ప్రస్తుతం చిత్రసీమలో నడుస్తున్న ఒకటే టాక్ కాంతార. ఎక్కడా చూసినా కాంతార ప్రభంజనం సృష్టిస్తోంది. ఈ చిత్రంపై భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ ఒక్క సినిమాలో ఎవరికీ పరిచయం లేని రిషబ్ శెట్టి ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఆయనే దర్శకుడిగా, హీరోగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను ఓ రేంజ్‌లో షేక్ చేస్తోంది. కర్ణాటకలోని ఆదివాసీ సంప్రదాయాన్ని తెరపై ఆకట్టుకునేలా చూపించిన తీరు అద్భుతంగా ఉందంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.
అయితే ఈ చిత్రంలో అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరన్న విషయంపై అందరి ఫోకస్ పడింది . తన కుమారుని సంతోషాన్ని ఆశించే మహిళగా కమల పాత్రలో ఆమె కనిపించింది. ఈ సినిమా ఫేమస్ కావడంతో ఒక్కసారిగా నటీనటులపై అందరి దృష్టి సారించారు. అమ్మ పాత్రలో నటించిన ఆమె ఎవరు? ఇంతకు ముందు ఆమె ఏ సినిమాల్లోనైనా నటించిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ వివరాలేంటో ఓ సారి చూద్దాం.
ఆమె పేరు మానసి సుధీర్. కరోనా లాక్ డౌన్ సమయంలో పిల్లల ప్రదర్శన పాటలు పాడి సోషల్ మీడియాలో గుర్తింపు పొందింది. ఇటీవల సినిమాల్లో తల్లి పాత్రలలో ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఈ చిత్రంలో మానసి అమ్మ పాత్రలో ప్రేక్షకులను మెప‍్పించింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైన మానసి సుధీర్ లాక్ డౌన్ సమయంలో తన యూట్యూబ్ ఛానల్ పిల్లలకు పాఠాలు భోదించేవారు. తాజాగా ఆమె నటించిన కాంతార బాక్సాఫీస్ వద్ద హిట్ కావడంతో రానున్న కాలంలో ఆమెకు మరిన్నీ ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment