Ramanaidu Daggubati Expensive Gifts to Malashri for Prema Khaidi Movie - Sakshi
Sakshi News home page

Malashri: ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా.. కంటతడి పెట్టిన అలనాటి హీరోయిన్‌

Published Wed, Mar 16 2022 4:59 PM | Last Updated on Wed, Mar 16 2022 5:54 PM

Daggubati Ramanaidu Gifts to Malashri for Prema Khaidi Movie - Sakshi

'సాహసవీరుడు సాగరకన్య', 'ప్రేమఖైదీ', 'భలే మావయ్య' చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది నటి మాలశ్రీ. టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా రాణించడం ఖాయం అనుకుంటున్న సమయంలో కన్నడ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. లవ్‌, యాక్షన్‌ సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత తెలుగు బుల్లితెరపై ప్రత్యక్షమైందీ నటి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మాలశ్రీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

'సాహసవీరుడు సాగరకన్య' తర్వాత పెళ్లి చేసుకున్నానని, అదే సమయంలో కన్నడలో బిజీ అయిపోయానని చెప్పుకొచ్చింది. అక్కడ వరుస యాక్షన్‌ సినిమాలు చేస్తూ యాక్షన్‌ హీరో అయిపోయానని తెలిపింది. నాతో సినిమా చేయాలనుందని నిర్మాత రాము అడగడంతో ఆయనతో ముత్యనంత హెంతి (ముత్యం లాంటి పెళ్లాం) మూవీ చేశానని తెలిపింది. అంతేకాదు, ఆయనకు ముత్యంలాంటి పెళ్లాం దొరకాలని ఆరోజు ప్రెస్‌మీట్‌లో కూడా చెప్పానని, కానీ చివరకు తనే ఆయనకు భార్యనవుతానని అనుకోలేదని పేర్కొంది. ఇదిలా ఉంటే ఒకసారి ఒక ఏడాదిలో 14 సినిమాలు చేశానంది. ప్రేమఖైదీ పెద్ద హిట్‌ కావడంతో రామానాయుడు తనకు, హీరోకు ఖరీదైన వాహనాలను బహుమతిగా ఇచ్చాడన్న విషయాన్ని వెల్లడించింది. గతేడాది తన భర్త రాము చనిపోగా ఈ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నానంటూ కంటతడి పెట్టుకుంది మాలశ్రీ.

చదవండి: ఆ సినిమా చూసి నేను, నా భర్త ఏడ్చేశాం: ప్రణీత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement