music festival
-
క్రేజీ క్యాండిల్ లైట్ కన్సర్ట్..
లైవ్ యువర్ సిటీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో ఊర్రూతలూగించిన ఈ సిరీస్ ‘ట్రిబ్యూట్ టు కోల్డ్ ప్లే’ పేరుతో హైదరాబద్లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రీమియర్ షో ప్రారంభించనున్నారు. ఈ ‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’లో భాగంగా స్థానిక ఫేమస్ మ్యూజిక్ ఆర్టిస్టుల సంగీత స్వరాలతో పోడియం హోరెత్తనుంది. క్యాండిల్ లైట్స్ వెలుతురులో సంగీతాన్ని ఆస్వాదించే వినూత్న వేదికకు మన నగరం సాక్షిగా నిలవనుంది. ఈ వేడుక ప్రారంభం మాత్రమే.. రానున్న డిసెంబర్ నెలలో హయత్ హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా ‘క్వీన్ వర్సెస్ అబ్బా’ పేరుతో మరో కన్సర్ట్కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సారంగి, తబలా వంటి కాలాతీత శాస్త్రీయ వాయిద్యాలతో అలరించనున్నారు. పారిస్ టూ న్యూయార్క్..‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’ సాధారణంగా నిర్వహించే కన్సర్ట్లాంటిది కాదు. పారిస్‌లోని చారిత్రాత్మక వేదికలు మొదలు న్యూయార్క్‌లోని మోడ్రన్ వేదికల వరకూ ప్రపంచ ప్రయాణం చేసి మిలియన్ల మ్యూజిక్ లవర్స్‌ను అలరించిన గ్లోబల్ షో. ఈ కన్సర్ట్కు అంతర్జాతీయంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తున్న వేళ లైవ్ యువర్ సిటీ అంటూ నగరానికి విచ్చేసింది. ప్రముఖ భారతీయ పియానిస్ట్ నిఖిత్ దోర్బలా సందడి చేయనున్న షో ఈ నెల 15న జరగనుండగా, డిసెంబర్ 6, 22, జనవరి 11 తేదీల్లో నగరంలోని విభిన్న వేదికల్లో ఈ సంగీత కచేరి జరగనుంది. (చదవండి: -
ఆస్ట్రేలియాలో 'షెగెలోసిస్ వ్యాధి' కలకలం!వందలాది మందికిపైగా..
ఆస్ట్రేలియా షెగెలోసిస్ వ్యాధి(షిగెల్లా బ్యాక్టీరియా కారణంగా వచ్చే వ్యాధి) తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్ట్రేలియాలోని స్టేట్ విక్టోరియాలో ఎసోటెరిక్ మ్యూజిక్ ఫెస్టివల్ జరిగింది. దీనికి హాజరైన ప్రజలలో కొంతమంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఈ ఫెస్టివల్ డోనాల్డ్‌లో మార్చి8 నుంచి మార్చి12వ తేది వరకు జరిగింది. ఆ ఫెస్టివల్‌కి హాజరైన వారిలో దాదాపు 230 మంది దాక షిగెలోసిస్కి సంబంధించిన జీర్ణశయాంతర పేగు సంబంధిత లక్షణాలను ఎదుర్కొన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య అధికారులు ఆ ఫెస్టివల్‌కి హజరైన వారలో ఇంకెవరికైనా అలాంటి లక్షణాలు తలెత్తితే తక్షణమే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ వ్యాధి అతిసారం మాదిరిగా జ్వరం, వికారం, వాంతులు, పొత్తికడుపు తిమ్మిరి వంటి గ్యాస్ట్రో లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులే ఈ వ్యాధికి తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఎక్కుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అదీగాక ఎక్కువ మందికి ఈ వ్యాధి వ్యాపించడంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలు, సలహదారులు చెప్పేంత వరకు ఆయా బాధితలు ఎలాంటి విధులకు హాజరుకాకుడదని హెచ్చరించింది. యాంటీ బయాటిక్స్ మందులతో ఈ వ్యాధిని అదుపులోకి