గచ్చిబౌలి: మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈ నెల 29న హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం(హెచ్‌టీఏఎంఎఫ్) వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలతో ఆకట్టుకోకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి రచించిన అనేక కీర్తనలు, శాస్త్రీయ సంగీత రాగాలను విభిన్న శైలిలో ప్రయోగించారు. ఆ కీర్తనలు రామభక్తిని చాటిచెప్పడమే కాకుండా తాతి్వకత, ఆధ్యాత్మాకతను లోతైన రీతిలో వెలువరిస్తాయి.
త్యాగరాజ స్వామి కర్నాటక శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలను స్మరిస్తూ యేటా సంగీతోత్సవం నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, కళలను, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో సంస్కృతి ఫౌండేషన్ 16 ఏళ్ల క్రితం హెచ్‌టీఏఎంఎఫ్‌ను స్థాపించింది. పదేళ్లుగా త్యాగరాజ ఆరాదనా సంగీతోత్సవం నిర్వహిస్తోంది.
29న ప్రారంభం..
శిల్పారామంలో త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం జనవరి 29న ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ 15కు పైగా సుమధుర సంగీత కచేరీలు ఉంటాయి. 4వ రోజు గురుకులం పేరిట విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన ఉంటుంది. జంట నగరాల్లోని సంగీత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం 9 గంటలకు ‘పంచరత్న సేవ’ ఉంటుంది. కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా ‘గురు సన్మానం’ పేరిట ప్రసిద్ధ సంగీత విద్వాంసులను సంస్కృతి ఫౌండేషన్ సత్కరిస్తుంది. 400 మందికి పైగా సంగీతకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించనున్నారు. హనుమత్సమేత సీతారామలక్ష్మణులు, త్యాగరాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేక సేవ ఉంటుంది.
ఇదీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment