
సత్య 2 థీమ్ సాంగ్ విడుదల చేసిన రాంగోపాల్ వర్మ
సూపర్హిట్ హాలీవుడ్ సినిమా 'ద గాడ్ఫాదర్' థీమ్ సాంగ్ స్ఫూర్తితో తన రాబోయే చిత్రం 'సత్య2'కు రూపొందించిన పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు.
సూపర్హిట్ హాలీవుడ్ సినిమా 'ద గాడ్ఫాదర్' థీమ్ సాంగ్ స్ఫూర్తితో తన రాబోయే చిత్రం 'సత్య2'కు రూపొందించిన పాటను దర్శకుడు రాంగోపాల్ వర్మ విడుదల చేశారు. యూట్యూబ్లో ఈ పాట వీడియోను రాంగోపాల్ వర్మ ఫిల్మ్ ఫ్యాక్టరీ పబ్లిష్ చేసింది. ''సర్కార్ షూటింగ్ మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక మాట చెబుతూ వచ్చాను.
ప్రపంచంలో ఉన్న చాలామంది దర్శకుల్లాగే నేను కూడా 'ద గాడ్ ఫాదర్' సినిమాతో స్ఫూర్తి పొందాను. నా సత్య2 సినిమా దానికి ఒక నివాళి. 'ద గాడ్ ఫాదర్' థీమ్ మ్యూజిక్ నాకు ఎప్పటికీ చాలా ఇష్టమైన పాట. దాన్ని మరో సందర్భంలో రీడిజైన్ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు 'సత్య 2' ప్రమోషనల్ వీడియోలో వాడుతున్నాను'' అని రాంగోపాల్ వర్మ చెప్పారు. ఈ పాటను రాజా నల్లా ఎడిట్ చేయగా ఆదిత్య ప్రణవ్ దేవ్ సంగీతం అందించారు. సత్య2 ఆడియో ట్రాక్ను రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేశారు కూడా. 1998లో విడుదలైన సత్య సినిమా ముంబై మాఫియా ఆధారంగా తీసిన విషయం తెలిసిందే.
The Godfather theme has been my faviourate music.The Godfather music video from Satya 2 at http://t.co/cpVAwnF8Wk
— Ram Gopal Varma (@RGVzoomin) October 15, 2013