ఆధ్యాత్మిక నిలయం.. వెంకయస్వామి ఆలయం
ఆధ్యాత్మిక నిలయం.. వెంకయస్వామి ఆలయం
Published Tue, Aug 23 2016 11:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM
నేడు తీర్ధం వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవం
డక్కిలి : మండలంలోని దగ్గవోలు గ్రామంలో ఉన్న తీర్ధం వెంకయ్యస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. గొలగమూడి, చేజర్లలోని ఆలయాల తర్వాత మహిమ గల దేవస్థానంగా ఇది పేరుగాంచింది.
ఇదీ కథ..
మారుమూల పల్లెయిన దగ్గవోలులో ఆలయ ఆవిర్భావం వెనుక ఓ యువకుడి అధ్యాత్మిక అలోచన ఉంది. దగ్గవోలు గ్రామానికి చెందిన తోట ఈశ్వరయ్య, వరలక్ష్మమ్మ కుమారుడు రమణయ్య 18 ఏళ్ల వయస్సులో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఓరోజు రమణయ్య గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన ఆరాధనోత్సవంలో పాల్గొని ఇంటికి వచ్చాడు. వెంకయ్యస్వామిని దర్శించుకున్న క్షణం నుంచి రమణయ్యలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడింది. క్రమంగా అతను గొర్కెలు కాసేందుకు వెళ్లడం ఆపేశాడు. కొద్దిరోజులకు తల్లిదండ్రులు ఆగ్రహించడంతో రమణయ్య గొర్కెల కాపరిగా వెళ్లాడు. ఒకరోజు గొర్రెలు మేపుతూ నిద్రలోకి జారుకున్న రమణయ్యకు కలలో ఓ మహర్షి రూపం కనిపించి దగ్గవోలు చెరువు సమీపంలోని బండరాయిలో రెండు అడుగల లోతులో నీరు పడతుంది. ఆప్రాంతంలో దేవస్థానం నిర్మించాలని మహర్షి చెప్పారు. వెంటనే రమణయ్య మరో ఇద్దరు కలిసి చెరువు వద్దనున్న బండరాయి పగులగొట్టి రెండు అడుగులలోతు తవ్వాగా నీరు ఎగచిమ్మింది.
97లో శంకుస్థాపన
కలలో మహర్షి చెప్పింది నిజం కావడంతో రమణయ్య తీర్ధం వెంకయ్యస్వామి దేవస్థానం ఏర్పాటుచేశాడు. మెదట పూరి గుడెసెలో వెంకయ్యస్వామి పటం పెట్టి పూజలు చేశాడు. 1997 సంవత్సరం ఆగస్టు 27 తేదీన ఆలయానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రమణయ్య వయస్సు 39 సంవత్సరాలు. ఆయనే ఆశ్రమ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకపోయినా తన మదురమైన గొంతుతో వెంకయ్యస్వామి పాటలను గ్రామాల్లో పాడుతూ అధ్యాత్మిక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆలయం వద్ద ఉన్న రెండు అడుగుల బావిలో నీరు ఎప్పటికీ ఎండదు.
నేడు 19వ ఆరాధన మహోత్సవం
తీర్ధం వెంకయ్యస్వామి 19వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం ప్రభాతసేవ, స్వామికి అష్టోత్తర శతనామవళి పూజలు, మధ్యాహ్నం అన్నదానం, నవరత్నాలు భజన, రాత్రి 9 గంటలకు పాండురంగ నాట్యమండలి నెల్లూరువారిచే శ్రీరామాంజనేయయుద్దం, 10 గంటలకు గయోపాఖ్యానం (యుద్దశీను), 11 గంటలకు సత్యహరిశ్చంద్రపూర్తి నాటకం, రాత్రి 12గంటలకు స్వామివారి పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆలయ అభివద్ధికి కషి: రమణానందస్వామి, ఆశ్రమ ధర్మకర్త
ఆలయ అభివద్ధికి చిన్న వయస్సు నుండే శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నా. ఊరూరు తిరిగి అనేకమంది సహకారం తీసుకున్నాం.
Advertisement
Advertisement