aradhana
-
29న త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం
గచ్చిబౌలి: మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈ నెల 29న హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం(హెచ్‌టీఏఎంఎఫ్) వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు ప్రముఖ సంగీత విద్వాంసుల కచేరీలతో ఆకట్టుకోకున్నారు. 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ వాగ్గేయకారులు త్యాగరాజ స్వామి రచించిన అనేక కీర్తనలు, శాస్త్రీయ సంగీత రాగాలను విభిన్న శైలిలో ప్రయోగించారు. ఆ కీర్తనలు రామభక్తిని చాటిచెప్పడమే కాకుండా తాతి్వకత, ఆధ్యాత్మాకతను లోతైన రీతిలో వెలువరిస్తాయి. త్యాగరాజ స్వామి కర్నాటక శాస్త్రీయ సంగీతానికి అందించిన సేవలను స్మరిస్తూ యేటా సంగీతోత్సవం నిర్వహిస్తారు. భారతీయ సంస్కృతి, కళలను, సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేయాలనే లక్ష్యంతో సంస్కృతి ఫౌండేషన్ 16 ఏళ్ల క్రితం హెచ్టీఏఎంఎఫ్ను స్థాపించింది. పదేళ్లుగా త్యాగరాజ ఆరాదనా సంగీతోత్సవం నిర్వహిస్తోంది. 29న ప్రారంభం.. శిల్పారామంలో త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం జనవరి 29న ప్రారంభమవుతుంది. ప్రతి రోజూ 15కు పైగా సుమధుర సంగీత కచేరీలు ఉంటాయి. 4వ రోజు గురుకులం పేరిట విద్యార్థుల ప్రతిభా ప్రదర్శన ఉంటుంది. జంట నగరాల్లోని సంగీత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 2న ఉదయం 9 గంటలకు ‘పంచరత్న సేవ’ ఉంటుంది. కర్నాటక శాస్త్రీయ సంగీతానికి చేసిన సేవకు గుర్తింపుగా ‘గురు సన్మానం’ పేరిట ప్రసిద్ధ సంగీత విద్వాంసులను సంస్కృతి ఫౌండేషన్ సత్కరిస్తుంది. 400 మందికి పైగా సంగీతకారులు త్యాగరాజ కీర్తనలను ఆలపించనున్నారు. హనుమత్సమేత సీతారామలక్ష్మణులు, త్యాగరాజ స్వామి ఉత్సవ మూర్తులకు అభిషేక సేవ ఉంటుంది. ఇదీ చదవండి: ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్‌లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు -
తెలుగు తల్లీ, అదుగోనమ్మా..!
తెలుగు తల్లీ, అదుగోనమ్మా త్యాగయ్య నాదోపాసన రవళిస్తున్నది నీకు భూపాలమై! కర్ణాటక సంగీతం ముమ్మూర్తుల్లో ఒకరైన శ్రీమాన్ త్యాగరాజు 177వ ఆరాధనోత్సవాలు తిరవైయ్యారులో ఘనంగా జరిగాయి. "విదులకు మ్రొక్కెద సంగీత కోవిదులకు మ్రొక్కెద" అంటూ నాదోపాసనతో నిధికన్నా రాముని సన్నిధి చాల సుఖమని అనుకుని ఆపై "ఏ నోము ఫలమో నీ నామామృత / పానము అను సోపానము దొరికెను" అని తెలుసుకుని జీవించారు; నాదబ్రహ్మమై జీవిస్తున్నారు త్యాగరాజు. వారు పాడింది మనం వినలేకపోయాం. వారి సంగీతం సుఖమైంది మనకు చదువయింది. "సామగాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ అమృతవర్షిణి రాగంలో రూపక తాళంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ ఒక కీర్తన చేశారు. కర్ణాటకసంగీతం త్యాగయ్య వల్ల పరిపుష్టమైంది. తెలుగుకు గర్వకారణమైంది. "చల్లని భక్తి", "స్మరణే సుఖము", "కులములెల్ల కడతేఱినట్లు", "పరమానందమనే కమలముపై" వంటివి అన్న త్యాగరాజు గొప్పకవి కూడా. వారు రాసింది చదవగలిగే భాగ్యం మనకు అందింది. సంగీతం కోసమే అన్నా వారి నోటి వెంట గొప్ప కవిత్వమూ పలికింది. "భావాభావ మహానుభావ శ్రీరామచంద్ర భావజనక నా భావము తెలిసియు..." "తన తలుపు తీసినట్టి ఒకరింటికి తాఁ గుక్కల తోలు రీతిగాదో" "తవిటికి రంకాడబోతె కూటి తపిల కోతి కొంపోయినట్టుగాదో" "రాగము తాళము రక్తి భక్తి జ్ఞాన యోగము మఱి యనురాగము లేని భాగవతు లుదర శయనులేగాని..." "మనసు స్వాధీనమైన యా ఘనునికి మఱి మంత్రతంత్రములేల" "యజ్ఞాదులు సుఖమను వారికి సము లజ్ఞానులు కలరా ఓ మనసా" "చీమలో బ్రహ్మలో శివకేశవాదులలో ప్రేమ మీర మెలఁగుచుండే బిరుదు వహించిన సీతారామ..." "ఏఱు నిండి పాఱిన పాత్రకు తగు నీరు వచ్చుగాని" "లేమి దెల్ప పెద్దలెవరు లేరో" (ఇది ఇవాళ్టి తెలుగు కవిత్వానికి, భాషకు, సమాజానికి ఈ మాట సరిగ్గా పొసుగుతుంది) "శాంతము లేక సౌఖ్యము లేదు" ఇవి, ఇలాంటివి ఇంకొన్నీ అన్న వాగ్గాన (వాగ్గేయ) కారులు త్యాగరాజు. రాముణ్ణి "సప్తస్వర నాదాచల దీపం" గా పరిగణించి ఆ వెలుగులో "సంగీత శాస్త్రజ్ఞానము సారూప్య సౌఖ్యదమే మనసా" అని అన్న త్యాగరాజు తెలుగుభాషకు సంగీతం పరంగానే కాదు కవిత్వం పరంగానూ వరవరం. "సామ గాన సార్వభౌమ స్వామి త్యాగరాజ నామ" అంటూ మంగళంపల్లి బాలమురళికృష్ణ నుతిస్తే తెలుగువాళ్లం మనం "కవన సాగర పూర్ణసోమ స్వామి త్యాగరాజ నామ" అంటూ కూడా త్యాగరాజును స్తుతిద్దాం. --రోచిష్మాన్, 9444012279 (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
హీరోయిన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? తల్లినే మించిపోయేలా ఉందే!
'సాహసవీరుడు సాగరకన్య', 'ప్రేమఖైదీ', 'భలే మావయ్య' వంటి పలు హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ మాలశ్రీ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లోనూ మెరిసి మురిపించింది. ఈమె తెలుగులో చివరగా 1997లో వచ్చిన 'సూర్య పుత్రులు' మూవీలో కనిపించింది. పేరు మార్చుకున్న హీరోయిన్ కన్నడలో నిర్మాత రాముతో 'ముత్యనంత హెంతి'(ముత్యం లాంటి పెళ్లాం) సినిమా చేసిన మాలశ్రీ అతడినే పెళ్లాడింది. వీరికి అనన్య, అర్జున్ అని ఇద్దరు పిల్లలున్నారు. 2021లో రాము కరోనాతో కన్నుమూశాడు. ఇప్పటికీ ఆయనను తలుచుకుని భావోద్వేగానికి లోనవుతుంటుంది మాలశ్రీ. ఇదిలా ఉంటే మాలశ్రీ కూతురు అనన్య కూడా తల్లి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్ దర్శన్ 'కాటీర' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటివరకు ఆమెను అనన్య, రాధన అనే పేర్లతో పిలిచేవారు. అయితే తాజాగా తాను పేరు మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మీ ఆశీర్వాదాలు కావాలి 'హలో అందరికీ.. నా పేరు రాధన రామ. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నేను పేరు మార్చుకున్నాను. ఇకపై నా పేరు ఆరాధన. ఈ మార్పు కోసం మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను. నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఆరాధన పేరు కూడా అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు. త్వరలో వెండితెరపై మెరవనున్న ఆరాధన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Aradhanaa / Anannya Ramu (@aradhanaa_r) చదవండి: ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన హీరో.. ఫోటోలు వైరల్ -
ప్రేమలో కొత్త కోణం.. 'ఆరాధన' చిత్రం
Selecting Casting For Aradhana Movie: ‘మై ఫ్రెండ్ గాంధీ’ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించిన వశిష్ట పార్థసారధి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆరాధన’. ఈ చిత్రం ద్వారా పృథ్వీరాజ్ హీరోగా పరిచయం కానున్నారు. ఆర్వీజీ మూవీస్‌తో కలిసి దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్ (ఆర్వీజీ), ‘రెబెల్ నేషన్’ అధినేత రవికిరణ్ ఈ సినిమా నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా మా సినిమా నిర్మిస్తాం. అధిక భాగం షూటింగ్ మధ్యప్రదేశ్‌లో ప్లాన్ చేశాం. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందించనున్నారు. -
నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించాడు: నటి
ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. పలు రంగాల్లో పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే ‘మేక వన్నె పులుల’ అసలు బండారం బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా తనూ శ్రీ దత్తా మొదలు పలువురు బాలీవుడ్ భామలు, దక్షిణాది సెలబ్రిటీలు కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిర్గతం చేస్తున్నారు. హిందీ టీవీ నటి, స్ప్లిట్స్‌విల్లా ఫేం ఆరాధన శర్మ తాజాగా ఈ జాబితాలో చేరారు. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ‘‘ఆ భయానక ఘటన గురించి నా జీవితంలో మర్చిపోలేను. నాలుగైదేళ్ల క్రితం అనుకుంటా.. అప్పుడు నేను పుణెలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నా. నాకప్పుడు 19 ఏళ్లు ఉంటాయి. ఒకరోజు స్వస్థలం రాంచికి వెళ్లినపుడు ఓ వ్యక్తిని కలిశాను. అతడు ముంబైలో కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. అప్పటికే నేను పుణెలో పలు మోడలింగ్ అసైన్మెంట్స్ చేసి ఉన్నందున తన గురించి తెలుసు. రాంచీకి వెళ్లినపుడు తను నన్ను కలిశాడు. ఒక మంచి కారెక్టర్ ఉంది. అడిషన్ ఇమ్మన్నాడు. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి స్క్రిప్టు చదువుతున్నాం. ఇంతలో అతడు నెమ్మదిగా నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తొలుత నాకేం అర్థంకాలేదు. కానీ, విషయం అర్థమైన వెంటనే.. అతడిని తోసేసి గది నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అని తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. అదే విధంగా... ‘‘ఆ ఘటన తర్వాత నాకు పురుషులపై నమ్మకం పోయింది. నా మనసులో చెరగని ముద్ర పడింది. అప్పటి నుంచి.. ఏదైనా సందర్భంలో.. నా తండ్రితో అయినా సరే గదిలో ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తుంది. ఎవరైనా సరే నన్ను తాకితే కంపరంగా ఉంటుంది. నాపై ఇంతటి చెడు ప్రభావం చూపిన ఆ ఘటనకు కారణమైన వ్యక్తిని అప్పుడే నిలదీయాలని మా అమ్మ నిర్ణయించుకుంది. కానీ మా కుటుంబ సభ్యులు గొడవలు వద్దంటూ సర్దిచెప్పారు’’ అని ఆరాధన శర్మ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా స్ప్లిట్స్‌విల్లా షోలో పాల్గొన్న ఆరాధన... తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోతో పాపులర్ అయ్యారు. అదే విధంగా.. అల్లావుద్దీన్- ‘నామ్ తో సునా హై హోగా’లో సుల్తానా తమన్నా పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Aradhana Sharma (@aradhanasharmaofficial) -
ఇదో మరపురాని అనుభూతి!
తన జీవితంలో మరపురాని, మధురమైన అనుభూతి ఇది అంటున్నారు నటుడు శివకార్తికేయన్. ఒక బుల్లితెర యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభి, రాణించిన ఈయన అందులోనే ఆనందాన్ని వెతుక్కోకుండా, నటుడిగా అవతారమెత్తి చాలా వేగంగా టాప్ హీరోగా ఎదిగిపోయారు. ఈయన నటించిన తాజా చిత్రం సీమరాజా మిశ్రమ స్పందనను పొందినా, ప్రస్తుతం స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార నాయకిగా నటిస్తోంది. కాగా శివకార్తికేయన్ నిర్మాతగా మారి కణా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్యరాజేశ్, సత్యరాజ్, దర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్రాజా కామరాజ్ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీకి దిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు. కణా చిత్ర ఆడియో ఇటీవల విడుదలై సంగీతప్రియుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా ఈ ఆల్బంలోని వాయాడి పెత్త పుళ్ల అనే పాటను యూట్యూబ్‌లో 50 మిలియన్ల మంది చూశారట. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శివకార్తికేయన్ తన ఐదేళ్ల కూతురు ఆరాధనతో కలిసి పాడడం. దీంతో పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్న శివకార్తికేయన్ తన ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని సమయల్లో మనం ఊహించన సంఘటనలు జరిగి సంతోషంలో ముంచేస్తాయన్నారు. అలాంటి సంతోషాన్నే సంగీత ప్రేమికులు తమ చిత్రంలోని వాయాడి పెత్త పుళ్ల పాటకు అందించారన్నారు. తండ్రి, కూతుళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించే పాటగా ఇంది ఉంటుందన్నారు. ఇది సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, గీత రచయిత జీకేపీల సమష్టి కృషికి దక్కిన విజయంగా పేర్కొన్నారు. తన కూతురు ఆరాధనకు తనకు మధ్య ప్రేమానుబంధాన్ని కాలమంతా గుర్తుండిపోయి, మధురానుభూతిని కలిగించేలా చేసే ఈ పాటను అందించిన వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాన్నారు. ఆరాధన తీయని గొంతు ఈ పాట ఇంత మధురంగా రావడానికి కారణం అన్నారు. అన్నిటికీ మించి తనను, తన కూతురిని ఈ పాట పాడించాలన్న ఆలోచనను తీసుకొచ్చిన దర్శకుడు అరుణరాజు కామరాజ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. కణా చిత్ర నిర్మణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శివకార్తికేయన్ తెలిపారు. ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని, రైతుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. అథ్లెట్స్ క్రీడల్లో రాణించాలన్న కూతురు కలను నెరవేర్చడానికి తండ్రి ఏం చేశారన్నది ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. -
ఆనందంగా ఆలాపన
జనరల్‌గా తండ్రీ కూతుళ్లు కలిసి నటించడం చూస్తుంటాం. కానీ ఈసారి కాస్త డిఫరెంట్. తండ్రి శివకార్తీకేయన్‌తో కలిసి పాట పాడారు చిన్నారి ఆరాధన. ఐశ్వర్యా రాజేష్ ముఖ్య పాత్రలో తమిళంలో రూపొందిన సినిమా ‘కనా’. ‘డ్రీమ్ బిగ్’ అనేది క్యాప్షన్. నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్ర చేశారు. నటుడు శివ కార్తీకేయన్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌లో రూపొందిన తొలి చిత్రమిది. ఓ పల్లెటూరి అమ్మాయి గొప్ప క్రికెటర్ కావాలనుకున్న తన కలను ఎలా నేరవేర్చుకుంది? అన్నది ఈ చిత్రకథ. ‘‘సినిమాలో ఐశ్యర్యా రాజేష్ చిన్నతనంలో తండ్రితో కలిసి పాడే పాట ఇది. ఎవరి చేత పాడిద్దాం అనుకుంటున్న టైమ్‌లో శివ కార్తీకేయన్, ఆయన కూతురు ఆరాధన గుర్తొచ్చారు. విషయం చెప్పాం. ఆనందంగా ఓకే అని ఈ పాటను ఆలపించారు. పాట పాడేప్పుడు ఆరాధన నెర్వస్‌గా ఫీలవ్వలేదు. ఈ సాంగ్‌లో సింగర్ విజయలక్ష్మి కూడా గొంతు కలిపారు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు దిబు థామస్. లిరిసిస్ట్ అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాతో దర్శకునిగా మారారు. -
నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
పాత్రల నేపథ్యాన్నీ, స్వభావాన్నీ పాటలోకి తెస్తూనే దాన్ని కవిత్వంగా పలికించడం గీత రచయితలకు సవాల్ లాంటిది. ఆరాధన చిత్రంలోని ‘అరె ఏమైందీ/ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ’ పాట కోసం ఆచార్య ఆత్రేయ ఈ పని అనాయాసంగా చేయగలిగారు. ‘నింగి వంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది’ అన్నప్పుడు నాయికానాయకుల అంతరాలు స్పష్టంగా కళ్ల ముందు నిలుస్తాయి. దాన్నే కొనసాగిస్తూ వచ్చే మరో చరణం పూర్తిగా ఉటంకించదగినది. ‘బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు మనిషౌతాడు’. ఇళయరాజా అద్భుతంగా సంగీతం సమకూర్చిన ఈ పాటను ఎస్.జానకి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. చిరంజీవి, సుహాసిని అభినయించారు. తమిళ దర్శకుడు భారతీరాజానే ఈ 1987 నాటి రీమేక్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు. -
ఆరాధన కేసులో ఆధారాలు లేవు
- కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటన - బాలల హక్కుల సంఘానికి నోటీస్ హైదరాబాద్: 68 రోజుల పాటు ఉపవాసం ఉండి తనువు చాలించిన ఆరాధన సముదారియా(13) కేసులో ఆధారాలు ఏమీ లేవంటూ పోలీసులు తేల్చారు. ఈ మేరకు బాల ల హక్కుల సంఘానికి మార్కెట్(సికింద్రాబాద్) పీఎస్ నుంచి కేసును మూసివేస్తున్నట్లు నోటీసు ద్వారా తెలిపారు. గత ఏడాది జూన్ 2న 68 రోజులు ఉపవాసం ఉండి మృతి చెందిన ఆరాధన వ్యవహారంపై బాలల హక్కుల సంఘం స్పందించింది. సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుమారు పది నెలల పాటు విచారించిన పోలీసులు తమకేమీ ఆధారాలు లభించలేదన్నారు. ఉపవాసం ఉంచబట్టే మృతి చెందిందని ఆధారాలు ఉన్న ప్పటికీ ఏ ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం హాస్యా స్పదంగా ఉందని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు తెలిపారు. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. 'ఆరాధనను ఎవరూ దీక్ష చేయమనలేదు' 'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది' ‘ఆరాధన’ ఘటనపై నివేదిక ఇవ్వండి -
ఘనంగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం
అన్నవరం (ప్రత్తిపాడు) : శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవం అన్నవరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. దేవస్థానం హైస్కూల్ ఎదుట ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉదయం నుంచి రాత్రి వరకూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కళాకారులు ఆలపించిన పంచరత్న కీర్తనలు, త్యాగరాజ కృతులు సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నాయి. ప్రముఖ గాయని మణి, కర్ణాటక సంగీత కళాకారిణి చాగంటి రమ్య కిరణ్మయి ఆలపించిన కీర్తనలు ఆహూతుల మన్ననలందుకున్నాయి. దేవస్థానం వ్రత పురోహిత సూపర్వైజర్ నాగాభట్ల కామేశ్వరశర్మ ఇంటి వద్ద నుంచి ఉదయం 7 గంటలకు నగర సంకీర్తన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చామర్తి పట్టాభి త్యాగరాజ స్వామి వేషధారణలో అందరినీ అలరించారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లికి చెందిన కె.కళ్యాణి భాగవతారిణి త్యాగరాజ విరచిత పంచరత్న కీర్తనలు, సాయంత్రం ఐదు గంటలకు దేవస్థానం సంగీత విధ్వాంసుడు పెండ్యాల శ్రీనివాస్ నాదస్వర కచేరీ నిర్వహించారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకూ చాగంటి రమ్య కిరణ్మయి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. అనంతరం హార్మోనియం విధ్వాంసుడు కాకరపర్తి అప్పారావును ఘనంగా సన్మానించారు. తొమ్మిదేళ్లుగా త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్న ఇంద్రగంటి త్యాగరాజును పలువురు అభినందించారు. కార్యక్రమంలో వేదపండితులు కపిలవాయి రామశాస్త్రి, యనమండ్ర సూర్యనారాయణ, విశ్రాంత ప్రధానార్చకులు నాగాభట్ల సత్యనారాయణ, వ్రత పురోహితులు చామర్తి కన్నబాబు, సుబ్రహ్మణ్యస్వామి ఆలయ కమిటీ ప్రతినిధులు గాడేపల్లి నాని, కందర్ప శ్రీరామచంద్రమూర్తి, ఇంద్రగంటి నరసింహమూర్తి, బుర్రకథ కళాకారుడు మడిపల్లి వెంకట్రావు, పలువురు సంగీతాభిమానులు పాల్గొన్నారు. -
‘ఆరాధన’ ఘటనపై నివేదిక ఇవ్వండి
నార్త్‌జోన్ డీసీపీకి లోకాయుక్త ఆదేశం సాక్షి, హైదరాబాద్: బలవంతంగా ఉపవాస దీక్ష చేయించి చిన్నారి ఆరాధన మృతికి కారణమైన ఘటనపై దర్యాప్తు చేసి ఈ నెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్‌జోన్ డీసీపీని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి గురువారం ఆదేశిం చారు. ఆరాధనతో 68 రోజులు ఉపవాస దీక్ష చేయించి ఆమె మృతికి కారణమైన తల్లిదండ్రులు లక్ష్మీచంద్ సమ్‌దారియా, మనిషాలతోపాటు ఉపవాస దీక్షను ప్రోత్సహించిన వారందరిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధా రావు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించింది. -
'ఆరాధనను ఎవరూ దీక్ష చేయమనలేదు'
-
'ఆరాధనను ఎవరూ దీక్ష చేయమనలేదు'
హైదరాబాద్: మూఢ నమ్మకాలను జైన మతం నమ్మదని జైన్ సేవా సంఘం చెప్పింది. ఆరాధనను దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలికను ఈ దీక్షలో కేవలం మంచినీళ్లను మాత్రమే తాగేలా చూశారు. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలనే కండీషన్ పెట్టారు. ఫలితంగా ఈ దీక్ష ఈ నెల (అక్టోబర్) 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, తొలిసారి జైన్ సేవా సంఘం ఆరాధన మృతిపై స్పందించింది. జైన్ మతాచారం ప్రకారం ఆరాధన తపస్యా దీక్ష చేసిందని, అంతే తప్ప ఆమెపై దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పారు. మూఢనమ్మకాలకు ముందు నుంచే జైన్ సమాజం దూరం అని అన్నారు. -
ఉపవాస దీక్ష వల్ల ఆరాధాన మరణించలేదు
-
'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది'
సికింద్రాబాద్: గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయిందని కిమ్స్ వైద్యులు చనిపోయారు. 68 రోజుల ఉపవాసం వల్ల ఆమె పేగులు, కిడ్నీలు ఎండిపోయాయని వైద్యులు అధికారికంగా ప్రకటించారు. గుండె సమస్య రావడం వల్లే ఆరాధనను తల్లి దండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారని, అయితే మార్గం మధ్యలోనే ఆమె చనిపోయిందని వారు వెల్లడించారు. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలికను కేవలం మంచినీళ్లను మాత్రమే తాగేలా చూశారు. అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలనే కండీషన్ పెట్టారు. ఫలితంగా ఈ దీక్ష ఈ నెల (అక్టోబర్) 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. దీనిపై స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధారావు, గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరాధన తండ్రి మూఢాచారంతో ఆమెను 68 రోజులు ఉపవాసం ఉంచారని వారు పేర్కొన్నారు. ఆమె డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలోని అన్ని అవయవాలు పూర్తిగా పాడవడంతో మరణించినట్లు కిమ్స్ వైద్యులు ధ్రువీకరించినట్లు తెలిపారు. -
'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది'
-
ఆధ్యాత్మిక నిలయం.. వెంకయస్వామి ఆలయం
నేడు తీర్ధం వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవం డక్కిలి : మండలంలోని దగ్గవోలు గ్రామంలో ఉన్న తీర్ధం వెంకయ్యస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. గొలగమూడి, చేజర్లలోని ఆలయాల తర్వాత మహిమ గల దేవస్థానంగా ఇది పేరుగాంచింది. ఇదీ కథ.. మారుమూల పల్లెయిన దగ్గవోలులో ఆలయ ఆవిర్భావం వెనుక ఓ యువకుడి అధ్యాత్మిక అలోచన ఉంది. దగ్గవోలు గ్రామానికి చెందిన తోట ఈశ్వరయ్య, వరలక్ష్మమ్మ కుమారుడు రమణయ్య 18 ఏళ్ల వయస్సులో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఓరోజు రమణయ్య గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన ఆరాధనోత్సవంలో పాల్గొని ఇంటికి వచ్చాడు. వెంకయ్యస్వామిని దర్శించుకున్న క్షణం నుంచి రమణయ్యలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడింది. క్రమంగా అతను గొర్కెలు కాసేందుకు వెళ్లడం ఆపేశాడు. కొద్దిరోజులకు తల్లిదండ్రులు ఆగ్రహించడంతో రమణయ్య గొర్కెల కాపరిగా వెళ్లాడు. ఒకరోజు గొర్రెలు మేపుతూ నిద్రలోకి జారుకున్న రమణయ్యకు కలలో ఓ మహర్షి రూపం కనిపించి దగ్గవోలు చెరువు సమీపంలోని బండరాయిలో రెండు అడుగల లోతులో నీరు పడతుంది. ఆప్రాంతంలో దేవస్థానం నిర్మించాలని మహర్షి చెప్పారు. వెంటనే రమణయ్య మరో ఇద్దరు కలిసి చెరువు వద్దనున్న బండరాయి పగులగొట్టి రెండు అడుగులలోతు తవ్వాగా నీరు ఎగచిమ్మింది. 97లో శంకుస్థాపన కలలో మహర్షి చెప్పింది నిజం కావడంతో రమణయ్య తీర్ధం వెంకయ్యస్వామి దేవస్థానం ఏర్పాటుచేశాడు. మెదట పూరి గుడెసెలో వెంకయ్యస్వామి పటం పెట్టి పూజలు చేశాడు. 1997 సంవత్సరం ఆగస్టు 27 తేదీన ఆలయానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రమణయ్య వయస్సు 39 సంవత్సరాలు. ఆయనే ఆశ్రమ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకపోయినా తన మదురమైన గొంతుతో వెంకయ్యస్వామి పాటలను గ్రామాల్లో పాడుతూ అధ్యాత్మిక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆలయం వద్ద ఉన్న రెండు అడుగుల బావిలో నీరు ఎప్పటికీ ఎండదు. నేడు 19వ ఆరాధన మహోత్సవం తీర్ధం వెంకయ్యస్వామి 19వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం ప్రభాతసేవ, స్వామికి అష్టోత్తర శతనామవళి పూజలు, మధ్యాహ్నం అన్నదానం, నవరత్నాలు భజన, రాత్రి 9 గంటలకు పాండురంగ నాట్యమండలి నెల్లూరువారిచే శ్రీరామాంజనేయయుద్దం, 10 గంటలకు గయోపాఖ్యానం (యుద్దశీను), 11 గంటలకు సత్యహరిశ్చంద్రపూర్తి నాటకం, రాత్రి 12గంటలకు స్వామివారి పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ అభివద్ధికి కషి: రమణానందస్వామి, ఆశ్రమ ధర్మకర్త ఆలయ అభివద్ధికి చిన్న వయస్సు నుండే శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నా. ఊరూరు తిరిగి అనేకమంది సహకారం తీసుకున్నాం. -
వైభవంగా జైతీర్థుల ఆరాధన
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠంలో మంగళవారం వైభవంగా జై తీర్థుల ఆరాధన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర స్వామివారి మఠంలో ముడో పిఠాధిపతి జై తీర్థుల ఆరాధనను ఘనంగా జరిపారు. శ్రీ మఠం పిఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారజాము నుంచి మఠంలోని మూల బృందావనానికి ఫల, పూల, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.