తీసుకురావొచ్చుగానీ కేసులు పెరిగితే మాత్రం ఈ వ్యాధి వ్యాప్తి సవాలుగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు ఆరోగ్యనిపుణులు. ఏంటీ షెగెలోసిస్ వ్యాధి.. ఈ బ్యాక్టీరియా పేరు షింగెల్లా. ఇది సోకడాన్ని షింగెల్లోసిస్ అంటారు. ఇది సోకితే విరేచనాలు (డయేరియా), జ్వరం, కడుపు నొప్పి వస్తాయి. ఇవి కొన్ని రోజులపాటూ ఉంటాయి. చికిత్సలో యాంటీబయోటిక్స్‌ని వాడుతారు. ఇవి వ్యాధి వ్యాప్తిని తగ్గించగలవు. షింగెల్లా బ్యాక్టీరియా ఒకరి నుంచి ఒకరికి రకరకాల మార్గాల్లో వ్యాపించగలదు. ఆల్రెడీ సోకిన వ్యక్తికి డయేరియా తగ్గి నయం అయిపోయినా… ఆ వ్యక్తి నుంచి ఈ బ్యాక్టీరియా ఇతరులకు సోకగలదు. అలాగే ఈ వ్యాధి కలుషిత ఆహారం లేదా లైంగిక సంబంధం ద్వారా వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా పారిశుద్ధ్యం సరిగా లేని ప్రాంతాల్లో నివసించడం లేదా ప్రయాణించడం, పురుషులతో శృంగారంలో పాల్గొనే పురుషులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. నివారణ: తరచుగా చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. మంచి పారిశుధ్యం, వ్యక్తిగత పరిశుభ్రత తోపాటు ఆహార పరిశుభ్రతను పాటించాలి ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహాల మేరకు తీసుకోవాలి. ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట కేవలం పరిశుభ్రంగా ఉండటమే కీలకం (చదవండి: ఇదేం వ్యాధి.. సోఫా ఫోమ్, ఫోటో ఫ్రేమ్ గ్లాస్లు తినేస్తోంది..) -
సముద్ర గర్భంలో సంగీత కచేరి!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!
ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం! వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్‌వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్‌ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్‌ని స్థానిక ఎఫ్ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!. (చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
స్వరరాగ మధుర తరంగాలు
‘సాధన చేయుమురా నరుడా.... సాధ్యం కానిది లేదురా!’ అన్నది పెద్దల మాట ఇంగ్లీష్ పాట విషయంలో కూడా ఆ విలువైన మాటను గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో పుట్టిన వారు, ప్రవాసభారతీయులు మాత్రమే ఇంగ్లీష్ పాటను బాగా పాడగలరా? ‘సాధన చేస్తే ఎవరైనా పాడగలరు’ అని నిరూపించింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్... గోవాలో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్లో యువగళాలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. ‘ఎవరు వీరు?’ అని ఆరా తీసేలా చేశాయి. దేశంలోని వివిధ ప్రాంతాలు, భిన్నమైన సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన వారు, ‘ఒక్క ఛాన్స్ ప్లీజ్’ అని స్టూడియోలు, స్టేజ్‌ల చుట్టూ చక్కర్లు కొట్టిన గాయకులు కూడా ఇందులో ఉన్నారు. అలాంటి వారు తమ టాలెంట్‌ను ఈ మ్యూజిక్ ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం రావడానికి ప్రధాన కారణం నెక్సా మ్యూజిక్ ల్యాబ్. నేషనల్వైడ్ టాలెంట్ డిస్కవరీ ప్లాట్‌ఫామ్ ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ మారుమూల ప్రాంతాల నుంచి మహా పట్టణాల వరకు మట్టిలో మాణిక్యాలను బయటకు తీసుకువచ్చి అంతర్జాతీయ స్థాయిలో మెరిపిస్తోంది. ఈ పోటీలో పాల్గొనదలచినవారు మూడు నిమిషాల నిడివి ఉన్న ఒరిజినల్ ఇంగ్లీష్ మ్యూజిక్ కంపోజిషన్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పాప్, జాజ్, ఫ్యూజన్...మ్యూజిక్ జానర్ ఏదైనా ఫరవాలేదు. దీంతో పాటు నెక్సా మ్యూజిక్ అడిషన్లో కూడా పాల్గొనవలసి ఉంటుంది. ఎంట్రీలకు మినీమం ఏజ్ లిమిట్...పద్దెనిమిది సంవత్సరాలు. సబ్మిట్ చేసిన ఎంట్రీలు నియమ, నిబంధనలకు తగినట్లుగా లేకపోతే నెక్సా గ్యాలరీలో కనిపించవు. అయినా నిరాశ చెందనక్కర్లేదు. తప్పులు సవరించుకొని ఫ్రెష్‌గా పంపవచ్చు. వ్యక్తిగత స్థాయిలోనూ, మ్యూజిక్ బ్యాండ్‌లో ఒకరిగా కూడా పాల్గొనవచ్చు. ఏఆర్ రెహమాన్ నేతృత్వంలోని జ్యూరీ 24 మందిని ఎంపిక చేస్తుంది. వీరికి నెక్సా మ్యూజిక్ సీజన్లలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఈ ఇరవైనాలుగు మంది నుంచి ఫైనల్‌గా నలుగురిని ఎంపిక చేసి, వారి చేత పాడించిన ఆల్బమ్‌లను అంతర్జాతీయంగా విడుదల చేస్తారు. దిల్లీకి చెందిన నిశా నుంచి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన యువ మ్యూజిక్ బ్యాండ్ ‘హీట్ సింక్’ వరకు ఎంతోమందిలో కొత్త వెలుగు తీసుకువచ్చింది నెక్సా మ్యూజిక్ ల్యాబ్. బహుముఖ ప్రతిభ నెక్సా సీజన్ 1 విజేతగా నిలిచిన దిల్లీకి చెందిన నిశా శెట్టి సింగర్, సాంగ్‌రైటర్, వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తోంది. చిన్నప్పటి నుంచి నాటకాలు, వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లను చూస్తూ పెరిగింది. కథక్, కూచిపూడి, హిందుస్థానీ శాస్త్రీయసంగీతం నేర్చుకుంది. చిన్న చిన్న షోలలో పాల్గొనే నిశాకు ‘నెక్సా మ్యూజిక్ ల్యాబ్’ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. ‘ఎంపికైన విజేతలలో మీరు ఒకరు’ అంటూ నిర్వాహకుల నుంచి వచ్చిన మెయిల్ నేహాకు ఎప్పుడూ గుర్తుండే తియ్యటి జ్ఞాపకం. ‘కలలు కనడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. కల సాకారం చేసుకునే శక్తి కోసం ఎక్కడెక్కడో వెదకనక్కర్లేదు. అది మన దగ్గరే ఉంది’ అంటుంది నిశా శెట్టి. -
కువైట్‌లో తమన్ 'సుస్వర తమనీయం'.. వైభవంగా వేడుక
Thaman Music Festival In Kuwait: రెండున్నర సంవత్సరాల తరువాత 'కోవిడ్' అనంతరం మొట్టమొదటి సారిగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రత్యక్ష సంగీత కార్యక్రమం 'సుస్వర తమనీయం'. కువైట్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. జూన్ 3 సాయంత్రం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యస్.యస్. తమన్ బృందంతోపాటు సుమారు 1500 మందికిపైగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమన్ బృందమైన గాయని గాయకులు శ్రీ కృష్ణ, సాకేత్, పృథ్వీచంద్ర, విమల రోషిని, శ్రీ సౌమ్య, శృతి రంజని, మనీష, హరిక నారాయణ్ తదితరులు తమ పాటలతో అలరించారు. దాదాపు యాభై పాటలతో అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆడిటోరియం దద్దరిల్లింది. సభ్యులందరు కేరింతలు,నృత్యాలు, ఆనందో త్సాహాలతో కన్నుల పండుగగా తమన్ 'సుస్వర తమనీయం' ఆద్యతం అలరించింది. చదవండి: భూమిక ఇంగ్లీషులో భయంకరంగా తిట్టింది: నిర్మాత ఎంఎస్ రాజు అనంతరం స్పాన్సర్స్.. తమన్‌ను, వారి బృందాన్ని, మిగతా సంస్థల అధ్యక్షులను, ఇండియన్ ఎంబసీ ముఖ్య అతిధి శ్రీ కమల్ సింగ్ రాథోడ్‌ను "తెలుగు కళా సమితి" కార్యవర్గం జ్ఞాపికలతో సత్కరించింది. ఈ కార్యక్రమంలో "తెలుగు కళా సమితి" స్మారక చిహ్నమైన 'సావెనీర్' వార్షిక సంచికను విడుదల చేశారు. -
మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట 8మంది మృతి
-
టెక్సాస్ మ్యూజిక్ ఫెస్ట్‌లో తొక్కిసలాట
హూస్టన్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హూస్టన్ నగరంలో శుక్రవారం రాత్రి జరిగిన ఒక మ్యూజిక్ ఫెస్టివల్లో తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. అమెరికన్ ర్యాపర్ ట్రావిస్ స్కాట్ చూడడానికి జనం ఎగబడడంతో ఈ ఘోరం జరిగింది. ఈ కార్యక్రమానికి దాదాపుగా 50 వేల మంది హాజరయ్యారు. వారంతా ఒకే సారి వేదికపైకి దూసుకురావడంతో ఒకరి మీద మరొకరు పడి జరిగిన తొక్కిసలాటలో ఊపిరాడక ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్టు హూస్టన్ చీఫ్ శామ్ పేన శనివారం మీడియాకు వెల్లడించారు. అమెరికన్లలో మంచి క్రేజ్ ఉన్న ర్యాపర్ స్కాట్ ఆస్ట్రోవరల్డ్ ఫెస్టివల్‌ను గత మూడేళ్లుగా నిర్వహిస్తున్నారు. శుక్ర, శనివారాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే టిక్కెట్లు మే నెలలోనే హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఫెస్టివల్చూడడానికి వచ్చిన జనం స్టేజీ వైపుగా వెళ్లడానికి చేసే ప్రయత్నాల్లో తొక్కిసలాట జరిగినట్టు అమెరికన్ మీడియా వెల్లడించింది. ఆ అభిమానుల్ని కట్టడి చేయడంలో భద్రతా సిబ్బంది విఫలం కావడంతో ఈ దారుణం జరిగింది. జనం భయాందోళనకు గురై పరుగులు పెట్టడంతో చాలా మందికి గాయాలయ్యాయి. దీంతో అప్పటికప్పుడు ఫెస్టివల్‌ని రద్దు చేశారు. ఆ పక్కనే తాత్కాలికంగా ఆస్పత్రి ఏర్పాటు చేసి 300 మందికి పైగా చికిత్స చేసినట్టుగా శామ్ వెల్లడించారు. -
‘డియర్ కామ్రేడ్’ మ్యూజిక్ ఫెస్టివల్
-
ముందుంది మ్యూజిక్ ఫెస్టివల్
స్క్రీన్‌పై శంకర్ చేసే విజువల్ మ్యాజిక్కు ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్ టచ్‌తో సీన్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ‘జెంటిల్మెన్’తో స్టార్ట్ అయిన వీళ్ల జర్నీ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ సూపర్‌హిట్ కాంబినేషన్ రజనీకాంత్ ‘2.0’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా బ్కాక్గ్రౌండ్ స్కోర్ పనిలో బిజీగా ఉన్నారట ఏఆర్ రెహమాన్. అందులో భాగంగా కొన్ని సీన్స్ చూసి ఇలా మాట్లాడారు – ‘‘2.0’లో ఓ సాంగ్ చూశాను. సీజీ వర్క్ లేదు. అయినా కూడా పాట బ్రహ్మాండంగా ఉంది. కేవలం శంకర్ మాత్రమే ఇలా ఆలోచించగలడు. క్లైమాక్స్ విషయానికి వస్తే నమ్మశక్యంగా అనిపించలేదు. అంత బాగుంది. శంకర్ లాంటి టెక్నీషియన్‌తో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. అలాగే స్క్రీన్ మీద సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్‌లను చూడటం ప్రేక్షకులకు కనువిందుగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ‘2.0’ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. హాలీవుడ్ యాక్టర్ విల్ స్మిత్‌ను రెహమాన్ ఇటీవల కలిశారు. ఈ ఇద్దరూ ఏదైనా ప్రాజెక్ట్ మీద వర్కౌట్ చేస్తున్నారా? అంటే.. సినిమా కోసం కాదు కానీ మ్యూజిక్ ఫెస్టివల్ కోసమని సమాచార ం. ‘‘వన్ అండ్ ఓన్లీ విల్ స్మిత్‌తో నా మనసుకు చాలా నచ్చిన విషయమై సుదీర్ఘంగా చర్చించాం’’ అంటూ విల్ స్మిత్‌తో కలసి దిగిన ఫొటోను షేర్ చేశారాయన. డిసెంబర్లో చెన్నైలో జరగనున్న మ్యూజిక్ ఫెస్టివల్లో వీళ్లిదరూ కలసి పెర్ఫామ్ చేయనున్నారని సమాచారం. సో.. నవంబర్‌లో ‘2.0’, డిసెంబర్లో మ్యూజిక్ ఫెస్టివల్‌తో రెహమాన్ ఫ్యాన్స్ అందరికీ ముందుంది మ్యూజిక్ ఫెస్టివల్. -
మ్యూజిక్ మ్యాజిక్
సమ్మర్ హాలిడేస్ స్కూల్ పిల్లలకే కాదు. అందరికీ వర్తిస్తుంది అంటున్నారు కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్. అన డమే కాదు క్విక్‌గా కొన్ని హాలిడేస్ కూడా తీసుకున్నారీ జంట. ఈ లవ్ కపుల్ వీలు దొరికినప్పుడల్లా హాలీడేకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడెక్కడకు వెళ్లారు అంటే.. మ్యూజిక్ ఫెస్టివల్‌కు. అమెరికాలోని కొచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌కు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్ ఇలా రకరకాల మ్యూజిక్, చాలా మంది ఆర్టిస్ట్స్ అందరూ కలిసి మ్యూజిక్ సంబరంగా జరుపుకుంటారు. ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేయడానికి వారం రోజుల వెకేషన్‌కు వెళ్లారు విఘ్నేశ్, నయన్. ఈ ట్రిప్‌లోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు విఘ్నేశ్. ఈ ట్రిప్ విశేషాలని వివరిస్తూ–‘ ‘కొచెల్లాలో అమేజింగ్ టైమ్ స్పెండ్ చేశాం. నా స్టార్ (నయనతార)తో చిన్న మ్యూజికల్ జర్నీ. గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టార్ సింగర్ బియాన్స్ పర్ఫార్మెన్స్ బెస్ట్ మూమెంట్స్ మాకు. చిన్న ట్రిప్‌తో సమ్మర్ వెకేషన్ ముగిసింది. ఇక బ్యాక్ టు వర్క్’’ అని పేర్కొన్నారు. -
శ్రవణపేయంగా త్యాగరాజ కీర్తనలు
తెనాలి: శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీత ఉత్సవాలు 10వ రోజయిన బుధవారం రాత్రితో ముగిశాయి. ఇక్కడి మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఉత్సవాల్లో చివరిరోజు రాత్రి త్యాగరాజ వైభవం, ప్రఖ్యాత త్యాగరాజ కీర్తనలు, వ్యాఖ్యాన సహితంగా నిర్వహించటం విశేషం. సంగీత త్రిమూర్తులైన శ్యామశాస్త్రి, త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్ భూమికములుగా ఆయా విద్వాంసుల ఆధ్యాత్మిక ప్రవృత్తి ఆధారంగా కార్యక్రమం జరిపారు. ప్రధాన భూమికగా త్యాగరాజస్వామి జీవితంలో ఆయన రచించిన విశేష సంగీత కృతులను విజయవాడకు చెందిన చావలి రామకృష్ణ ఆలపించారు. ముఖ్య కీర్తనలకు బ్రహ్మర్షి ములుకుట్ల బ్రహ్మానందశాస్త్రి చేసిన వ్యాఖ్యానం ఆకట్టుకుంది. చావలి శ్రీనివాస్ వయొలిన్‌పై కృష్ణమోహన్ మృదంగంపై సహకరించారు. గానసభ అధ్యక్షుడు ఆచార్య పిరాట్ల నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అనుక్షణం.. రాగ మిళితం..
తెనాలి : శ్రీసీతారామ గానసభ 70వ వార్షిక సంగీతోత్సవాల్లో ఏడోరోజయిన ఆదివారం రాత్రి చెన్నైకు చెందిన సునీల్ ఆర్.గార్గ్యన్ తన గానంతో సభికులకు వీనులవిందు చేశారు. స్థానిక మూల్పూరు సుబ్రహ్మణ్యశాస్త్రి కళ్యాణమండపంలో జరిగిన ఈ కచేరీ ఆద్యంతమూ హృద్యంగా సాగింది. కేవలం 21 ఏళ్ల వయసులోనే గార్గ్యన్, అనుభవజ్ఞులైన సంగీత విద్వాంసుల తరహాలో సంస్కృతి సంప్రదాయాలు, రాగాలాపన, స్వరం మనోధర్మం వంటి అన్ని విషయాలు కలిసి ఆది నుంచి అంత్యం వరకు విశిష్టమైన రీతిలో కచేరీని రక్తికట్టించటం విశేషం. తొలుత వర్ణంను తోడిరాగం, ఆదితాళంలో ఆలపించాక, శ్రీమహాగణపతే...ను బేగడ రాగం రూపక తాళంలో పాడి కరతాళధ్వనులను అందుకొన్నారు. దర్బార్రాగంలో మిశ్రచాపు తాళంలో పాడిన ‘రామాభిరామ’ కీర్తనతో మంత్రముగ్ధులను చేశారు. రెండున్నర గంటల సేపు వివిధ కీర్తనలను గానం చేసి, అందరి ప్రశంసలను అందుకొన్నారు. వీరికి వయొలిన్‌పై వెటరన్ పుదక్కొటై రామనాథన్, మృదంగంపై ఐ.పినాకపాణిలు గొప్ప కూర్పుతో చక్కని సహకారం అందించారు. గానసభ అధ్యక్షుడు డాక్టర్ పిరాట్ల నారాయణమూర్తి తొలుత గార్గ్యన్ను పరిచయం చేశారు. సంగీత కళాచార్య పీఎస్ నారాయణస్వామి, పీబీ రంగాచార్యుల వద్ద సంగీత అభ్యాసం చేసిన గార్గ్యన్, మదంగంలోనూ పండితులే. పిన్నవయసునుంచి సంగీత సాధనతోనే ఇంతటి ప్రావీణ్యం అలవడింది. ప్రస్తుతం బీ గ్రేడ్ ఆర్టిస్టుగా వున్నారు. కార్యదర్శి డాక్టర్ వ్యాకరణం వెంకట్రావు, ఇతర సభ్యులు పర్యవేక్షించారు. ఘనంగా సాగిన మేఘనామూర్తి గానం... సంగీతోత్సవంలో భాగంగా శనివారం రాత్రి బెంగళూరుకు చెందిన మేఘనామూర్తి తన గానంతో శోత్రల అభినందనలు అందుకున్నారు. రెండున్నర గంటలసేపు సాగిన కచేరీ అనంతరం, పిన్నవయసులోనే అపార పాండిత్యం సాధించిందని ప్రశంసలు పొందారు. -
మ్యూజిక్ ఫెస్టివల్ లో లైంగిక అకృత్యాలు!
స్టాక్ హోమ్: స్వీడన్ లో జరిగిన ఓ మ్యూజిక్ ఫెస్టివల్ లైంగిక దాడులకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో 12మంది మహిళలపై లైంగికపరమైన దాడులు జరిగాయని స్థానిక మీడియా తెలిపింది. ఉత్తర స్వీడన్ లోని స్కెల్లెఫ్టీలో గతవారం జరిగిన ట్రాస్టాక్ ఫెస్టివల్ లో కొందరు కామాంధులు లైంగికపరమైన అకృత్యాలకు దిగారు. గత ఏడాది ఈ కార్యక్రమంలో ఒకటే లైంగిక దాడి జరుగగా.. ఈ ఏడాది 12 జరిగాయి. కాన్సర్ట్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు మహిళలపై దాడులకు దిగారని, స్కర్ట్ వేసుకున్న మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ నేరగాడిని గుర్తించామని పోలీసులు తెలిపారు. మరో యువతిని కొందరు అసభ్యంగా తాకి.. ఆమె గౌరవానికి భంగం కలిగించారని పోలీసులు చెప్పారు. నిజానికి ఈ సంగీతోత్సవంలో ఎలాంటి లైంగిక అకృత్యాలు జరగకుండా నిర్వాహకులు కొన్ని చర్యలు తీసుకున్నారు. కాన్సర్ట్ కు వచ్చే మహిళలతో సభ్యతతో మసులుకోవాలంటూ, లైంగికపరమైన దాడులపట్ల అవగాహన కలిగి ఉండాలంటూ ఓ సెమినార్ కూడా నిర్వహించారు. అయినా, ఈ కార్యక్రమంలో యథేచ్ఛగా మహిళలపై దాడులు జరిగాయి. స్వీడిష్ మ్యూజిక్ ఫెస్టివల్ బ్రావెల్లాలో ఇటీవల మహిళలపై 17 లైంగికపరమైన దాడులు జరుగడంతో ఈ కార్యక్రమాన్ని బ్రిటిష్ మ్యూజిక్ బాండ్ మమ్ఫర్డ్స్ అండ్ సన్స్ బహిష్కరించింది. -
సంగీత ప్రియులకు పండుగొచ్చింది
-
సంగీత ప్రియులకు పండుగొచ్చింది
లండన్: ప్రపంచ సంగీత ప్రియులకు పండుగొచ్చింది. ప్రపంచంలోనే అతి భారీ ఎత్తున జరిగే సంగీత విభావరికి శుక్రవారం నాడు తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని పిల్టన్‌లో జరిగే ప్రపంచ ప్రసిద్ధి చెందిన 'గ్లాస్టన్‌బరి ఫెస్టివల్'కు ప్రపంచ నలుమూలల నుంచి సంగీత ప్రియులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. మున్నెన్నడు లేనివిధంగా గురువారం ఉదయానికే దాదాపు రెండు లక్షల మంది సంగీత ప్రియులు పిల్టన్‌లోని సంగీత కచేరి మైదానానికి చేరుకున్నారు. నిర్వాహకులు 1,35.000 టిక్కెట్లు విక్రయించి కౌంటర్ మూసేసినప్పటికీ సంగీత ప్రియుల ప్రవాహానికి మాత్రం తెరపడడం లేదు. టిక్కెట్లు లేకపోయిన సంగీతోత్సవానికి వారు రావడం మామూలే. వారంత కచేరి ప్రాంతంలో కాకుండా చుట్టుపక్క ప్రాంతాల్లో వీకెండ్‌ను అహ్లాదంగా గడిపి వెళతారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఐదు రోజులపాటు కొనసాగే ఈ ఉత్సవంలో రాక్, పాప్, ఇండీ రాక్, ట్రిప్ హాప్, హిప్ హాప్, రెగ్గీ, ఫోక్, వరల్డ్ మ్యూజిక్, ఎలక్ట్రానిక్ మ్యూజిక్, హెవీ మెటల్ మ్యూజిక్ ఇలా ప్రపంచంలోని అనేక రీతుల సంగీతాన్ని వినిపిస్తారు. వీటికి సైడ్‌లైడ్స్‌గా ప్రేక్షకుల మధ్య డాన్స్, కామెడీ, థియేటర్, సర్కస్, క్యాబె రే లాంటి కార్యక్రమాలు అసలు సంగీత కార్యక్రమానికి ముందూ వెనక, ప్రేక్షకుల మధ్య కొనసాగుతాయి. వివిధ సంగీత రీతుల్లో వర్ధమాన తారలుగా ఎదుగుతున్న మ్యుజిషన్స్, కంపోజర్స్ ఈ వేదిక నుంచి ఒక్కసారైనా పాడేందుకు పోటీ పడతారు. పాటల రచయితలు కూడా ఈ వేదిక కోసం ప్రత్యేకంగా పాటలు రాస్తారు. పిల్టన్‌లోని 900 ఎకరాల్లో కొనసాగే ఈ సంగీతోత్సవంలో ప్రధాన వేదికతోపాటు చుట్టూర మరో 12 వేదికలు ఉంటాయి. ప్రధాన స్టేజీపై 6,50.000 వాట్స్ సామర్ధ్యంగల 250 స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే సంగీత ప్రియులు ఎవరి టెంట్లు వారే, వారానికి సరపడే దుస్తులు తెచ్చుకోవాలి. మంచినీరు, టాయ్‌లెట్ సౌకర్యాన్ని మాత్రం నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. నాలుగువేల టాయ్లెట్లను ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమాన్ని నిర్వహించే ల్యాండ్ యజమాని మైకేల్ ఏవిస్ తెలిపారు. 1971లో ప్రారంభమైన గ్లాస్టన్‌బరి సంగీతోత్సవం మధ్యలో కొంత విరామం తర్వాత ఇప్పుడు ప్రతిఏటా జరుగుతోంది. ఈసారి మాత్రం ఊహించనిదానికన్నా ఎక్కువగా ఉందని కార్యక్రమం నిర్వహణలో తండ్రికి సహకరిస్తున్న ఎమిలీ ఎవిస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వచ్చే సొమ్ములో ఎక్కువ భాగాన్ని ఎప్పటిలాగే సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. ఈ సంగీతోత్సవంలో ప్రదర్శన ఇవ్వడానికి కెమికల్ బ్రదర్స్, రూడిమెంటల్, జార్జి ఎజ్రా, లివెల్ రిచ్, ఆల్ట్ జే, పలోమా ఫేత్ లాంటి వర్ధమాన స్టార్స్ వస్తున్నారని ఆమె చెప్పారు.