
మృతదేహానికి అంతిమ సంస్కారం నిర్వహిస్తున్న సచివాలయ సిబ్బంది
సోమశిల: కరోనా బారిన పడి ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబసభ్యులు భయపడి అంతిమ సంస్కారాలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గ్రామ సచివాలయ అధికారులు ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం కామిరెడ్డిపాడుకు చెందిన పులివర్తి కొండమ్మ (57)కు కోడలు, ఇద్దరు మనువరాళ్లు ఉన్నారు.
ఇటీవల కొండమ్మకు కరోనా సోకడంతో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. కుటుంబీకులు భయపడి మృతదేహానికి ఖననం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో గ్రామ సర్పంచ్ బుట్టి భారతమ్మ సహకారంతో పంచాయతీ కార్యదర్శి రమణరావు, వీఆర్‌వో ఉదయ్‌భాస్కర్, ఏఎన్‌ఎం సుశీల, ఆశా వర్కర్లు పీపీఈ కిట్లు ధరించి కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ మృతదేహాన్ని ఖననం చేశారు.