
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment