
'ఆరాధనను ఎవరూ దీక్ష చేయమనలేదు'
మూఢ నమ్మకాలను జైన మతం నమ్మదని జైన్ సేవా సంఘం చెప్పింది. ఆరాధనను దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది.
హైదరాబాద్: మూఢ నమ్మకాలను జైన మతం నమ్మదని జైన్ సేవా సంఘం చెప్పింది. ఆరాధనను దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలికను ఈ దీక్షలో కేవలం మంచినీళ్లను మాత్రమే తాగేలా చూశారు.
అది కూడా సూర్యాస్తమయం నుంచి సూర్యోదయం మధ్యలో మాత్రమే నీళ్లు తాగాలనే కండీషన్ పెట్టారు. ఫలితంగా ఈ దీక్ష ఈ నెల (అక్టోబర్) 3వ తేదీకి ముగిసింది. కానీ అప్పటికే ఆరాధన డీహైడ్రేషన్‌కు గురై, శరీరంలో కిడ్నీలు సహా పలు అవయవాలు పూర్తిగా దెబ్బతినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయి.. మరణించింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. అయితే, తొలిసారి జైన్ సేవా సంఘం ఆరాధన మృతిపై స్పందించింది. జైన్ మతాచారం ప్రకారం ఆరాధన తపస్యా దీక్ష చేసిందని, అంతే తప్ప ఆమెపై దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని చెప్పారు. మూఢనమ్మకాలకు ముందు నుంచే జైన్ సమాజం దూరం అని అన్నారు.