్పగించారు. వీటితోపాటు 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలను కూడా జస్టిస్ మల్లికార్జునరావు విచారించాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో బెయిల్, మధ్యంతర బెయిల్ కోరుతూ మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యాలు సోమవారం జస్టిస్ మల్లికార్జునరావు ముందు లిస్ట్ అయ్యాయి. అలాగే కీలకమైన క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతలను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. సీఆర్పీసీ సెక్షన్ 482 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లతో పాటు అధికరణ 226 కింద దాఖలు చేసే క్వాష్ పిటిషన్లను సైతం ఆమే విచారిస్తారు. ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2022 తరువాత దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ భానుమతే విచారిస్తారు. మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)కు సంబంధించిన కేసులను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు కేటాయించారు. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్ కుంభకోణాలతో పాటు గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులు తదితరాలపై సమీక్ష జరిపేందుకు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 1411, మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆ ఆక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవో 344ను సవాలు చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై జస్టిస్ నిమ్మగడ్డ విచారణ జరుపుతారు. రోస్టర్ అమల్లోకి వచ్చే సోమవారం నాడే టీడీపీ నేతల వ్యాజ్యాలు జస్టిస్ నిమ్మగడ్డ ముందుకు విచారణకు రానున్నాయి. పురపాలక శాఖ, ఏపీసీఆర్డీఏ, ఏఎంఆర్డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి విచారిస్తారు. రెవెన్యూ, భూ సేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవికి అప్పగించారు. మొన్నటివరకు బెయిల్ పిటిషన్లను విచారించిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డికి ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలని కోరుతూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ల విచారణ బాధ్యతలు అప్పగించారు. 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను కూడా జస్టిస్ సురేష్‌రెడ్డి విచారిస్తారు. మొన్నటి వరకు క్వాష్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్ల కేసులను అప్పగించారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన వ్యాజ్యాలను కేటాయించారు. ఒకట్రెండు రోజుల్లో రోస్టర్‌లో స్వల్ప మార్పులు హైకోర్టు జడ్జిలు జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దుప్పల వెంకటరమణ బదిలీపై వేరే హైకోర్టులకు వెళుతున్నందున ఈ రోస్టర్‌లో కూడా ఒకటి రెండు రోజుల్లో స్వల్ప మార్పులు జరిగే అవకాశం ఉంది. వారు వెళ్లిన తరువాత తాజా రోస్టర్‌లో కేటాయించిన సబ్జెక్టులను ఇతర న్యాయమూర్తులకు కేటాయిస్తారు. అలాగే కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీపై వస్తున్న జస్టిస్ జి.నరేంద్ర ఇక్కడ ప్రమాణం చేసిన తరువాత ఆయనకు కొన్ని సబ్జెక్టులను కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తాజా రోస్టర్‌లో కొద్దిపాటి మార్పులు చేయనున్నారు. -
సీజే రోస్టర్‌కే జడ్జీలు కట్టుబడి ఉండాలి
సాక్షి, అమరావతి: ప్రధాన న్యాయమూర్తి (సీజే) మాత్రమే నిర్ణయించే రోస్టర్ (ఏ న్యాయమూర్తులు ఏ రకమైన కేసులు వినాలి)ను అనుసరించే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి కేటాయించని కేసుపై న్యాయమూర్తులు విచారణ జరపడం తీవ్రమైన అనౌచిత్యమని స్పష్టంచేసింది. న్యాయమూర్తులందరూ కూడా ప్రధాన న్యాయమూర్తి నిర్ధేశించిన రోస్టర్‌కు కట్టుబడి ఉండాలని తేల్చిచెప్పింది. అలాగే, వారంతా క్రమశిక్షణతో వ్యవహరించాలని, సీజే కేటాయించిన కేసు తప్ప మరే ఇతర కేసును విచారించడానికి వీల్లేదని తెలిపింది. రోస్టర్ ప్రకారం నిర్ధిష్ట కేటగిరి కింద తమ ముందుకొచ్చిన కేసును విచారించడం లేదా సీజే నిర్ధిష్టంగా అప్పగించిన కేసును విచారించడం మాత్రమే న్యాయమూర్తులు చేయాల్సి ఉంటుందని ‘సుప్రీం’ స్పష్టంచేసింది. అలాగే, కొందరు కక్షిదారులు తాము అనుకున్న ఉత్తర్వులు పొందేందుకు తమ కేసును నిర్ధిష్టంగా ఓ న్యాయమూర్తి వద్దకు వచ్చేలా చేయడం.. ఉత్తర్వులిచ్చే అవకాశంలేని న్యాయమూర్తి ముందు నుంచి తమ కేసును తప్పించడం వంటి అనైతిక చర్యలకు పాల్పడుతుండటాన్ని కూడా సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఈ విధంగా ఫోరం షాపింగ్ (కావాల్సిన జడ్జి వద్దకు కేసు వచ్చేలా చేయడం, కేసు రాకుండా చేయడం)కు పాల్పడడం ఎంతమాత్రం సరికాదంది. తమ ముందున్న కేసులో కక్షిదారులు వ్యవహరించిన తీరు విస్మయకరమంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఫోరం షాపింగ్‌కు పాల్పడినందుకు ఆ కక్షిదారులకు రూ.50వేల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ఇటీవల తీర్పు వెలువరించారు. మొదటక్వాష్.. పనికాకపోవడంతో రిట్ పిటిషన్.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజస్థాన్‌కు చెందిన నలుగురు వ్యక్తులపై వేర్వేరుగా ఆరు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఈ రెండు ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ నలుగురు వ్యక్తులు రాజస్థాన్ హైకోర్టులో సీఆర్పీసీ సెక్షన్–482 కింద క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఈ ఏడాది ఏప్రిల్ 23న విచారణ జరిపిన న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులు కోరిన విధంగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో ఆ నలుగురు వ్యూహం మార్చి ఆరు ఎఫ్ఐఆర్లను కలిపేసి, వాటన్నింటినీ ఒకే ఎఫ్ఐఆర్గా పరిగణించాలని కోరుతూ 8 మే 2023న సివిల్ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన మరో న్యాయమూర్తి ఆ నలుగురు వ్యక్తులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఫిర్యాదుదారు అంబలాల్ పరిహార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపింది. ఆ నలుగురు వ్యక్తులు కూడా గతంలో తమకు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించిన న్యాయమూర్తి ముందు తిరిగి తమ కేసు రాకుండా చేసేందుకే ఎఫ్ఐఆర్లన్నింటినీ కలపాలంటూ పిటిషన్ దాఖలు చేశారని అంబలాల్ తన పిటిషన్లో ఆరోపించారు. అంతేకాక.. ఎనిమిది ఎఫ్ఐఆర్లలో తమపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని కూడా కోరారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పైపెచ్చు ఫిర్యాదుదారులను అసలు ప్రతివాదులుగా చేర్చలేదని వివరించారు. ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ఉదాహరణ.. వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం.. గతంలో ఎఫ్ఐఆర్లను కొట్టేయాలంటూ క్రిమినల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది, ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ సివిల్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఒకరేనని గుర్తించింది. ఫోరం షాపింగ్‌కు ఈ కేసు ఓ ప్రామాణిక ఉదాహరణని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. అంతేగాక.. న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి ఈ కేసు ఓ మచ్చుతునకని కూడా తెలిపింది. ఎఫ్ఐఆర్లన్నింటినీ కలిపేయాలంటూ దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్‌ను అసలు ఎలా విచారించారంటూ విస్మయం వ్యక్తంచేసింది. క్రిమినల్ కేసులను విచారించేందుకు సీజే నిర్ధిష్ట రోస్టర్‌ను ఖరారు చేశారని.. ఈ కేసులో నలుగురు నిందితులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను న్యాయస్థానాలు అనుమతిస్తూ వెళ్తే సీజే నిర్ధేశించే రోస్టర్‌కు ఎంతమాత్రం విలువ ఉండదని తేల్చిచెప్పింది. ఆ నలుగురు వ్యక్తులు మరో న్యాయమూర్తి ముందు దాఖలు చేసిన సివిల్ రిట్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తెలిపింది. ఈ నలుగురు వ్యక్తుల వ్యవహారశైలిని సెక్షన్–482 కింద వీరి పిటిషన్లను విచారిస్తున్న న్యాయమూర్తి దృష్టికి తీసుకురావాలని స్పష్టంచేసింది. ‘ఫోరం షాపింగ్’ బాబు బ్యాచ్‌కు కొట్టిన పిండి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు విభజిత ఏపీ హైకోర్టులో కూడా ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది చంద్రబాబు అండ్ కోనే. గతంలో ఎన్నడూ వినని, తెలియని ఫోరం షాపింగ్, నాట్ బిఫోర్ వంటి వాటిని సామాన్య జనానికి తెలిసేలా చేసింది ఆ బ్యాచే. గతంలో చంద్రబాబు ఈ ‘ఫోరం షాపింగ్’ ను అడ్డంపెట్టుకుని ఎన్నో కేసుల నుంచి బయటపడ్డ ఉదంతాలున్నాయి. ♦ అక్రమాస్తులకు సంబంధించి లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్లో చంద్రబాబు ఏ రకంగా వ్యవహరించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ♦ రామోజీ, చంద్రబాబు తదితరుల అక్రమార్జనపై వైఎస్ విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలోనూ చంద్రబాబు అండ్ కో వేసిన నాట్ బిఫోర్ నాటకాలతో న్యాయవ్యవస్థే విస్మయం చెందింది. ♦ ఫలానా న్యాయమూర్తి తమకు అనుకూలంగా ఉత్తర్వులివ్వరని భావిస్తే, అతనిపైకి కొందరు న్యాయవాదులను ఉసిగొల్పి, ఆ న్యాయమూర్తితో ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని ఆ కేసు విచారణ నుంచి ఆ న్యాయమూర్తులు తప్పుకునేలా చేసిన కేసులూ ఎన్నో. ♦ ఇలా న్యాయమూర్తులతో గొడవలు పెట్టుకున్నందుకు ఆ న్యాయవాదులకు పెద్ద మొత్తాల్లో డబ్బు ముట్టజెప్పిన సంగతి న్యాయవర్గాల్లో అందరికీ తెలుసు. ♦ తాజాగా.. ఓ కేసులో కూడా చంద్రబాబు బృందం ఇలానే ఫోరం షాపింగ్‌కు పాల్పడింది. దీనిపై ప్రస్తుతం న్యాయవర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. -
ఇక కొత్త రోస్టర్.. ఎస్టీ రిజర్వేషన్లు 10శాతానికి పెరగడంతో భారీ మార్పులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో నూతన రోస్టర్ రూపకల్పన అనివార్యమైంది. ఇప్పటివరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6 శాతం ఉండగా తాజాగా 10 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గిరిజను లకు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలంటే ప్రభుత్వం పెంచిన రిజర్వేషన్ల శాతానికి తగినట్లుగా గిరిజనుల వాటాను క్రమపద్ధతిలో సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్ల అమలుకు రోస్టర్ పాయింట్లే కీలకం. ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల్లోకి ప్రవేశాల్లో రోస్టర్ ప్రాతిపదికన కేటాయింపులు జరుపుతున్నారు. ఇప్పటివరకు ప్రతి వందలో 8, 25, 33, 58, 75, 83 స్థానాలను ఎస్టీలకు రిజర్వ్ చేసి ఈ లెక్కన ఉద్యోగ కేటా యింపులు, విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇస్తూ వచ్చారు. తాజాగా రిజర్వేషన్లు 10 శాతానికి పెంచడంతో ఆ మేరకు ఎస్టీ రిజర్వేషన్ స్థానాలను ఖరారు చేయాల్సి ఉంది. దసరా తర్వాతే స్పష్టత... గిరిజన రిజర్వేషన్ల పెంపు అమలుకు రోస్టర్ సిద్ధం కావాల్సి ఉండటం, ఇందుకు కాస్త సమయం పట్టనుండటం, దసరా సెలవుల అనంతరం రెండో శనివారం, ఆదివారం సెలవు ఉండటంతో కొత్త రోస్టర్‌పై కాస్త సందిగ్ధం నెలకొంది. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినా వరుస సెలవులతో మరో రెండ్రోజులు ఈ ప్రక్రియ వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో దసరా సెలవుల తర్వాతే నూతన రోస్టర్‌పై స్పష్టత వస్తుందని అధికార వర్గాల సమాచారం. ప్రతి పదిలో ఒకటిగా... ప్రస్తుత రోస్టర్ చార్ట్‌లో 6 శాతం ప్రకారం కేటాయించిన స్థానాలతోపాటు అదనపు స్థానాల్లో 4 శాతం కోటాను సర్దుబాటు చేసే అవకాశం లేదు. దీంతో కోటా 6% ఉన్నప్పుడు పోస్టుల మధ్య పాటించిన అంతరాన్ని తగ్గించాల్సి ఉంది. ఈ క్రమంలో వంద సీట్లలో 10 శాతం కేటాయింపులు జరపాల్సి వస్తే ప్రతి పదిలో ఒకటి చొప్పున స్థానాన్ని సర్దుబాటు చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అలాగని ప్రతి పదో నంబర్‌ను కేటాయిస్తే దూరం పెరుగుతుందని భావిస్తున్న అధికారులు... ఆ సంఖ్యను కాస్త తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అత్యంత వెనుకబడ్డ వర్గంగా ఉన్న షెడ్యూల్డ్ ట్రైబ్‌లకు తాజా రోస్టర్ న్యాయబద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో ఈ దిశగా రోస్టర్ పాయింట్లు సర్దుబాటు చేయాలని, వీలైనంత వెంటనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయవచ్చని సీఎం ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. చదవండి: కాంగ్రెస్ జీ-23 గ్రూప్‌పై శశిథరూర్ కీలక వ్యాఖ్యలు -
Telangana: కొలువుల భర్తీకి కొత్త రోస్టర్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీల భర్తీలో కీలకమైన రోస్టర్ పట్టిక ఒకటో నంబర్ నుంచి అమల్లోకి రానుంది. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో రోస్టర్ పాయింట్లు సైతం మొదటి నుంచి పరిగణనలోకి తీసుకోవడం అనివార్యం కానుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పుడు తెలంగాణలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉన్నాయి. జిల్లా, జోన్లు ఆధారంగా నియామకాలు చేపట్టే క్రమంలో ప్రభుత్వం రోస్టర్‌ను ఒకటో నంబర్ నుంచి అమలు చేసింది. ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో అప్పట్లో ఆ విధానాన్ని ఎంచుకోగా... ఇప్పుడు నూతన జోనల్ విధానం అమల్లోకి రావడంతో మరోమారు రోస్టర్ పాయింట్లు క్రమసంఖ్య ఒకటి నుంచి అమలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రిజర్వ్ చేసిన పాయింట్ల ఆధారంగా రోస్టర్‌ను కొనసాగించే వీలు లేకపోవడం, ఈడబ్ల్యూఎస్‌కు పదిశాతం కోటా ఇవ్వాల్సి రావడంతో కొత్తగా రోస్టర్ పాయింట్ల అమలు దిశగా ఉన్నతాధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. నూతన జోనల్ విధానం ప్రకారం ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో పోస్టుల విభజన, ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. ప్రస్తుతం శాఖల వారీగా ఖాళీలపై స్పష్టత రాగా, కొత్త నియామకాల విషయంలో రోస్టర్ అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మారిన కేడర్... కొత్త రోస్టర్ రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమలుతో ఉద్యోగ కేడర్లలో భారీ మార్పులు జరిగాయి. తెలంగాణ ఏర్పాటైన సమయంలో పది జిల్లాలు, రెండు జోన్లు ఉండగా.. ఇప్పుడు 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు మల్టీ జోన్లు ఏర్పాటయ్యాయి. ఇదివరకు జిల్లా స్థాయిలో ఉన్న పోస్టుల్లో కేవలం నాల్గోతరగతి, సబార్డినేట్ పోస్టులు మాత్రమే జిల్లా కేడర్‌లోకి వచ్చాయి. మిగతా పోస్టులు జోనల్ స్థాయిలోకి చేర్చారు. అదేవిధంగా ఇదివరకు జోనల్ స్థాయిలో ఉన్న పోస్టులు మల్టీ జోనల్ కేడర్‌లోకి చేర్చారు. దీంతో ఇదివరకున్న కేడర్‌తో నియామకాలు చేపట్టడం సాధ్యం కాదు. అదీగాక రోస్టర్ పాయింట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా నంబర్లను ఖరారు చేయాలి. ఆ తర్వాత ఖరారైన రోస్టర్‌ను ఒకటో క్రమ సంఖ్య నుంచి అమలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగ ఖాళీలు 65వేలు? కొత్త జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపులు పూర్తవడంతో ఖాళీలపై ఒక అంచనా వచ్చింది. అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 65వేల ఖాళీలు ఉన్నట్లు సమాచారం. వీటిలో ప్రత్యక్షంగా భర్తీ చేసే ఉద్యోగాలు, పదోన్నతుల ద్వారా నింపే ఉద్యోగాలపై ప్రభుత్వ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ప్రత్యక్షంగా భర్తీ చేసే నియామకాలకు నోటిఫికేషన్లను నియామక బోర్డుల ద్వారా చేపట్టాలి. ఇందుకోసం ఆయా శాఖలు రోస్టర్ పాయింట్ల ఆధారంగా ప్రతిపాదనలను ప్రభుత్వ ఆమోదంతో ఆయా బోర్డులకు సమర్పించాలి. అయితే కొత్త రోస్టర్‌పై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు నోటిఫికేషన్లు వచ్చే అవకాశం లేదు. ఏమిటీ రోస్టర్? ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీలో రిజర్వేషన్లు క్రమపద్ధతిలో అమలు చేసే విధానమే రోస్టర్. రోస్టర్ పాయింట్లు ఒకటి నుంచి వంద వరకు ఉంటాయి. ఒకటో క్రమసంఖ్య జనరల్ మహిళతో మొదలవుతుంది. జనరల్ మహిళ, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్, ఎస్టీ మహిళ, ఎస్టీ జనరల్, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీలో మహిళలు, జనరల్, డిజేబుల్ మహిళ, డిజేబుల్ జనరల్ కేటగిరీలకు ఒక్కో క్రమసంఖ్యను రోస్టర్ పాయింట్లలో ఖరారు చేశారు. ఈ పాయింట్ల ఆధారంగా కొత్త నియామకాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకసారి రోస్టర్ అమలు చేసి ఎంపిక పూర్తి చేస్తే... ఏ పాయింట్ దగ్గర నియామకాలు పూర్తవుతాయో... తిరిగి నియామకాలు చేపట్టినప్పుడు ఆ పాయింట్ నుంచే క్రమసంఖ్యను కొనసాగించి నియామకాలు చేపడతారు. దీంతో రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. -
హైకోర్టులో మారిన రోస్టర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టులో రోస్టర్ మారింది. ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి బాధ్యతలు చేపట్టిన తరువాత పూర్తిస్థాయిలో రోస్టర్ మార్చడం ఇదే తొలిసారి. ఈ నెల 26న మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తులు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ప్రత్యేకంగా కేసులు విచారించనుంది. అయితే, ఏ కేసులు విచారించనుందో స్పష్టంగా పేర్కొనలేదు. మూడు రాజధానులకు సంబంధించిన కేసులనే త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నట్టు తెలిసింది. ఆ రోజున రాజధానుల కేసుల విచారణ విధి, విధానాలను ఖరారు చేసే అవకాశం ఉంది. గతంలో ఈ కేసులను అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. జస్టిస్ మహేశ్వరి బదిలీ కావడంతో ఆ కేసుల విచారణ మళ్లీ మొదటకొచ్చింది. ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు కావడంతో రాజధాని కేసుల్లో కదలిక వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రోస్టర్ మార్పులు ఇలా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోస్వామి రోస్టర్‌లో కీలక మార్పులే చేశారు. తాజా రోస్టర్ ప్రకారం.. కీలక శాఖలైన గనులు, పరిశ్రమలు, రహదారులు, భవనాలకు సంబంధించిన కేసులను జస్టిస్ బట్టు దేవానంద్ విచారించనున్నారు. క్వాష్ పిటిషన్లు, హోం శాఖకు సంబంధించిన వ్యాజ్యాలను ఇకపై జస్టిస్ రావు రఘునందన్‌రావు విచారించనున్నారు. బెయిల్ పిటిషన్లు, క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, క్రిమినల్ ట్రాన్స్ఫర్ పిటిషన్లను జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ విచారిస్తారు. అత్యంత కీలకమైన రెవెన్యూ కేసులను జస్టిస్ మఠం వెంకటరమణకు అప్పగించారు. పంచాయతీలు, మునిసిపాలిటీలు, సీఆర్డీఏ కేసులను జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ విచారిస్తారు. -
‘కేసుల కేటాయింపు’పై తీర్పు రిజర్వు
న్యూఢిల్లీ: కేసుల కేటాయింపు (రోస్టర్)పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక అధికారాలను తొలగించాలన్న పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో ఉంచింది. కేసుల కేటాయింపు బాధ్యతను ఐదుగురు జడ్జీల కొలీజియంకు అప్పగించాలని కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ వేసిన పిటిషన్ ను శుక్రవారం సుప్రీంకోర్టు విచారించింది. ఫలానా కేసు తనకు కేటాయించలేదని లేదా ఎందుకు కేటాయించరంటూ కొందరు జడ్జీలు అసంతృప్తికి గురయిన సందర్భాలు కూడా హైకోర్టుల్లో ఉన్నాయని విచారణ సందర్భంగా జడ్జి సిక్రి అన్నారు. పిటిషనర్ తరఫున దుశ్యంత్ దవే, ప్రశాంత్ భూషణ్ వాదిస్తూ.. సున్నితమైన కొన్ని కేసుల బాధ్యతను కొన్ని బెంచ్‌లకే అప్పగించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ‘మాస్టర్ రోస్టర్’గా సీజేఐకు అపరిమిత అధికారం ఉన్నట్లు కాదని తెలిపారు. సుప్రీంజడ్జిగా ఇందూ ప్రమాణం సీనియర్ న్యాయవాది ఇందూ మల్హోత్రా(61) సుప్రీం న్యాయమూర్తిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మిశ్రా ఆమెతో ప్రమాణం చేయించారు. ఈమె రాకతో సుప్రీంజడ్జీల సంఖ్య 25కు చేరుకుంది. దీంతో న్యాయవాది నుంచి నేరుగా సుప్రీం కోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె నిలిచారు. సుప్రీం చరిత్రలో ఒకేసారి ఇద్దరు మహిళా జడ్జీలు పనిచేయడం ఇది మూడోసారి. -
రోస్టర్ విధానానికి సుప్రీం ఆమోదం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కేసుల కేటాయింపునకు సంబంధించిన రోస్టర్ విధానాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆమోదించింది. ఆ మేరకు సీజేఐ ఉత్తర్వుల కాపీని సుప్రీంకోర్టు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఈ ఉత్తర్వు ల ప్రకారం.. కొత్త కేసులకు సంబంధించి రోస్టర్ విధానం ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి రానుంది. పిల్లు, ముఖ్యమైన కేసుల్ని జూనియర్ న్యాయ మూర్తులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీ వల సుప్రీంలోని అత్యంత సీనియర్ న్యాయమూ ర్తులు జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ప్రశ్నించిన నేపథ్యంలో రోస్టర్ విధా నాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ప్రాధా న్యం సంతరించుకుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యా లకు సంబంధించిన కేసుల కేటాయింపుల్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఒక్కరే నిర్ణయిస్తారని 13 పేజీల నోటిఫికేషన్లో వెల్లడించారు. లేఖల రూపంలో వచ్చే పిటిషన్లు, ఎన్నికల కేసులు, కోర్టు ధిక్కార కేసులు, రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన కేసుల్ని, తన నేతృత్వం లోని ధర్మాసనానికి సీజేఐ కేటాయించుకున్నారు. సీజేఐ, మరో 11 మంది న్యాయమూరు ్తలైన జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఆర్కే అగర్వాల్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్‌ల ధర్మాసనాలు విచారించనున్న కేసుల అంశాలను వెబ్సైట్లో ఉంచారు. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం.. కార్మిక, పరోక్ష పన్నులు, భూ సేకరణ, పరిహారం, క్రిమినల్ అంశాల్ని విచారిస్తుంది. జస్టిస్ గొగోయ్ ధర్మసనానికి కార్మిక, పరోక్ష పన్నులు, కంపెనీ చట్టాలు, ట్రాయ్, సెబీ, ఆర్బీఐ, క్రిమినల్, తదితర అంశాల్ని, జస్టిస్ లోకూర్ ధర్మాసనానికి సేవా రంగం, సామాజిక న్యాయం, వ్యక్తిగత చట్టాలు, భూసేకరణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాల్ని కేటాయించారు. ఇక జస్టిస్ జోసెఫ్ ధర్మా సనం కార్మిక, కోర్టు ధిక్కారం, వ్యక్తిగత చట్టాల కిందకు వచ్చే కేసుల్ని విచారిస్తుంది. -
సుప్రీం కోర్టులో కొత్త రోస్టర్
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తుల కేసు విచారణ రోస్టర్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా తొలిసారి బయటకు ప్రకటించారు. ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు స్వీకరించే కేసుల టేకప్కు సంబంధించి రోస్టర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ రోస్టర్‌లో కేవలం కొత్త కేసులకు మాత్రమే వర్తించనుంది. సుప్రీం కోర్టు వెబ్సైట్లో రోస్టర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. కాగా, రోస్టర్ విధానంపై కొద్ది రోజుల క్రితం దేశ అత్యున్నత న్యాయస్థానంలో సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. కొత్త రోస్టర్ ప్రకారం.. సీజేఐ ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, ఎన్నికల వివాదాల కేసులు, నేర సంబంధిత కేసులు, సామాజిక న్యాయానికి సంబంధించిన కేసులను విచారిస్తారు. అవసరమైన సమయంలో రాజ్యాంగ బెంచ్‌ను ఏర్పాటు చేస్తారు. ప్రత్యేక విచారణల నిమిత్తం విచారణ కమిషన్లను కూడా ఏర్పరుస్తారు. సుప్రీం కోర్టులో నెంబర్ 2 సీనియర్ జడ్జిగా ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కార్మిక, పరోక్ష పన్నులు, నేర సంబంధిత అంశాలు, వినియోగదారుల రక్షణ కేసులను విచారిస్తారు. -
ఉద్యోగాల భర్తీలో రోస్టర్ తప్పనిసరి
► బీఎస్ రాములు సాక్షి, హైదరా బాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు రోస్టర్ విధానాన్ని తప్పకుండా పాటించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు స్పష్టం చేశారు. రోస్టర్‌లో తప్పులు దొర్లితే అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత ఉంటే ఉపాధి తప్పక దొరుకుతుందన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం ఓన్ యువర్ కార్, షీక్యాబ్స్ లాంటి పథకాలతో యువతను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పథకాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. -
రోస్టర్ పాయింట్ పాటిస్తే ఒట్టు
– డీసీసీబీ పోస్టుల భర్తీలో సీఫారసులకే పెద్దపీట – బడుగు, బలహీన వర్గాలకు మొండిచెయ్యి – ప్రభుత్వ ఉత్తర్వులకు తూట్లు కర్నూలు(అగ్రికల్చర్): అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వరంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో చేపట్టే నియామకాల్లో రోస్టర్ విధానం పాటించాలి. ఈ మేరకు ప్రభుత్వం సర్కులర్ మెమో కూడా జారీ చేసింది. అయితే జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు మాత్రం సర్కారు ఉత్తర్వులు వర్తించడం లేదు. అవుట్ సోర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ విధానం పాటించడమేమింటని ప్రశ్నిస్తుండటం గమనార్హం. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఏడాదిన్నర కాలంగా 35 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు, 15 వరకు అటెండర్ కమ్ మెసెంజర్ పోస్టులు అవుట్ సోర్సింగ్‌పై భర్తీ చేశారు. ఇందుకు నోటిఫికేషన్ ఇవ్వడంకానీ, రోస్టర్ విధానం పాటించడం కానీ జరగలేదు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు పొలిటికల్ బాడీ ఉండటం, దానిపై అధికార పార్టీ ప్రభావం అధికంగా ఉండడంతో పోస్టులన్నీ సిఫారసుల మేరకు భర్తీ చేశారు. రాజకీయ పలుకుబడి లేని బడుగు, బలహీనవర్గాల వారికి ఏ ఒక్క పోస్టూ దక్కిన దాఖలాలు లేవు. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల పంపకాలు.. జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో స్టాఫ్ అసిస్టెంట్ల కొరత ఉంది. స్టాఫ్ అసిస్టెంట్లు అంటే క్యాషియర్, క్లర్క్‌తో సమానమైన ఉద్యోగాలు. ఈ పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో అవుట్ సోర్సింగ్‌పై 35 పోస్టుల భర్తీకి బోర్డు సమావేశంలో తీర్మానించారు. అయితే నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి రోస్టర్ విధానం ప్రకారం భర్తీ చేయాల్సి ఉంది. అయితే పాలకవర్గ సభ్యులు ఈ పోస్టులను పంచుకున్నట్లు తెలుస్తుంది. ఒక్కో పోస్టుకు రూ.50 వేలు, అంతకు మించి తీసుకుని అనుకూలమైన వారిని సిఫారసు చేసినట్లు ఆరోపణలున్నాయి. మెసెంజర్ కమ్ అటెండర్ పోస్టుల భర్తీదీ ఇదే పరిస్థితి కావడం గమనార్హం. రోస్టర్ విధానం పాటించాల్సిందే.. స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో రోస్టర్ విధానం పాటించాల్సి ఉందని బ్యాంకు అధికారులే చెబుతున్నారు. అయితే పొలిటికల్ బాడీ ఉన్నందునా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. పాలకవర్గంలో 21 మంది డైరెక్టర్లుంటారు. ఇటు అధికారపార్టీ నేతలు, అటు డైరెక్టర్ల సిఫారసులు వెల్లువెత్తుతుండటంతో సాధారణ వ్యక్తులకు ఉద్యోగాలు దక్కని పరిస్థితి ఏర్పడింది. ఎవరికి వారు అవుట్ సోర్సింగ్ పోస్టులను అమ్ముకున్నారనే విమర్శలున్నాయి. టెంపరరీ పోస్టులు, ఆపై అవుట్ సోర్సింగ్.. అందుకే పాటించలేదు... స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికపై అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేశాం. ఆరు నెలలు, ఏడాది పని చేసే పోస్టులకు నోటిఫికేషన్, రోస్టర్ అవసరం ఏముంది. త్వరలోనే రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నాం. అప్పుడు నోటిఫికేషన్, రోస్టర్ అన్నీ పాటిస్తాము. ఆరు నెలలు, ఏడాది పనిచేయడానికి ఎవ్వరూ డబ్బులు ఇవ్వరు. అవుట్ సోర్సింగ్‌పై భర్తీ చేసే కిందిస్థాయి పోస్టులకు రోస్టర్ పాయింట్ అవసరం లేదు. – రామాంజనేయులు, సీఈఓ, కేడీసీసీబీ -
గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాల (బాలికలు)లో ఐదో తరగతిలో ప్రవేశాని కి దర ఖాస్తులు ఆహ్వానిస్తున్నామని స్థాని క హౌసింగ్ బోర్డుకాలనీలోని గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.రాజారావు ఆదివా రం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.50 ఫీ జు చెల్లించి ఆన్లైన్, మీసేవా ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. రోస్టర్ ద్వారా దామాషా పద్ధతిలో లాటరీ ద్వారా ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 వరకు గడువుందన్నారు. గుర్తింపు పొందిన పాఠశాలలో 4వ తరగతి చదివి ఉండాలన్నా రు. 6వ తరగతిలో చేరేందుకు ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కో ట, దొరవారి సత్రంలోని గురుకుల పాఠశాలలో బాలురు 6,7,8 తరగతుల్లో చేరేం దుకు ఈ నెల 30వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బాలికలకు నెల్లూరు లో 80 సీట్లు, కోట, దొరవారిసత్రంలో బా లురకు 80 ఖాళీలు ఉన్నాయన్నారు.