కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠంలో మంగళవారం వైభవంగా జై తీర్థుల ఆరాధన నిర్వహించారు.
మంత్రాలయం: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం శ్రీమఠంలో మంగళవారం వైభవంగా జై తీర్థుల ఆరాధన నిర్వహించారు. శ్రీరాఘవేంద్ర స్వామివారి మఠంలో ముడో పిఠాధిపతి జై తీర్థుల ఆరాధనను ఘనంగా జరిపారు. శ్రీ మఠం పిఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారజాము నుంచి మఠంలోని మూల బృందావనానికి ఫల, పూల, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.