
ఈసారి సంక్రాంతికి థియేటర్లలో రిలీజై అనుహ్యంగా హిట్ అయింది వెంకటేశ్ మూవీ. పండగ పేరుతో 'సంక్రాంతికి వస్తున్నాం' అని ప్రేక్షకుల్ని పలకరించారు. అనుహ్యమైన విజయాన్ని అందుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఏకంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లతో సరికొత్త రికార్డు సృష్టించింది.
అయితే వెంకీమామ సినిమా ఓటీటీలోకి రావడానికి కంటే ముందే టీవీలో ప్రసారం చేస్తున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. మార్చి 1న సాయంత్రం టీవీలో ప్రసారం చేస్తున్నట్లు చెప్పడంతో మరి ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఆడియెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్ప్పుడు స్ట్రీమింగ్ పై ఓ రూమర్ వినిపిస్తోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఏంటంటే?)
మార్చి 1న టీవీలో ప్రసారమైన సమయానికే ఓటీటీలోనూ రిలీజ్ చేయాలని సదరు సంస్థ నిర్ణయం తీసుకుందట. దీనిబట్టి చూస్తే మార్చి 1నే సాయంత్రం జీ5 ఓటీటీలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'సంక్రాంతి వస్తున్నాం' స్ట్రీమింగ్ కానుందని సమాచారం. కొన్నిరోజుల క్రితం సుదీప్ 'మ్యాక్స్' మూవీ కూడా ఇలానే టీవీ- ఓటీటీలో ఒకేసారి తీసుకొచ్చారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.
'సంక్రాంతి వస్తున్నాం' కథ విషయానికొస్తే.. అమెరికాలో సెటిలైన సత్య అనే బడా వ్యాపారవేత్తని తెలంగాణ సీఎం కేశవ.. హైదరాబాద్ తీసుకొస్తాడు. కానీ అతడిని పాండే గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిస్తే ప్రభుత్వం పరువు పోతుందనే భయంతో సీక్రెట్ ఆపరేషన్ కి సిద్ధమవుతారు. దీనికోసం మాజీ పోలీస్ వైడీ రాజు (వెంకటేశ్)ని ఒప్పించే బాధ్యతని ఇతడి మాజీ ప్రేయసి మీనాక్షి (మీనాక్షి చౌదరి) తీసుకుంటుంది. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: నటికి ఏడు సార్లు అబార్షన్ కేసులో మరోసారి నటుడిపై విచారణ)
Comments
Please login to add a commentAdd a comment