Selecting Casting For Aradhana Movie- Sakshi
Sakshi News home page

Aradhana Movie: ప్రేమలో కొత్త కోణం.. 'ఆరాధన' చిత్రం

Published Fri, Dec 17 2021 8:08 AM | Last Updated on Fri, Dec 17 2021 9:38 AM

Selecting Casting For Aradhana Movie - Sakshi

Selecting Casting For Aradhana Movie: ‘మై ఫ్రెండ్‌ గాంధీ’ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించిన వశిష్ట పార్థసారధి దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఆరాధన’. ఈ చిత్రం ద్వారా పృథ్వీరాజ్‌ హీరోగా పరిచయం కానున్నారు. ఆర్‌వీజీ మూవీస్‌తో కలిసి దర్శకుడు రుద్రాభట్ల వేణుగోపాల్‌ (ఆర్‌వీజీ), ‘రెబెల్‌ నేషన్‌’ అధినేత రవికిరణ్‌ ఈ సినిమా నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ–‘‘ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించేలా మా సినిమా నిర్మిస్తాం. అధిక భాగం షూటింగ్‌ మధ్యప్రదేశ్‌లో ప్లాన్‌ చేశాం. నటుడు శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రస్తుతం హీరోయిన్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి హరి గౌర సంగీతం అందించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement