3 నిమిషాల సీన్‌కి 72 లక్షలు!
3 నిమిషాల సీన్‌కి 72 లక్షలు!
Published Mon, Oct 21 2013 1:11 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రాల్లో నాయికగా నటిస్తూ, డైనమిక్ లేడీ ఇమేజ్ తెచ్చుకున్న మాలాశ్రీ ప్రస్తుతం ‘బాయ్స్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. స్వీయదర్శకత్వంలో శంకర్ గౌడ నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల ఈత కొలనులో కొన్ని రిస్కీ సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలో క్లయిమాక్స్‌ను చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మూడు నిమిషాల పాటు సాగే ఈ సీన్‌కి అయ్యే ఖర్చు 72 లక్షలు. ఇది ఛేజింగ్ సీన్ కావడంతో ఎక్కువ సంఖ్యలో వాహనాలు వాడనున్నారట. అలాగే బాంబు పేలుళ్లు కూడా జరుగుతాయట. దాదాపు పదిహేను రోజుల పాటు ఈ సీన్ చిత్రీకరణ జరుగుతుందని, 72 లక్షలకు మించే అవకాశం ఉందని కూడా శంకర్‌గౌడ అంటున్నారు.
కన్నడ సినిమా చరిత్రలో అత్యంత సాహసోపేతమైన క్లయిమాక్స్ ఇదే అవుతుందని, అందుకే రాజీపడటంలేదని ఆయన తెలిపారు. ఫైట్ మాస్టర్ థ్రిల్లర్ మంజు ఆధ్వర్యంలో ఈ క్లయిమాక్స్ చిత్రీకరణ జరగనుంది.
Advertisement
Advertisement