ఎన్నికల అధికారి సాహసం | kanada movie ‘election’Remakeing in telugu verision | Sakshi
Sakshi News home page

ఎన్నికల అధికారి సాహసం

Published Sat, Mar 29 2014 12:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM

ఎన్నికల అధికారి సాహసం - Sakshi

ఎన్నికల అధికారి సాహసం

మాలాశ్రీ ఎన్నికల అధికారిగా ఓ శక్తిమంతమైన పాత్ర పోషించిన కన్నడ చిత్రం ‘ఎలక్షన్’. ఓం ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం అదే పేరుతో తెలుగులో విడుదల కానుంది. మాలాశ్రీ భర్త రాము ఈ అనువాద చిత్రానికి నిర్మాత.
 
 ‘‘ఎన్నికల సమయంలో జరిగే చీకటి నేరాలపై ఓ మహిళా ఎన్నికల అధికారి ఏ విధంగా ఉక్కుపాదం మోపింది అనేది ఈ చిత్రం కథ. తెలుగు ప్రేక్షకులకు నచ్చే వాణిజ్య అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఎన్నికలకు ముందే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి రచన: వెన్నెలకంటి, కెమెరా: రాజేశ్ కట్ట, సంగీతం హంసలేఖ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement