ఉద్యోగాల భర్తీలో రోస్టర్ తప్పనిసరి
► బీఎస్ రాములు
సాక్షి, హైదరా బాద్: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ నియామకాలకు రోస్టర్ విధానాన్ని తప్పకుండా పాటించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు స్పష్టం చేశారు. రోస్టర్‌లో తప్పులు దొర్లితే అర్హులైన వారికి అన్యాయం జరుగుతుందన్నారు. శుక్రవారం బీసీ కమిషన్ కార్యాలయంలో రవాణా, ఆర్టీసీ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృజనాత్మకత ఉంటే ఉపాధి తప్పక దొరుకుతుందన్నారు. ప్రస్తుతం డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉందని, ప్రభుత్వం ఓన్ యువర్ కార్, షీక్యాబ్స్ లాంటి పథకాలతో యువతను ప్రోత్సహిస్తోందన్నారు. ఈ పథకాలు సక్రమంగా అమలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.