
Andre Russell Hits Biggest Six T20 WC 2021.. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ ఆండీ రసెల్ టి20 ప్రపంచకప్ 2021లో అత్యంత భారీ సిక్స్‌తో మెరిశాడు. అది కూడా మిచెల్ స్టార్క్ లాంటి టాప్‌క్లాస్ పేసర్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ సిక్స్ బాదాడు. రసెల్ కొట్టిన సిక్స్ మీటర్ రీడింగ్‌లో 111 మీటర్ల దూరంగా నమోదైంది. ఈ ప్రపంచకప్‌లో నమోదైన సిక్సర్లలో రసెల్ కొట్టిందే అతి పెద్దది కావడం విశేషం. ప్రస్తుతం రసెల్ కొట్టిన సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: T20 World Cup 2021: ఆసీస్ చేతిలో విండీస్ కచ్చితంగా గెలవాలి.. లేదంటే..!