T20 World cup: 'లైవ్‌ ది గేమ్‌' అంటూ అదరగొట్టిన ఐసీసీ | ICC Releases Official Anthem Of T20 World Cup 2021 | Sakshi
Sakshi News home page

T20 World cup: 'లైవ్‌ ది గేమ్‌' అంటూ అదరగొట్టిన ఐసీసీ

Published Thu, Sep 23 2021 6:01 PM | Last Updated on Thu, Sep 23 2021 6:53 PM

ICC Releases Official Anthem Of T20 World Cup 2021 - Sakshi

ICC Releases Official Anthem Of T20 World Cup 2021.. అక్టోబర్‌లో మొదలవనున్న ఐసీసీ టి20 ప్రపంచకప్‌ 2021కి సంబంధించి ఐసీసీ ప్రమోషన్‌లో భాగంగా అఫిషీయల్‌ థీమ్‌ సాంగ్‌ విడుదల చేసింది. 'లైవ్‌ ది గేమ్‌ గ్రూవ్‌ ఇన్‌టూ వరల్డ్‌ కప్‌' అంటూ సాగే పాట ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తుంది. వీడియో ఆరంభంలో జమైకా.. కరాచీ.. ఆక్లాండ్‌ అంటూ క్రికెట్‌ ఆడుతున్న అన్ని దేశాలను చూపిస్తూ పాట కొనసాగుతుంది. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వెస్టిండీస్‌ కెప్టెన్‌ పొలార్డ్‌, అఫ్గానిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌.. ఆసీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌లు 3-డి రూపంలో ప్రత్యక్షమవుతారు.

చదవండి: T20 World Cup: సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించు.. ఇదే మంచి ఛాన్స్‌!

వారంతా మేం ఆడడానికి సిద్ధం అంటూ చెప్తుంటారు. ఇంతలో భూమిని చీల్చుకొని ప్రపంచకప్‌ బయటికి వస్తుంది. దానిని చూసిన ఆటగాళ్లు దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. మ్యాచ్‌లు గెలిచి నన్ను గెలవండి అంటూ కప్‌ ఎగిరిపోతుంది. అలా థీమ్‌ సాంగ్‌ ముగుస్తుంది. దీనికి సంబంధించిన వీడియోనూ ఐసీసీ తన ట్విటర్‌లో రిలీజ్‌ చేసింది. లెట్‌ ద వరల్డ్‌ నో.. దిస్‌ ఈజ్‌ యువర్‌ షో అంటూ క్యాప్షన్‌ జత చేసింది. కాగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్‌ వేదికగా టి20 ప్రపంచకప్‌ జరగనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement