
యశవంతపుర(కర్ణాటక): ప్రముఖ కన్నడ సినీ నిర్మాత, నటీమణి మాలాశ్రీ భర్త కోటి రాముకు కన్నీటి వీడ్కోలు పలికారు. కరోనాతో సోమవారం బెంగళూరులో కన్నుమూయడం తెలిసిందే. మంగళవారం ఆయన స్వస్థలమైన తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా కోడిగేహళ్లి జరిగాయి.
కన్నడ సినిమా రంగంలో మూడు దశాబ్దాల పాటు సినిమాలను నిర్మించి కోటి రాముగా పేరు గాంచారు. అక్కడి ఫాం హౌస్‌లో అంతిమ సంస్కారాలు జరిపించారు. సతీమణి మాలాశ్రీ, ఇద్దరు సంతానం, బంధువులు పాల్గొన్నారు. జేడీఎస్ నేత నిఖిల్‌తో పాటు పలువురు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment