
ఆరాధన కేసులో ఆధారాలు లేవు
68 రోజుల పాటు ఉపవాసం ఉండి తనువు చాలించిన ఆరాధన సముదారియా(13) కేసులో ఆధారాలు ఏమీ లేవంటూ పోలీసులు తేల్చారు.
- కేసును మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటన
- బాలల హక్కుల సంఘానికి నోటీస్
హైదరాబాద్: 68 రోజుల పాటు ఉపవాసం ఉండి తనువు చాలించిన ఆరాధన సముదారియా(13) కేసులో ఆధారాలు ఏమీ లేవంటూ పోలీసులు తేల్చారు. ఈ మేరకు బాల ల హక్కుల సంఘానికి మార్కెట్(సికింద్రాబాద్) పీఎస్ నుంచి కేసును మూసివేస్తున్నట్లు నోటీసు ద్వారా తెలిపారు.
గత ఏడాది జూన్ 2న 68 రోజులు ఉపవాసం ఉండి మృతి చెందిన ఆరాధన వ్యవహారంపై బాలల హక్కుల సంఘం స్పందించింది. సంఘం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుమారు పది నెలల పాటు విచారించిన పోలీసులు తమకేమీ ఆధారాలు లభించలేదన్నారు. ఉపవాసం ఉంచబట్టే మృతి చెందిందని ఆధారాలు ఉన్న ప్పటికీ ఏ ఆధారాలు లేవని పోలీసులు చెప్పడం హాస్యా స్పదంగా ఉందని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు తెలిపారు. పోలీసుల వైఖరిని తప్పుపడుతూ త్వరలో కోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు.
'ఆరాధనను ఎవరూ దీక్ష చేయమనలేదు'
'గుండె ఆగిపోవడం వల్లే ఆరాధన చనిపోయింది'
‘ఆరాధన’ ఘటనపై నివేదిక ఇవ్వండి