Theme Song
-
రిషబ్ శెట్టి 'జై హనుమాన్'.. దీపావళి అప్డేట్ వచ్చేసింది!
హనుమాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగానే జై హనుమాన్‌లో కాంతార ఫేమ్ రిషబ్ శెట్టిని పరిచయం చేశారు. హనుమంతుని పాత్రలో రిలీజ్ చేసిన రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.తాజాగా ఇవాళ దీపావళి సందర్భంగా జై హనుమాన్ థీమ్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. 'యుగయుగముల యోగమిది దాశరథి' అంటూ సాగే భక్తి సాంగ్ అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. సింగర్ రేవంత్ ఆలపించారు. ఈ సాంగ్‌కు ఓజెస్ సంగీతమందించారు. కాగా.. జై హనుమాన్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. -
'కల్కి' థీమ్ సాంగ్ రిలీజ్.. మొత్తం స్టోరీ ఒకే పాటలో!
ప్రభాస్ 'కల్కి' రిలీజ్‌కి మరో రోజు మాత్రమే మిగిలుంది. ఇప్పటికే ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసేశారని అనుకుంటే.. ఇప్పుడు తాజాగా థీమ్ సాంగ్ రిలీజ్ చేశారు. 'కల్కి' గురించి ఎలివేషన్స్ ఇస్తూ సాగిన అద్భుతంగా ఉంది. పురాణాల గురించి దేవుని అవతారాల గురించి వర్ణిస్తూ సాగిన ఈ పాట థియేటర్లలో దద్దరిల్లిపోయేలా చేయడం గ్యారంటీ అనిపిస్తుంది.(ఇదీ చదవండి: సొరచేప వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రముఖ నటుడు)ఇకపోతే నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, ఎక్కడివక్కడే హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మూవీపై, తొలిరోజు కలెక్షన్స్‌పై అంచనాలు ఓ రేంజులో పెరిగిపోతున్నాయి.(ఇదీ చదవండి: 'భారతీయుడు 2' ట్రైలర్ రిలీజ్.. మీరు చూశారా?) -
Lok Sabha Election 2024: ఓట్ల ‘బ్యాండ్’ బాజా!
ఎన్నికల ప్రచారంలో ఎవరి గోల వారిదే! అభ్యర్థులు ఎడాపెడా హామీలతో ఓటర్లకు గాలం వేస్తుంటే, ఎన్నికల అధికారులేమో పోలింగ్ శాతం పెంచేందుకు ‘బ్యాండ్’ బాజా మోగిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు, ముఖ్యంగా యువ ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు హర్యానా ఎన్నికల అధికారులు వినూత్నంగా మ్యూజికల్ బ్యాండ్లను రంగంలోకి దించుతున్నారు. ఎన్నికల థీమ్ సాంగ్స్‌తో మాంచి సంగీత విభావరుల ద్వారా వారిలో చైతన్యం పెంచే పనిలో పడ్డారు. ఈ బ్యాండ్లు ఓటర్లను, ముఖ్యంగా యువత ఓటేసేలా జోష్ నింపడంతో పాటు ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో అవగాహన కూడా పెంచుతాయని హర్యానా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి అనురాగ్ అగర్వాల్ చెబుతున్నారు. పంచ్కులలో తొలి ఎలక్షన్ థీమ్ మ్యూజిక్ షో నిర్వహించనున్నట్లు తెలిపారు. తర్వాత యువ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రతి జిల్లాలో ఇలాంటి మ్యూజిక్ బ్యాండ్స్ అలరిస్తాయని పేర్కొన్నారు. హర్యానాలో మొత్తం 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. దాదాపు రెండు కోట్ల మంది ఓటర్లు ఈవీఎం బటన్ నొక్కనున్నారు. ఇక్కడ 18–19 ఏళ్ల ఓటర్లు 3.65 లక్షల మంది ఉండగా 20–29 వయస్సున్న ఓటర్ల సంఖ్య 39 లక్షలు. మ్యూజిక్ అంటే ఫిదా అయిపోయే యువతను లక్ష్యంగా చేసుకునే ఈసీ బ్యాండ్ మోగిస్తోంది. లోక్‌సభ ఎన్నికల కోసం భారత ఎన్నికల సంఘం ’చునావ్ కా పర్వ్ – దేశ్ కా గర్వ్‘ (ఓట్ల సంబరం – దేశానికి గర్వకారణం) నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని అగర్వాల్ చెప్పారు. ప్రజాస్వామ్యానికున్న పవర్‌ను, ఓటు ప్రాధాన్యాన్ని తెలుసుకోవడానికి యువత, ముఖ్యంగా తొలిసారి ఓటేసే యువతరం పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో హర్యానాలో 70 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి కనీసం 75 శాతాన్ని టార్గెట్‌గా పెట్టుకున్నారట! – సాక్షి, నేషనల్ డెస్క్ -
నా సామిరంగ సినిమా విజిల్ థీమ్ సాంగ్
-
క్రికెట్ వరల్డ్‌కప్‌పై సాంగ్స్.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ఏది బెస్ట్ అంటే?
వన్డే వరల్డ్‌కప్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో మొదలయ్యే భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇందులో టీమిండియా గెలుస్తుందా? మూడోసారి కప్ కొడుతుందా? అని కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. సరే దాని గురించి కాసేపు పక్కనబెట్టేసి ఈ వరల్డ్‌కప్.. వాటి థీమ్ సాంగ్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) గ్రౌండులో క్రికెట్ ఆడినా సరే మరీ సైలెంట్‌గా ఉంటే ఎంటర్ టైన్ మెంట్ ఉండదు కాబట్టి స్టేడియంలో పాటలు ప్లే చేస్తుంటారు. అలానే వన్డే ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు నిర్వహించినప్పుడు.. దీన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు థీమ్ సాంగ్స్ లాంటివి రెడీ చేస్తుంటారు. 1992 ప్రపంచకప్ నుంచి ఈ థీమ్ గీతాల కల్చర్ మొదలైందని చెప్పొచ్చు. ప్రస్తుత వరల్డ్‌కప్‌కి కూడా 'దిల్ జస్న్ భోలె' అని ఓ పాట రెడీ చేశారు. కాకపోతే దానికి అనుకున్నంత రీచ్ రాలేదని చెప్పొచ్చు. ఇప్పటివరకు దాదాపు 9 పాటలొస్తే.. వాటిలో 2011 ప్రపంచకప్ కోసం శంకర్ ఎహసన్ లాయ్ కంపోజ్ చేసిన పాడిన 'దేఖ్ గుమాంగే'.. ఇప్పటివరకు వచ్చిన వాటిలో ది బెస్ట్ అని చెప్పొచ్చు. ప్రపంచకప్ కోసం తయారు చేసిన మొత్తం పాటలు ఇవిగో. ఓసారి వినండి. ఏదో బెస్ట్ మీరే చెప్పండి. (ఇదీ చదవండి: వన్డే వరల్డ్‌కప్ ఫైనల్.. ఆ తెలుగు హీరోలందరూ గ్యారంటీగా!) 1992 ప్రపంచకప్ థీమ్ సాంగ్: హూ రూల్ ద వరల్డ్ 1996 ప్రపంచకప్ థీమ్ సాంగ్: చోక్రా 1999 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లైఫ్ ఈజ్ ఈ కార్నివాల్ 2003 ప్రపంచకప్ థీమ్ సాంగ్: వెల్కమ్ టూ అవర్ హోమ్ 2007 ప్రపంచకప్ థీమ్ సాంగ్: గేమ్ ఆఫ్ లవ్ అండ్ యూనిటీ 2011 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దేఖ్ గుమాంగే 2015 ప్రపంచకప్ థీమ్ సాంగ్: WDL బాబ్స్ బీట్ 2019 ప్రపంచకప్ థీమ్ సాంగ్: లోరిన్ 2023 ప్రపంచకప్ థీమ్ సాంగ్: దిల్ జస్న్ భోలే -
ఫిఫా వరల్డ్ కప్‌లో బాలీవుడ్ బ్యూటీ.. ఆ విషయంలో తొలి నటిగా..!
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆమె ప్రాతినిధ్యం వహించనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఈవెంట్లో ప్రముఖులైన షకీరా, జెన్నీఫర్ లోపెజ్‌లతో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ వేదికపై ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించే ఏకైక నటిగా ఆమె నిలవనుంది. ఫిఫా వరల్డ్‌కప్ కోసం రూపొందించిన థీమ్ సాంగ్‌లో నోరా ఫతేహీ నటించింది. అక్టోబర్ 7న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. ఆమె ఫిఫా వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లోనూ ప్రదర్శన ఇవ్వనుంది. నోరా తన ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేస్తూ " ఈసారి ఫిఫా వరల్డ్ కప్ సాంగ్ "లైట్ ది స్కై" సేవ్ ది డేట్ 07/10/22..!" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఖతార్‌లో జరగనుంది. డ్యాన్స్‌తో గుర్తింపు పొందిన బాలీవుడ్ నటి దిల్బర్ దిల్బర్ సాంగ్‌తో ఫేమస్ అయింది. బాలీవుడ్లో భారత్, బాట్లా హౌస్, రోర్, సత్యమేవ జయతే చిత్రాల్లో కనిపించింది. ఆమె ప్రస్తుతం జడ్జిగా 'ఝలక్ దిఖ్ లా జా' ప్రోగ్రామ్‌కు వ్యవహరిస్తోంది. నోరాకు సోషల్ మీడియాలో విపరీతమైన అభిమానుల ఫాలోయింగ్ ఉంది. ఆమె ఇటీవల సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న థ్యాంక్ గాడ్ సినిమాలోని మాణికే సాంగ్‌లోనూ కనిపించింది. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) -
ఈ హీరో 'బిచ్చగాడి'లా ఎలా మారిపోయాడో చూడండి
Vijay Antony's Bichagadu-2 Theme Song: విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ రూపొందుతోంది. ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్న ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించడంతోపాటు సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు విజయ్ ఆంటోని. ఇందులో కావ్యా థాపర్ హీరోయిన్. ఈ చిత్రం థీమ్ సాంగ్‌ను బుధవారం విడుదల చేశారు. ‘చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు ’ అనే మాటలు థీమ్ సాంగ్‌లో వినిపిస్తాయి. చరిత్రను సంపన్నులు రాశారు. -
ఆకట్టుకుంటున్న 'కర్ణ' థీమ్ సాంగ్
టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ చిత్రానికి అన్నీ తానై పని చూసుకుంటున్నారు కళాధర్ కొక్కొండ. ఆయనే స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే చేయడం విశేషం. ఈ సినిమాకు ప్రశాంత్ బీజే సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు టీఎన్నార్ జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ‘భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు’అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఈ పాట సాగుతుంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. -
T20 World cup: 'లైవ్ ది గేమ్' అంటూ అదరగొట్టిన ఐసీసీ
ICC Releases Official Anthem Of T20 World Cup 2021.. అక్టోబర్‌లో మొదలవనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్ 2021కి సంబంధించి ఐసీసీ ప్రమోషన్లో భాగంగా అఫిషీయల్ థీమ్ సాంగ్ విడుదల చేసింది. 'లైవ్ ది గేమ్ గ్రూవ్ ఇన్‌టూ వరల్డ్ కప్' అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. వీడియో ఆరంభంలో జమైకా.. కరాచీ.. ఆక్లాండ్ అంటూ క్రికెట్ ఆడుతున్న అన్ని దేశాలను చూపిస్తూ పాట కొనసాగుతుంది. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వెస్టిండీస్ కెప్టెన్ పొలార్డ్, అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లు 3-డి రూపంలో ప్రత్యక్షమవుతారు. చదవండి: T20 World Cup: సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించు.. ఇదే మంచి ఛాన్స్! వారంతా మేం ఆడడానికి సిద్ధం అంటూ చెప్తుంటారు. ఇంతలో భూమిని చీల్చుకొని ప్రపంచకప్ బయటికి వస్తుంది. దానిని చూసిన ఆటగాళ్లు దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్‌లు గెలిచి నన్ను గెలవండి అంటూ కప్ ఎగిరిపోతుంది. అలా థీమ్ సాంగ్ ముగుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ట్విటర్లో రిలీజ్ చేసింది. లెట్ ద వరల్డ్ నో.. దిస్ ఈజ్ యువర్ షో అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. 🎵 Let the world know, This is your show 🎵 Come #LiveTheGame and groove to the #T20WorldCup anthem 💃🕺 pic.twitter.com/KKQTkxd3qw — ICC (@ICC) September 23, 2021 -
థీమ్ ఆకట్టుకుంది
విష్ణు మంచు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘మోసగాళ్లు’. ఈ సినిమాకు జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు సోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. శ్యామ్ íసీఎస్ సంగీతం అందించారు. ‘మోసగాళ్లు’ టైటిల్ కీ థీమ్ మ్యూజిక్ ఇటీవల ‘ద రైజ్ ఆఫ్ మోసగాళ్లు’ పేరిట విడుదలైంది. ‘‘ఆసక్తికరంగా ఉన్న ఈ థీమ్ మ్యూజిక్ బాగా పాపులర్ అయింది. కుర్చీల్లో కదలకుండా కూర్చుని చూసే థ్రిల్లర్‌గా మా చిత్రం ఉంటుందనే అభిప్రాయాన్ని థీమ్ మ్యూజిక్ కలిగించింది. సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. ఇక కథ విషయానికొస్తే భారత్‌లో మొదలై, అమెరికాను వణికించిన చరిత్రలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. -
ఆర్సీబీ ఐపీఎల్ థీమ్.. రోమాలు నిక్కబొడిచేలా
-
ఆర్సీబీ ఐపీఎల్ థీమ్.. రోమాలు నిక్కబొడిచేలా
దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్‌కు సంబంధించి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ థీమ్‌సాంగ్‌ను విడుదల చేసింది. ఆర్సీబీ.. ఆర్సీబీ.. అంటూ మొదలయ్యే పాట.. రోమాలు నిక్కబొడుచుకునేలా సాగింది. జట్టు కెప్టెన్‌గా కోహ్లితో మొదలయ్యే పాట .. డివిలియర్స్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, చహల్‌తో పాటు ఇతర ఆటగాళ్లు పాట పాడుతూ జట్టును ఎంకరేజ్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో నిలిచింది. ఇప్పటికే ఆర్సీబీ ఐపీఎల్ థీమ్ సాంగ్‌ను 5లక్షలకు పైగా వీక్షించారు. ఐపీఎల్ 2020 టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్11 వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.(చదవండి : 'ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరేట్ కాదు') ఐపీఎల్ ప్రారంభమైన మొదటి సీజన్ నుంచి ఫేవరేట్‌గా బరిలోకి దిగుతూనే ఒక్కసారి కూడా టైటిల్ గెలవలే కపోయింది. ప్రతీసారి ఈ జట్టు అన్ని విభాగాల్లోని బలంగా కనిపిస్తున్నప్పటికీ అసలు సిసలు ఆటకు వచ్చేసరికి బలహీనపడుతోంది. పేపర్ పులులు అనే సామెత ఆర్సీబీకి అచ్చంగా సరిపోతుందేమే. 2009, 2016 లో ఫైనల్‌కు చేరడం మినహాయించి ఏ సీజన్లోనూ ఆకట్టుకోలేదు. 2019 సీజన్లోనూ ఆర్సీబీ చివరి ప్లేస్‌కు పరిమితమైంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌లకు ఈసారి వేలం ద్వారా ఆరోన్ పించ్, ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్‌లు కొత్తగా కలవడంతో జట్టు మరింత బలంగా తయారైంది. అంతేగాక బిగ్‌బాష్ లీగ్ లీగ్‌లో రాణించిన జోష్ ఫిలిప్పిని ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ కోసం ఆర్సీబీ కొనుగోలు చేయడం ప్రధాన ఆకర్షణగా మారింది. అయితే బ్యాటింగ్ పరంగా చూస్తే బలంగా కనిపిస్తున్న ఆర్సీబీ బౌలింగ్‌లో మాత్రం బలహీనంగా ఉంది. చహల్ డేల్ స్టయిన్, ఉమేశ్ యాదవ్ మినహా చెప్పుకోదగ్గ బౌలర్లు మాత్రం లేరు. దీంతో ఈసారి లీగ్‌లో ఎలాంటి ప్రదర్శన ఇవ్వనుందనేది ఆసక్తికరంగా మారింది. కాగా సెప్టెంబర్ 21న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆర్సీబీ తమ మొదటి మ్యాచ్ ఆడనుంది. -
నిర్ణయాత్మక మోదీనా? గందరగోళ విపక్షాలా?
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు దీటుగా భారతీయ జనతా పార్టీ సైతం ఆదివారం తన ప్రచార ఇతివృత్తాలను ప్రకటించింది. నిర్ణయాత్మక మోదీ, చిందరవందరగా ఉన్న విపక్షాల మధ్యే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ అని పేర్కొంది. కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్, బీజేపీ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్‌తో కలసి ఆర్థిక మంత్రి జైట్లీ పార్టీ నినాదాలు, ప్రచార వీడియోలను విడుదల చేశారు. ఒక కెప్టెన్ లేదా 11 మంది ఆటగాళ్లు, 40 మంది కెప్టెన్ల ప్రభుత్వాల్లో ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని జైట్లీ అన్నారు. తమ ప్రచార ట్యాగ్‌లైన్ అయిన ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ మోదీ ఐదేళ్ల పాలనాకాలంలో సాధించిన విజయాలు, తీసుకున్న కీలక నిర్ణయాల చుట్టే తిరుగుతుందని చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా ప్రచారం చేస్తామని తెలిపారు. మధ్యతరగతిపై పన్ను భారం పెంచేలా కాంగ్రెస్ మేనిఫెస్టో ఉందని ఆ పార్టీ సలహాదారులే అభిప్రాయపడ్డారని, కానీ గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా పన్నులు తగ్గించిందని అన్నారు. ఈసారి కూడా మెజారిటీ ప్రభుత్వం రావాలని, 2014లో వచ్చిన మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వం అవినీతి, నల్లధన నియంత్రణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుందని గుర్తుచేశారు. పన్ను పరిధిని పెంచుతూనే మోదీ ప్రభుత్వ ద్రవ్యోల్బణాన్ని తగ్గించిందని, సంక్షేమానికి వ్యయం పెంచి సామాన్యుల పన్ను భారాన్ని తగ్గించిందని తెలిపారు. -
కాంగ్రెస్ ప్రచార నినాదం ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సరికొత్త ప్రచార నినాదాన్ని వినిపిస్తోంది. దేశంలో ప్రస్తుతం అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని స్పష్టం చేస్తూ ‘ఇక న్యాయం జరుగుతుంది’ అనే నినాదాన్ని ఆ పార్టీ ఆదివారం ప్రారంభించింది. ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న కనీస ఆదాయ హామీ పధకం న్యాయ్‌ను ప్రతిబింబించేలా ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించింది. ఈ థీమ్ సాంగ్‌ను ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ రచించగా, ప్రచార వీడియోను నిఖిల్ అద్వానీ తెరకెక్కించారని సీనియర్ కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ వెల్లడించారు. వీడియో స్క్రీన్లు అమర్చిన వాహనాల ద్వారా దేశవ్యాప్తంగా పార్టీ నినాదాన్ని, విధానాన్ని ప్రజల ముందుకు తీసుకువెళతామని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల వారికి సంపూర్ణ న్యాయం చేసేలా తమ ఎన్నికల ప్రణాళిక ఉందని, ఇదే అంశాన్ని థీమ్ సాంగ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తామని చెప్పారు. -
స్త్రీలోక సంచారం
2014 మే 5 – 2016 సెప్టెంబర్ 23 మధ్య కాలంలో తనపై అనేకసార్లు అత్యాచారం జరిపినట్లు కేరళ నన్ ఒకరు జలంధర్‌లోని క్యాథలిక్ చర్చి బిషప్ జేమ్స్ ఫ్రాంకో ములక్కల్‌పై చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని విచారణలో నిర్ధారణ అయినప్పటికీ, ఇంతవరకు ఆయనను అరెస్టు చెయ్యకపోవడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతుండగా.. కేరళలోని పూంజర్ నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే పి.సి.జార్జి ఒక ప్రెస్మీట్లో.. బాధితురాలైన ఆ నన్ను ‘వ్యభిచారి’ అని అంటూ.. ‘‘తనపై బిషప్ 13 పర్యాయాలు అత్యాచారం చేశాడని చెబుతున్న ఆ మనిషి.. పన్నెండుసార్లలో ఒక్కసారైనా ఫిర్యాదు చేయకుండా, పదమూడోసారి మాత్రమే పెదవి విప్పడాన్ని బట్టి చూస్తే ఆమె గుణం లేని మనిషి అని స్పష్టం అవుతోందని’’ అనడంపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఈ నెల 20లోగా కమిషన్ ముందు హాజరుకావాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపైన కూడా స్పందించిన పి.సి.జార్జి, ‘ఎన్నికైన ప్రజా ప్రతినిధినైన నాకు ఎవరి ఎదుటా హాజరు కావలసిన అవసరం లేదు’ అని అనడం మరో వివాదం అయింది. ఢిల్లీలోని తన ఫ్రెండ్‌తో వాట్సాప్ వీడియోలో చాట్ చేస్తూ, ఆ తర్వాత ‘రష్యన్ రౌలత్’ ఆడుతూ, తన టర్న్ వచ్చినప్పుడు తుపాకీని కణతలకు గురిపెట్టుకుని కాల్చుకోవడంతో కుప్పకూలిపోయిన కరిష్మా యాదవ్ అనే గ్వాలియర్ యువతి, ఆ తర్వాత ఆసుపత్రిలో మరణించింది. రివాల్వర్‌లోని ఆరు చాంబర్స్‌లో ఐదింటిని ఖాళీగా ఉంచి, ఒక దాంట్లో బులెట్ పెట్టి, చాంబర్‌ని గిర్రున తిప్పి కణతల దగ్గర పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కే అతి ప్రమాదకరమైన ‘రష్యన్ రౌల™Œ ’ ఆటను ఆడుతుండగా, కర్మిషా తన వంతు రాగానే.. ‘‘దేఖ్తే హై కిస్మత్ మే క్యా లిఖా హై’’ (చూద్దాం ఏం రాసిపెట్టి ఉందో) అని తన ఫ్రెండ్‌తో అంటూ ట్రిగ్గర్ నొక్కడంతో కణతల్లోకి బులెట్ దిగి మరణించిందని పోలీసులు వెల్లడించారు. 1975లో ఒక స్థల వివాదంలో తన ఆస్తిని మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్ జప్తు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, సివిల్ కోర్టులో రెండేళ్ల పాటు న్యాయపోరాటం చేసి, కేసు గెలిచిన గంగా దేవి అనే 27 ఏళ్ల మహిళ.. విచారణ సమయంలో కోర్టు ఫీజుగా చెల్లించిన 312 రూపాయల రసీదును కోర్టువారు పోగొట్టిన కారణంగా, రెండోసారి చెల్లించడానికి ఆమె నిరాకరించినందుకు వల్ల.. నిబంధనల ప్రకారం గెలుపు ఉత్తర్వుల జారీకి ఫీజు రసీదును జత చేసే పరిస్థితి లేకపోవడంతో.. తీర్పు అలా 41 ఏళ్ల పాటు గాలిలో ఉండి, చివరికి ఈ ఏడాది ఆగస్టు 31న మీర్జాపూర్ సివిల్ జడ్జి లవ్లీ జైస్వాల్ చొరవతో విముక్తి పొంది, గంగాదేవి ‘గెలుపు తీర్పు’ కాపీ బయటికి వచ్చింది! అయితే.. ఇన్నేళ్లలోనూ 11 మంది జడ్జీ్జల చేతులు మారిన ఈ ‘తీర్పు’ ప్రతిని అందుకోడానికి లేకుండా, 2005లోనే గంగాదేవి మరణించిన విషయం ఆలస్యంగా కోర్టు దృష్టికి వచ్చింది. కొత్తగా వచ్చే పేరు ప్రఖ్యాతుల వల్ల కళాకారులు మారిపోరని, వారి చుట్టూ ఉన్న ప్రపంచమే వారిని చూసే విధానాన్ని మార్చుకుంటుందని 32 ఏళ్ల అమెరికన్ పాప్ సింగర్ లేడీ గాగా అన్నారు. అక్టోబర్ 5న విడుదల అవుతున్న హాలీవుడ్ మ్యూజికల్ రొమాంటిక్ మూవీ.. ‘ఎ స్టార్ ఈజ్ బోర్న్’తో నటిగా పరిచయం అవుతున్న లేడీ గాగా.. చిత్రం ప్రివ్యూ సందర్భంగా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ.. పేరుప్రతిష్టల వంటి అసహజమైన విషయాలకు దూరంగా ఉండే క్రమంలో.. నిత్య జీవితంలో కళాకారులు చేసే పోరాటాన్ని సహృదయంతో అర్థం చేసుకుని ‘వారు కూడా మనలా సాధారణమైన వ్యక్తులే’ అన్న విధంగా ఈ ప్రపంచం తనను అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేయడం విశేష ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ మూవీ మొఘల్.. హార్వీ వైన్‌స్టీన్ లైంగిక వేధింపులను సుప్రసిద్ధులైన కొందరు సీనియర్ నటీమణులు ధైర్యంగా బయటపెట్టడంతో ఏడాది క్రితం ఊపిరి పోసుకున్న ‘మీ టూ’ ఉద్యమం తాజాగా మరో ప్రముఖుడి లైంగిక అకృత్యాలను బట్టబయలు చేసింది. అమెరికన్ టెలివిజన్ దిగ్గజం ‘సి.బి.ఎస్. కార్పొరేషన్’ చైర్మన్ లెస్లీ మూన్వెస్ మొత్తం 12 మందితో మహిళలతో అనుచితంగా ప్రవర్తించాడని.. ముఖరతికి బలవంత పెట్టడం, దేహంలో గోప్యమైన ప్రదేశాలను తాకడం, నిరాకరించినవారిపై కక్ష కట్టి ప్రతీకారం తీర్చుకోవడం వంటì ఆరోపణలు ఆయనపై ఉన్నాయని ‘న్యూయార్క్‌ర్’ మ్యాగజీన్ ఆదివారం నాడు ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన వెంటనే లెస్లీ మూన్వెస్ను చైర్మన్ పదవి నుంచి సి.బి.ఎస్. తొలగించింది. ఈజిప్టు నుంచి వలస వచ్చిన ఒక హోటల్ ఉద్యోగి.. మక్కాలోని గుర్తు తెలియని ఒక హోటల్లో తన సహోద్యోగి అయిన సౌదీ మహిళతో ఒకే టేబుల్‌పై కలిసి కూర్చొని ఉదయం అల్పాహారం తీసుకుంటున్న దృశ్యాన్ని.. వైరల్ అవుతున్న ఒక వీడియోలో చూసిన సౌదీ అరేబియా అధికారులు అతడు ఎక్కడున్నదీ కనిపెట్టి అరెస్టు చేశారు. వీడియోలో ఒక చోట ఆ మహిళ అతడికి తినిపించడం, కెమెరా వైపు చూస్తూ చేయి ఊపడం వంటి వాటిని కూడా తీవ్రంగా పరిగణించిన సౌదీ అధికారులు.. వారిపై తామేమి చర్యలు తీసుకుంటున్నదీ మీడియాకు బహిర్గతం చేయలేదు. మిస్ అమెరికా’ నిర్వాహకులు.. స్విమ్ సూట్ రౌండ్‌ను రద్దు చేశాక తొలిసారి జరిగిన అందాల పోటీలలో.. ‘మిస్ అమెరికా 2019 టైటిల్’ను మిస్ న్యూయార్క్ నియా ఫ్రాంక్లిన్ గెలుచుకున్నారు. నిరుటి అందాల రాణి క్యారా మండ్ తన శిరస్సుకు కిరీటాన్ని తొడుగుతున్నప్పుడు ఉద్వేగానికి లోనైన నియా ఫ్రాంక్లిన్.. ‘స్విమ్‌సూట్ రౌండ్లో పాల్గొనకుండా తొలిసారి టైటిల్ గెలుచుకున్న సంతోషం తనను నిలవనివ్వడం లేదనీ, ఆ రౌండ్ లేకపోవడం వల్ల తను మరికాస్త ఎక్కువగా ఆహారాన్ని తీసుకునేందుకు వీలుకలిగిందని’ గలగలా నవ్వుతూ చెప్పారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాది కూడా దుర్గామాత ఉత్సవాల కోసం ఒక థీమ్ సాంగ్ రాశారు. మంత్రివర్గ సహచరుడైన అరూప్ బిస్వాస్ అభ్యర్థన మేరకు, ఆయన నేతృత్వంలో యేటా ఉత్సవాలను నిర్వహిస్తుండే ‘సురుచి సంఘ్’ కోసం ‘జ దేవి సర్వభూతేశు’ అంటూ మమత రాసిన ఈ పాటను ప్రముఖ గాయకుడు, రాష్ట్ర సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి అయిన ఇంద్రనీల్ సేన్ ఆలపించారు. -
ఆటకు ‘సై’ : రాజమౌళి
దర్శకధీరుడు రాజమౌళి మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్ 2లో ఓ జట్టును తీసుకున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి, కుమారుడు కార్తికేయలతో కలిసి నల్లగొండ ఈగల్స్ టీంను సొంతం చేసుకున్న జక్కన్న టీం ప్రొమోషన్‌ను కూడా సినిమాటిక్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా తమ టీంను ప్రమోట్ చేస్తూ ఓ థీమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్ 2 ఈ నెల 14 వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనుంది. 16 రోజుల పాటు జరగనున్న ఈ ఈవెంట్లో 8 టీంలు పాల్గొననున్నాయి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్లో నల్లగొండ ఈగల్స్‌తో పాటు హైదరాబాద్ బుల్స్, రంగారెడ్డి రైడర్స్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, గద్వాల్ గ్లాడియేటర్స్, పాలమూరు పాంతర్స్, మంచిర్యాల టైగర్స్ తలపడనున్నాయి. -
మలయాళంలో ఒక పెప్పి థీమ్ సాంగ్
-
‘క్రికెటే కాదు.. ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాం’
కొచ్చి, కేరళ : ‘ఇండియా అంటే క్రికెట్.. క్రికెట్ అంటే ఇండియా’. ఇన్నాళ్లు ఇవే పరిస్థితులు కనిపించేవి మన దేశంలో. కానీ ఇప్పుడిప్పుడే ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచమంతా మారుమోగుతున్న పేరు ‘సాకర్’.. ఫుట్‌బాల్ ప్రపంచ కప్. ఈ విశ్వ క్రీడకు ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఆదరణ పెరుగుతుంది. ఇందుకు నిదర్శనంగా కేరళ కొచ్చికి చెందిన ఒక ఆరుగురు యువకులు ఫుట్‌బాల్ పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకునేందుకు మలయాళంలో ఒక పెప్పి థీమ్ సాంగ్‌ను కంపోస్ చేశారు. ఇంటర్నెట్లో విడుదల చేసిన ఈ పాట ఇప్పుడు ఫుట్‌బాల్ అభిమానులను ఊపేస్తుంది. ఈ విషయం గురించి సరత్ మోహన్(పాటకు సంగీత దర్శకుడు)... ‘ఫుట్‌బాల్ అంటే మాకు చాలా ఇఫ్టం. ఫుట్‌బాల్ పట్ల మాకున్న ప్రేమను చాటుకోవడనికి నేను నా స్నేహితులు కలిసి ఈ పాటను రూపొందించాం. ఈ పాటను కేరళ ఫుట్‌బాల్ అభిమానులకు అంకితం ఇస్తున్నాం’ అని తెలిపారు. అంతేకాక తాము అర్జెంటినా అభిమానులమని, ఈ ఏడాది ఆ టీమే కప్పు కొడుతుందని భావిస్తున్నామన్నారు. సరత్ మోహన్, దేవకృష్ణ, సుజాత పాడిన ఈ పాటను ‘షీ మీడియాస్’ బ్యానర్లో విడుదల చేశారు. కేరళను ఊపేస్తున్న వీడియో ఇదే.. -
ఐపీఎల్ థీమ్ సాంగ్ రెడీ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్ కోసం థీమ్ సాంగ్ సిద్ధమైంది. బాలీవుడ్ సంగీత దర్శక ద్వయం సలీమ్– సులేమాన్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ బెన్నీ దయాళ్ పాడారు. లీగ్ పదేళ్ల ప్రస్థానాన్ని సూచిస్తూ.. ‘దస్ సాల్ ఆప్కే నామ్’... పల్లవితో ఈ పాటను రూపొందించారు. -
సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ
‘తిరంగా యాత్ర’ థీంసాంగ్ను ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు సాక్షి, న్యూఢిల్లీ: డెబ్బై ఏళ్ల భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘సత్తర్ సాల్ ఆజాదీ.. యాద్ కరో కుర్బానీ’ పేరుతో రూపొందించిన ‘తిరంగా యాత్ర’ థీం సాంగ్‌ను కేంద్ర సమాచార శాఖ మంత్రి వెంకయ్య శుక్రవారం ఢిల్లీలో విడుదల చేశారు. గజల్ శ్రీనివాస్ రచించిన ఈ పాటను నాలుగు భాషల్లో రూపొందించినట్లు ఆయన తెలిపారు. -
గండికోట ఇదేరా..
ప్రముఖ సినీ డెరైక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో బుధవారం గండికోటపై థీం సాంగ్ చిత్రీకరించారు. గండికోట అందాలను దేశ నలుమూలలా చాటడానికి రాష్ట్ర పర్యాటక శాఖ తొలి యత్నంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జమ్మలమడుగు పట్టణంలోని ఈడిగ పేటకు చెందిన 30 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో హీరో రోహిత్, హీరోహిన్ శ ృతియుగల్తో ‘ఇదేరా.. గండికోట ఇదేరా..’ అంటూ పాటను చిత్రీకరించారు. గండికోట చుట్టుపక్కల రెండు కిలోమీటర్ల మేర డ్రోన్లకు అమర్చిన కెమెరాలలో ప్రకృతి అందాలను బంధించారు. ఈ సందర్భంగా నీలకంఠ మాట్లాడుతూ గండికోటలోని జుమ్మామసీద్, మాదవరాయస్వామి ఆలయం, పెన్నా నది లోయ, తదితర ప్రాంతాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో ద ృష్టి సారిస్తే ఈ ప్రాంతం ప్రపంచ పర్యాటక కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. - జమ్మలమడుగు రూరల్ -
పాట రాసేందుకు నిరాకరించిన సిరివెన్నెల
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న విశాఖ ఉత్సవానికి థీమ్ సాంగ్ రాసేందుకు ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి నిరాకరించినట్లు సమాచారం. ఈ ఉత్సవం కోసం థీమ్ సాంగ్ రాయాలని నిర్వాహాకులు సిరివెన్నెలను సంప్రదించగా అందుకు ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఈ ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో థీమ్ సాంగ్ కోసం నిర్వహాకులు థీమ్ సాంగ్ రాయించేందుకు స్థానికంగా ఉన్న గీత రచయితలను సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే విశాఖ ఉత్సవం ప్రతి ఏటా నిర్వహిస్తామని భీమిలి ఎమ్మెల్యే, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గతంలో వెల్లడించారు. అందుకోసం ప్రముఖ గీత రచయితతో థీమ్ సాంగ్ రాయిస్తామని ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. విశాఖ ఉత్సవం జనవరి 23 నుంచి 25 వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. -
ఫిఫా వరల్డ్ కప్ థీమ్ సాంగ్
-
సత్య 2 థీమ్ సాంగ్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా 'ద గాడ్‌ఫాదర్' థీమ్ సాంగ్ స్ఫూర్తితో తన రాబోయే చిత్రం 'సత్య2'కు రూపొందించిన పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ పాట వీడియోను రాంగోపాల్ వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పబ్లిష్ చేసింది. ''సర్కార్ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక మాట చెబుతూ వచ్చాను. ప్రపంచంలో ఉన్న చాలామంది దర్శకుల్లాగే నేను కూడా 'ద గాడ్ ఫాదర్' సినిమాతో స్ఫూర్తి పొందాను. నా సత్య2 సినిమా దానికి ఒక నివాళి. 'ద గాడ్ ఫాదర్' థీమ్ మ్యూజిక్ నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన పాట. దాన్ని మరో సందర్భంలో రీడిజైన్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు 'సత్య 2' ప్రమోషనల్ వీడియోలో వాడుతున్నాను'' అని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ పాటను రాజా నల్లా ఎడిట్ చేయగా ఆదిత్య ప్రణవ్ దేవ్ సంగీతం అందించారు. సత్య2 ఆడియో ట్రాక్‌ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేశారు కూడా. 1998లో విడుదలైన సత్య సినిమా ముంబై మాఫియా ఆధారంగా తీసిన విషయం తెలిసిందే. The Godfather theme has been my faviourate music.The Godfather music video from Satya 2 at http://t.co/cpVAwnF8Wk — Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2013