Malashri
-
హీరోయిన్ మాలశ్రీ కూతుర్ని చూశారా? తల్లినే మించిపోయేలా ఉందే!
'సాహసవీరుడు సాగరకన్య', 'ప్రేమఖైదీ', 'భలే మావయ్య' వంటి పలు హిట్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ మాలశ్రీ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అప్పుడప్పుడూ తెలుగు చిత్రాల్లోనూ మెరిసి మురిపించింది. ఈమె తెలుగులో చివరగా 1997లో వచ్చిన 'సూర్య పుత్రులు' మూవీలో కనిపించింది. పేరు మార్చుకున్న హీరోయిన్ కన్నడలో నిర్మాత రాముతో 'ముత్యనంత హెంతి'(ముత్యం లాంటి పెళ్లాం) సినిమా చేసిన మాలశ్రీ అతడినే పెళ్లాడింది. వీరికి అనన్య, అర్జున్ అని ఇద్దరు పిల్లలున్నారు. 2021లో రాము కరోనాతో కన్నుమూశాడు. ఇప్పటికీ ఆయనను తలుచుకుని భావోద్వేగానికి లోనవుతుంటుంది మాలశ్రీ. ఇదిలా ఉంటే మాలశ్రీ కూతురు అనన్య కూడా తల్లి అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధమైంది. కన్నడ స్టార్ దర్శన్ 'కాటీర' సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటివరకు ఆమెను అనన్య, రాధన అనే పేర్లతో పిలిచేవారు. అయితే తాజాగా తాను పేరు మార్చుకుంటున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. మీ ఆశీర్వాదాలు కావాలి 'హలో అందరికీ.. నా పేరు రాధన రామ. మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. నేను పేరు మార్చుకున్నాను. ఇకపై నా పేరు ఆరాధన. ఈ మార్పు కోసం మీ ఆశీర్వాదాలు కోరుతున్నాను. నాపై ఎంతగానో ప్రేమాభిమానాలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు' అని రాసుకొచ్చింది. ఆరాధన పేరు కూడా అద్భుతంగా ఉందంటున్నారు అభిమానులు. త్వరలో వెండితెరపై మెరవనున్న ఆరాధన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Aradhanaa / Anannya Ramu (@aradhanaa_r) చదవండి: ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేసిన హీరో.. ఫోటోలు వైరల్ -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న నటి మాలాశ్రీ కూతురు
ప్రముఖ నిర్మాత దివంగత రాము, సీనియర్ నటి మాలా శ్రీ కుమార్తె రాథనా రామ్ హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుంది.'చాలెంజింగ్ స్టార్' దర్శన్‌తో కలిసి D56 వర్కింగ్ టైటిల్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తన రాక్‌లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తెలుగు,కన్నడ , మలయాళం, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'రాబర్ట్' ఫేమ్ తరుణ్ సుధీర రచన, దర్శకత్వం వహిస్తున్నారు. బెంగళూరులోని శ్రీ రవిశంకర్ గురూజీ ఆశ్రమంలో ఈ సినిమాను ప్రారంభించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా తెలుగులో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన మాలాశ్రీ తన అందం, అభినయంతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. లేడీ ఓరియెంటెండ్ చిత్రాలతోనూ మెప్పించారు. ఇప్పుడు మాలాశ్రీ కుమార్తె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుండటంతో ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా మాలాశ్రీ మాట్లాడుతూ.. 'రాధనాకు శుభాకాంక్షలు. ఆమెకు ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రాక్‌లైన్ నా సినిమాతో ప్రొడక్షన్లోని అడుగుపెట్టారు. ఇప్పుడు రాక్‌లైన్ వెంకటేష్ నిర్మిస్తున్న సినిమాతో నా కూతురు నటిగా అరంగేట్రం చేస్తోంది. మంచి టీమ్‌తో ఆమె అరంగేట్రం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. చిన్నప్పటి నుంచి నటి కావాలనుకుంది. ముంబైలో నటన, డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె గత కొన్నేళ్లుగా చాలా కష్టపడి పని చేసింది . నా కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. -
నిర్మాత రామానాయుడు మాకు ఖరీదైన గిఫ్టులిచ్చారు!
'సాహసవీరుడు సాగరకన్య', 'ప్రేమఖైదీ', 'భలే మావయ్య' చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది నటి మాలశ్రీ. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్, యాక్షన్ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగు బుల్లితెరపై ప్రత్యక్షమైందీ నటి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాలశ్రీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 'సాహసవీరుడు సాగరకన్య' తర్వాత పెళ్లి చేసుకున్నానని, అదే సమయంలో కన్నడలో బిజీ అయిపోయానని చెప్పుకొచ్చింది. అక్కడ వరుస యాక్షన్ సినిమాలు చేస్తూ యాక్షన్ హీరో అయిపోయానని తెలిపింది. నాతో సినిమా చేయాలనుందని నిర్మాత రాము అడగడంతో ఆయనతో ముత్యనంత హెంతి (ముత్యం లాంటి పెళ్లాం) మూవీ చేశానని తెలిపింది. అంతేకాదు, ఆయనకు ముత్యంలాంటి పెళ్లాం దొరకాలని ఆరోజు ప్రెస్మీట్లో కూడా చెప్పానని, కానీ చివరకు తనే ఆయనకు భార్యనవుతానని అనుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఒకసారి ఒక ఏడాదిలో 14 సినిమాలు చేశానంది. ప్రేమఖైదీ పెద్ద హిట్ కావడంతో రామానాయుడు తనకు, హీరోకు ఖరీదైన వాహనాలను బహుమతిగా ఇచ్చాడన్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది తన భర్త రాము చనిపోగా ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది మాలశ్రీ. చదవండి: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత -
ముగిసిన నటి మాలాశ్రీ భర్త అంత్యక్రియలు
యశవంతపుర(కర్ణాటక): ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, నటీమణి మాలాశ్రీ భర్త కోటి రాముకు కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనాతో సోమవారం బెంగళూరులో కన్నుమూయడం తెలిసిందే. మంగళవారం ఆయన స్వస్థలమైన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కోడిగేహళ్లి జరిగాయి. కన్నడ సినిమా రంగంలో మూడు దశాబ్దాల పాటు సినిమాలను నిర్మించి కోటి రాముగా పేరు గాంచారు. అక్కడి ఫాం హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరిపించారు. సతీమణి మాలాశ్రీ, ఇద్దరు సంతానం, బంధువులు పాల్గొన్నారు. జేడీఎస్ నేత నిఖిల్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు. -
ఎన్నికల అధికారి సాహసం
మాలాశ్రీ ఎన్నికల అధికారిగా ఓ శక్తిమంతమైన పాత్ర పోషించిన కన్నడ చిత్రం ‘ఎలక్షన్’. ఓం ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. మాలాశ్రీ భర్త రాము ఈ అనువాద చిత్రానికి నిర్మాత. ‘‘ఎన్నికల సమయంలో జరిగే చీకటి నేరాలపై ఓ మహిళా ఎన్నికల అధికారి ఏ విధంగా ఉక్కుపాదం మోపింది అనేది ఈ చిత్రం కథ. తెలుగు ప్రేక్షకులకు నచ్చే వాణిజ్య అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, కెమెరా: రాజేశ్ కట్ట, సంగీతం హంసలేఖ. -
3 నిమిషాల సీన్‌కి 72 లక్షలు!
పవర్ఫుల్ యాక్షన్ చిత్రాల్లో నాయికగా నటిస్తూ, డైనమిక్ లేడీ ఇమేజ్ తెచ్చుకున్న మాలాశ్రీ ప్రస్తుతం ‘బాయ్స్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. స్వీయదర్శకత్వంలో శంకర్ గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఈత కొలనులో కొన్ని రిస్కీ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో క్లయిమాక్స్‌ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మూడు నిమిషాల పాటు సాగే ఈ సీన్‌కి అయ్యే ఖర్చు 72 లక్షలు. ఇది ఛేజింగ్ సీన్ కావడంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వాడనున్నారట. అలాగే బాంబు పేలుళ్లు కూడా జరుగుతాయట. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ సీన్ చిత్రీకరణ జరుగుతుందని, 72 లక్షలకు మించే అవకాశం ఉందని కూడా శంకర్‌గౌడ అంటున్నారు. కన్నడ సినిమా చరిత్రలో అత్యంత సాహసోపేతమైన క్లయిమాక్స్ ఇదే అవుతుందని, అందుకే రాజీపడటంలేదని ఆయన తెలిపారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు ఆధ్వర్యంలో ఈ క్లయిమాక్స్ చిత్రీకరణ జరగనుంది.