జై హనుమాన్ ఫస్ట్‌ లుక్‌.. సర్‌ప్రైజ్ అదిరిపోయిందిగా! | Director Prasanth Varma Movie Jai Hanuman Unveiled The First-Look Poster Of Rishab Shetty As Lord Hanuman | Sakshi
Sakshi News home page

Jai hanuman First Look: జై హనుమాన్ ఫస్ట్‌ లుక్‌.. హనుమంతుని పాత్రలో ఆ హీరోనే!

Published Wed, Oct 30 2024 5:59 PM | Last Updated on Wed, Oct 30 2024 6:20 PM

Prasanth Varma Jai Hanuman Movie First Look Poster Revealed

హనుమాన్‌తో సూపర్‌ హిట్‌ కొట్టిన టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పెద్ద సినిమాలను వెనక్కి నెట్టిన ఈ సినిమా కళ్లు చెదిరే కలెక్షన్స్ రాబట్టింది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు యంగ్ డైరెక్టర్.

ఇప్పటికే ప్రాజెక్ట్‌ను అనౌన్స్‌ చేయగా.. దీపావళికి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చాడు. జైహనుమాన్‌ పేరుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో కన్నడ స్టార్, కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుని పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన పోస్టర్‌లో శ్రీరాముడి విగ్రహాన్ని చేతిలో పట్టుకుని కనిపించారు రిషబ్ శెట్టి.

అందరూ ఊహించినట్లుగానే'కాంతార' ఫేమ్ రిషభ్ శెట్టి ఈ పోస్టర్‌లో హనుమంతుడిగా కనిపించారు. ఈ అద్భుతమైన పోస్టర్ రిషబ్ శెట్టిని హైలైట్ చేయడమే కాకుండా హనుమంతుని భక్తి, శక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పాత్రలో లెజెండరీ యాక్టర్‌ అద్భుతంగా సెట్‌ అయినట్లుగా కనిపిస్తోంది. ఈ పాత్రలో రిషబ్ శెట్టిని  తెరపై చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ సీక్వెల్‌లో ప్రశాంత్ వర్మ మరింత గొప్ప కథను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అద్భుతమైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో అది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ సినిమాను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రి మూవీ మేకర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో నిర్మిస్తున్నారు
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement