
‘ఆరాధన’ ఘటనపై నివేదిక ఇవ్వండి
నార్త్‌జోన్ డీసీపీకి లోకాయుక్త ఆదేశం
సాక్షి, హైదరాబాద్: బలవంతంగా ఉపవాస దీక్ష చేయించి చిన్నారి ఆరాధన మృతికి కారణమైన ఘటనపై దర్యాప్తు చేసి ఈ నెల 24లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్‌జోన్ డీసీపీని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి గురువారం ఆదేశిం చారు. ఆరాధనతో 68 రోజులు ఉపవాస దీక్ష చేయించి ఆమె మృతికి కారణమైన తల్లిదండ్రులు లక్ష్మీచంద్ సమ్‌దారియా, మనిషాలతోపాటు ఉపవాస దీక్షను ప్రోత్సహించిన వారందరిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధా రావు దాఖలు చేసిన పిటిషన్‌ను లోకాయుక్త విచారణకు స్వీకరించింది.