
రాజమౌళి ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్. ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో మ్యాక్స్ మూవీలో నటిస్తున్నారు. 2022లో విక్రాంత్ రోనా తర్వాత సుదీప్ చేస్తోన్న మూవీ కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కిచ్చా ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ నటుడు సునీల్ విలన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా రిలీజైన టీజర్‌లో సుదీప్ డిఫరెంట్ లుట్‌లో కనిపించారు. టీజర్ చూస్తే ఫుల్ యాక్షన్ ఓరియంటెడ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. విలన్‌గా సునీల్ లుక్ సైతం ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారానే సునీల్ శాండల్‌వుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.
కాగా.. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో వస్తోన్న మ్యాక్స్ మూవీని కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లోనూ విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పాత్రలో కనిపించడంతో.. సుదీప్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
MAX Takes Charge! 💥👿
🔗https://t.co/GbhvhNzPAl#MAXManiaBegins with the explosive #MaxTeaser 🔥 #boloMAXii@Max_themovie @theVcreations @Kichchacreatiin @vijaykartikeyaa @AJANEESHB @shivakumarart @shekarchandra71 @ganeshbaabu21 @dhilipaction @ChethanDsouza @saregamasouth…— Kichcha Sudeepa (@KicchaSudeep) July 16, 2024