న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కేసుల కేటాయింపునకు సంబంధించిన రోస్టర్ విధానాన్ని సుప్రీంకోర్టు గురువారం ఆమోదించింది. ఆ మేరకు సీజేఐ ఉత్తర్వుల కాపీని సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఈ ఉత్తర్వు ల ప్రకారం.. కొత్త కేసులకు సంబంధించి రోస్టర్ విధానం ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి రానుంది. పిల్‌లు, ముఖ్యమైన కేసుల్ని జూనియర్ న్యాయ మూర్తులకు కేటాయిస్తున్నారని ఆరోపిస్తూ.. ఇటీ వల సుప్రీంలోని అత్యంత సీనియర్ న్యాయమూ ర్తులు జస్టిస్ జే.చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు ప్రశ్నించిన నేపథ్యంలో రోస్టర్ విధా నాన్ని అందరికీ అందుబాటులో ఉంచడం ప్రాధా న్యం సంతరించుకుంది. ప్రజా ప్రయోజన వ్యాజ్యా లకు సంబంధించిన కేసుల కేటాయింపుల్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఒక్కరే నిర్ణయిస్తారని 13 పేజీల నోటిఫికేషన్‌లో వెల్లడించారు.
లేఖల రూపంలో వచ్చే పిటిషన్లు, ఎన్నికల కేసులు, కోర్టు ధిక్కార కేసులు, రాజ్యాంగ వ్యవస్థలకు సంబంధించిన కేసుల్ని, తన నేతృత్వం లోని ధర్మాసనానికి సీజేఐ కేటాయించుకున్నారు. సీజేఐ, మరో 11 మంది న్యాయమూరు ్తలైన జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ గొగోయ్, జస్టిస్ లోకూర్, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్ ఆర్‌కే అగర్వాల్, జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయెల్, జస్టిస్ ఆర్.ఎఫ్. నారిమన్‌ల ధర్మాసనాలు విచారించనున్న కేసుల అంశాలను వెబ్‌సైట్‌లో ఉంచారు. జస్టిస్ చలమేశ్వర్ ధర్మాసనం.. కార్మిక, పరోక్ష పన్నులు, భూ సేకరణ, పరిహారం, క్రిమినల్ అంశాల్ని విచారిస్తుంది. జస్టిస్ గొగోయ్ ధర్మసనానికి కార్మిక, పరోక్ష పన్నులు, కంపెనీ చట్టాలు, ట్రాయ్, సెబీ, ఆర్‌బీఐ, క్రిమినల్, తదితర అంశాల్ని, జస్టిస్ లోకూర్ ధర్మాసనానికి సేవా రంగం, సామాజిక న్యాయం, వ్యక్తిగత చట్టాలు, భూసేకరణ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ అంశాల్ని కేటాయించారు. ఇక జస్టిస్ జోసెఫ్ ధర్మా సనం కార్మిక, కోర్టు ధిక్కారం, వ్యక్తిగత చట్టాల కిందకు వచ్చే కేసుల్ని విచారిస్తుంది.
రోస్టర్ విధానానికి సుప్రీం ఆమోదం
Published Fri, Feb 2 2018 1:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment