ఆకట్టుకుంటున్న 'కర్ణ' థీమ్ సాంగ్ | Karna Movie Theme Song Out | Sakshi
Sakshi News home page

ఆకట్టుకుంటున్న 'కర్ణ' థీమ్ సాంగ్

Published Tue, Jan 11 2022 4:45 PM | Last Updated on Tue, Jan 11 2022 4:45 PM

Karna Movie Theme Song Out - Sakshi

టాలీవుడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు యాక్షన్ ఓరియెంటెడ్ సినిమా 'కర్ణ' సిద్ధమవుతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై కళాధర్ కొక్కొండ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. అంతేకాదు ఈ చిత్రానికి అన్నీ తానై పని చూసుకుంటున్నారు కళాధర్ కొక్కొండ. ఆయనే స్వయంగా చిత్రంలోని ప్రధాన పాత్ర పోషిస్తూ నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టారు. కథ, స్క్రీన్ ప్లే కూడా కళాధర్ కొక్కొండనే చేయడం విశేషం. ఈ సినిమాకు ప్రశాంత్ బీజే సంగీతం అందిస్తున్నారు.


ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్, ఇతర పనులు శరవేగంగా చేస్తూనే ప్రమోషన్స్ చేపట్టారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రంలోని 'కర్ణ' థీమ్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి రేకెత్తించారు. దివంగత నటుడు, సినీ విశ్లేషకులు టీఎన్నార్‌ జయంతి సందర్భంగా ఆయన పిల్లలు దివిజ, రుత్విక్ ఈ సాంగ్ లాంచ్ చేశారు. ఈ పాటకు అనిల్ ఎనమడుగు లిరిక్స్ రాయగా ప్రసాద్ ఆలపించారు. ‘భగ భగ మండే నిప్పుల కొలిమే నడిచే చూడు.. మరిగే రక్తం ఉరకలు వేసే విప్లవం వీడు’అంటూ హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా ఈ పాట సాగుతుంది. జనవరి 28న ఈ కర్ణ మూవీ రిలీజ్‌ కానున్నట్లు చిత్ర యూనిట్‌ పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement