తన జీవితంలో మరపురాని, మధురమైన అనుభూతి ఇది అంటున్నారు నటుడు శివకార్తికేయన్. ఒక బుల్లితెర యాంకర్‌గా జీవితాన్ని ప్రారంభి, రాణించిన ఈయన అందులోనే ఆనందాన్ని వెతుక్కోకుండా, నటుడిగా అవతారమెత్తి చాలా వేగంగా టాప్ హీరోగా ఎదిగిపోయారు. ఈయన నటించిన తాజా చిత్రం సీమరాజా మిశ్రమ స్పందనను పొందినా, ప్రస్తుతం స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయనతార నాయకిగా నటిస్తోంది. కాగా శివకార్తికేయన్ నిర్మాతగా మారి కణా అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఐశ్వర్యరాజేశ్, సత్యరాజ్, దర్శన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్‌రాజా కామరాజ్ దర్శకుడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ మూవీకి దిబు నినన్ థామస్ సంగీతాన్ని అందిస్తున్నారు.
కణా చిత్ర ఆడియో ఇటీవల విడుదలై సంగీతప్రియుల నుంచి మంచి ఆదరణను పొందుతోంది. ముఖ్యంగా ఈ ఆల్బంలోని వాయాడి పెత్త పుళ్ల అనే పాటను యూట్యూబ్‌లో 50 మిలియన్ల మంది చూశారట. మరో విశేషం ఏమిటంటే ఈ పాటను శివకార్తికేయన్ తన ఐదేళ్ల కూతురు ఆరాధనతో కలిసి పాడడం. దీంతో పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతున్న శివకార్తికేయన్ తన ఆనందాన్ని పంచుకుంటూ కొన్ని సమయల్లో మనం ఊహించన సంఘటనలు జరిగి సంతోషంలో ముంచేస్తాయన్నారు.
అలాంటి సంతోషాన్నే సంగీత ప్రేమికులు తమ చిత్రంలోని వాయాడి పెత్త పుళ్ల పాటకు అందించారన్నారు. తండ్రి, కూతుళ్ల ప్రేమానుబంధాలను ఆవిష్కరించే పాటగా ఇంది ఉంటుందన్నారు. ఇది సంగీత దర్శకుడు దిబు నినన్ థామస్, గీత రచయిత జీకేపీల సమష్టి కృషికి దక్కిన విజయంగా పేర్కొన్నారు.
తన కూతురు ఆరాధనకు తనకు మధ్య ప్రేమానుబంధాన్ని కాలమంతా గుర్తుండిపోయి, మధురానుభూతిని కలిగించేలా చేసే ఈ పాటను అందించిన వారిద్దరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాన్నారు. ఆరాధన తీయని గొంతు ఈ పాట ఇంత మధురంగా రావడానికి కారణం అన్నారు. అన్నిటికీ మించి తనను, తన కూతురిని ఈ పాట పాడించాలన్న ఆలోచనను తీసుకొచ్చిన దర్శకుడు అరుణరాజు కామరాజ్‌కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు.
కణా చిత్ర నిర్మణాంతర కార్యక్రమాలను పూర్తి చేసి డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు శివకార్తికేయన్ తెలిపారు. ఇది తండ్రి కొడుకుల అనుబంధాన్ని, రైతుల జీవితాలను ఆవిష్కరించే కథా చిత్రంగా తెరకెక్కుతోంది. అథ్లెట్స్ క్రీడల్లో రాణించాలన్న కూతురు కలను నెరవేర్చడానికి తండ్రి ఏం చేశారన్నది ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment