
ఆరాధన, శివ కార్తికేయన్
జనరల్‌గా తండ్రీ కూతుళ్లు కలిసి నటించడం చూస్తుంటాం. కానీ ఈసారి కాస్త డిఫరెంట్. తండ్రి శివకార్తీకేయన్‌తో కలిసి పాట పాడారు చిన్నారి ఆరాధన. ఐశ్వర్యా రాజేష్ ముఖ్య పాత్రలో తమిళంలో రూపొందిన సినిమా ‘కనా’. ‘డ్రీమ్ బిగ్’ అనేది క్యాప్షన్. నటుడు సత్యరాజ్ ఓ కీలక పాత్ర చేశారు. నటుడు శివ కార్తీకేయన్ స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్‌లో రూపొందిన తొలి చిత్రమిది. ఓ పల్లెటూరి అమ్మాయి గొప్ప క్రికెటర్ కావాలనుకున్న తన కలను ఎలా నేరవేర్చుకుంది? అన్నది ఈ చిత్రకథ.
‘‘సినిమాలో ఐశ్యర్యా రాజేష్ చిన్నతనంలో తండ్రితో కలిసి పాడే పాట ఇది. ఎవరి చేత పాడిద్దాం అనుకుంటున్న టైమ్‌లో శివ కార్తీకేయన్, ఆయన కూతురు ఆరాధన గుర్తొచ్చారు. విషయం చెప్పాం. ఆనందంగా ఓకే అని ఈ పాటను ఆలపించారు. పాట పాడేప్పుడు ఆరాధన నెర్వస్‌గా ఫీలవ్వలేదు. ఈ సాంగ్‌లో సింగర్ విజయలక్ష్మి కూడా గొంతు కలిపారు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు దిబు థామస్. లిరిసిస్ట్ అరుణ్ రాజా కామరాజ్ ఈ సినిమాతో దర్శకునిగా మారారు.
Comments
Please login to add a commentAdd a comment