హీరోయిన్‌ మాలశ్రీ కూతుర్ని చూశారా? తల్లినే మించిపోయేలా ఉందే! | Malashri Daughter Aradhana Photos Goes Viral | Sakshi
Sakshi News home page

Malashri: గ్లామర్‌ క్వీన్‌ మాలశ్రీ కూతుర్ని చూశారా? అందంలో అమ్మను మించిపోయేలా ఉందిగా!

Published Sun, Aug 20 2023 2:12 PM | Last Updated on Sun, Aug 20 2023 2:19 PM

Malashri Daughter Aradhana Photos Goes Viral - Sakshi

ఇదిలా ఉంటే మాలశ్రీ కూతురు అనన్య కూడా తల్లి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్‌ దర్శన్‌ 'కాటీర' సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటివరకు ఆమెను అనన్య, రాధన అనే పేర్లతో పిలిచేవారు. అయితే తాజాగా తాను పేరు మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

'సాహసవీరుడు సాగరకన్య', 'ప్రేమఖైదీ', 'భలే మావయ్య' వంటి పలు హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్‌ మాలశ్రీ. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లోనూ మెరిసి మురిపించింది. ఈమె తెలుగులో చివరగా 1997లో వచ్చిన 'సూర్య పుత్రులు' మూవీలో కనిపించింది.

పేరు మార్చుకున్న హీరోయిన్‌
కన్నడలో నిర్మాత రాముతో 'ముత్యనంత హెంతి'(ముత్యం లాంటి పెళ్లాం) సినిమా చేసిన మాలశ్రీ అతడినే పెళ్లాడింది. వీరికి అనన్య, అర్జున్‌ అని ఇద్దరు పిల్లలున్నారు. 2021లో రాము కరోనాతో కన్నుమూశాడు. ఇప్పటికీ ఆయనను తలుచుకుని భావోద్వేగానికి లోనవుతుంటుంది మాలశ్రీ. ఇదిలా ఉంటే మాలశ్రీ కూతురు అనన్య కూడా తల్లి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్‌ దర్శన్‌ 'కాటీర' సినిమాలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. ఇప్పటివరకు ఆమెను అనన్య, రాధన అనే పేర్లతో పిలిచేవారు. అయితే తాజాగా తాను పేరు మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది.

మీ ఆశీర్వాదాలు కావాలి
'హలో అందరికీ.. నా పేరు రాధన రామ. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నేను పేరు మార్చుకున్నాను. ఇకపై నా పేరు ఆరాధన. ఈ మార్పు కోసం మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను. నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఆరాధన పేరు కూడా అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు. త్వరలో వెండితెరపై మెరవనున్న ఆరాధన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన హీరో.. ఫోటోలు వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement