మూఢ నమ్మకాలను జైన మతం నమ్మదని జైన్ సేవా సంఘం చెప్పింది. ఆరాధనను దీక్ష చేయాలని ఎవరూ ఒత్తిడి చేయలేదని తెలిపింది. వ్యాపారంలో నష్ట వచ్చిందని సికింద్రాబాద్‌కు చెందిన లక్ష్మీచంద్ మనీష్ సమదరియా అనే బంగారు నగల వ్యాపారి ఓ మత గురువు చెప్పిన సలహా విని తన 13 ఏళ్ల కుమార్తె ఆరాధనతో 68రోజుల ఉపవాస దీక్ష చేయించారు. సికింద్రాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న బాలికను ఈ దీక్షలో కేవలం మంచినీళ్లను మాత్రమే తాగేలా చూశారు.