బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో కన్నడ నటి అరెస్ట్
బెంగుళూరు: బెంగుళూరు ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. కన్నడ హీరోయిన్ రాన్యారావును గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి బెంగుళూర్‌కు 14 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా డీఆర్ఐ అధికారులకు పట్టుబడ్డారు. రాన్యారావును అధికారులు ప్రశ్నిస్తున్నారు. కాగా, అధికారులకు తాను డీజీపీ కూతురినంటూ రన్యారావు చెప్పినట్లు సమాచారం.తరచుగా దుబాయ్ వెళ్లే రన్యారావు.. ఈసారి కూడా వెళ్లి మార్చి 3వ తేదీ రాత్రి తిరిగి దుబాయ్ నుంచి వచ్చింది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్‌లో అనుమానంతో ఆమెను అధికారులు చెక్ చేయగా, స్మగ్లింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆమె దుస్తులలో 14.8 కిలోల బంగారం బయటపడింది. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు రూ.12 కోట్లు ఉంటుందని అంచనా. కాగా, కన్నడలో సుదీప్తో మాణిక్య సినిమాలో రాన్యా నటించింది.