సంక్రాంతి పండక్కి మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలని అనుకొని ‘సంక్రాంతికి వస్తున్నాం’ చేశాం. ఇలాంటి ఓ మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకుంటారని తెలుసు. మేం అనుకున్నదే జరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్, నా ఫ్యాన్స్ ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ఆడియన్స్ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయడం, వారిలో నవ్వులు చూడటం ఆనందంగా ఉంటుంది’ అన్నారు విక్టరీ వెంకటేశ్. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki Vasthunam). అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.
(చదవండి: ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ)
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో వెంకటేశ్(venkatesh) మాట్లాడుతూ.. ‘మా సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రియాక్షన్స్ అన్నీ జెన్యూన్ గా ఉన్నాయి. మేము మంచి ఫ్యామిలీ సినిమా ఇవ్వాలనే దిగాం. సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పాం, అదే రోజున వచ్చి ఇంత పెద్ద హిట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అనిల్ నా కెరీర్ లో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇది తన కెరీర్ లో కూడా బిగ్ బ్లాక్ బస్టర్. దిల్ రాజు, శిరీష్ కు ఇది మరో బిగ్ హిట్. ఐశ్వర్య, మీనాక్షి టీం అందరి విషయంలో చాలా ఆనందంగా ఉన్నాను. అందరికీ చాలా థాంక్స్' అన్నారు
డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) మాట్లాడుతూ.. బెసికలీ టెక్నికలీ కలర్ ఫుల్లీ హౌస్ ఫుల్లీ ఇట్స్ ఏ బ్లాక్ బస్టర్ పొంగల్(నవ్వుతూ). బెనిఫిట్ షోలకి ఫ్యాన్స్ యూత్ వెళ్తుంటారు. ఫస్ట్ టైం ఉదయం నాలుగున్నర షోలకి కూడా ఫ్యామిలీ ఆడియన్స్ రావడం ఈ సినిమా ద్వారా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మాకు. థియేటర్లో ప్యాక్డ్ గా ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. మాకు ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ఆడియన్స్ కి థాంక్స్. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తీసుకున్నాం. పండగ రోజులు ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇది వెంకీ సార్ పొంగల్. మా సినిమాని సపోర్ట్ చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా కాంబినేషన్ లో ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్. ఎఫ్ 2 ని వారంలో సింపుల్ గా దాటేసి అద్భుతాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్లాక్ బస్టర్ సంక్రాంతి చేసిన అనిల్ కి, వెంకటేష్ గారికి, హీరోయిన్స్ కి, ప్రేక్షులందరికీ థాంక్ యూ. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. ప్యాక్డ్ థియేటర్స్ లో చూసినప్పుడు ఆ ఫన్ వేరుగా ఉంటుంది. అందరికీ థాంక్ యూ' అన్నారు. ఈ సక్సెస్ మీట్‌లో హీరోయిన్లు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌తో పాటు నిర్మాత శిరీష్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment