![Funeral conducts with PPE kits in villages - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/23/gggg.jpg.webp?itok=g-6le7Dv)
పీపీఈ కిట్లు ధరించి మృతదేహాన్ని మోసుకెళుతున్న కుటుంబీకులు
పెదబయలు: కోవిడ్‌పై గ్రామాల్లో అవగాహన పెరుగుతోంది. లేనిపోని భయాలు తగ్గి..తగు జాగ్రత్తలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి బాంధవ్యాలను, మానవత్వాన్ని మాయం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితులలో ఈ పరిణామం ఊరట కలిగిస్తోంది. విశాఖ జిల్లా పెదబయలుకు చెందిన గంప చినగుండన్న (68) కొంతకాలంగా దీర్ఘకాల వ్యాధితో బాధపడుతూ శనివారం మృతి చెందాడు.
ఈ ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉండటంతో మృతుడికి కూడా కోవిడ్ సోకే అవకాశం ఉందన్న భావనతో వైద్య సిబ్బంది దగ్గర పీపీఈ కిట్లు తీసుకొని నలుగురు కుటుంబీకులు అంత్యక్రియలు చేశారు. మృతుడికి కరోనా ఉందో లేదో తెలియదని..ఉంటే దహన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కోవిడ్ సోకే ప్రమాదం ఉందని అందుకే జాగ్రత్తలు తీసుకుని నలుగురితోనే అంత్యక్రియలు ముగించామని కుటుంబీకులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment