dakkili
-
క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి
సాక్షి, డక్కిలి (చిత్తూరు): పదహారేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు క్షుద్ర భయం కల్పించి మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినట్లు డక్కిలి ఎస్ఐ పి.నరసింహారావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఓ గ్రామానికి చెందిన శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) క్షుద్ర పూజలు చేస్తుంటారు. ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉన్నట్లు ఈ ఇద్దరు వ్యక్తులు బాలికను నమ్మించారు. తాము చెప్పినట్లు వినకపోతే తల్లిదండ్రులకు మరణం తప్పదని భయపెట్టారు. ఇలా మూడు నెలలుగా ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది. గత రెండు రోజులుగా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలికను ఒత్తిడి చేయగా శ్రీరాం సుబ్బయ్య, భాస్కర్ బాగోతం బయటపెట్టింది. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిపైనా పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (కూతురుపై తండ్రి అత్యాచారం.. సీక్రెట్‌గా వీడియో తీసి!) -
మత్తులో డ్రైవర్.. స్కూల్ బస్సు బోల్తా
సాక్షి, నెల్లూరు(డక్కిలి) : మండలంలో జరిగిన శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్ బస్సు ప్రమాదానికి డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు నిర్ధారించారు. శుక్రవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వెంకటగిరి శ్రీచైతన్య ఇంగ్లిష్ మీడియం స్కూల్‌కు చెందిన బస్సు ఉదయం 7.30 గంటలకు డక్కిలి మండలంలోని కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయిపాళెం గ్రామాలకు చెందిన విద్యార్థులను ఎక్కించుకుని డక్కిలి వైపు వస్తోంది. ఎనిమిది గంటల సమయంలో కుప్పాయిపాళెం దాటిన తర్వాత బస్సు అదుపుతప్పినట్లుగా విద్యార్థులు గుర్తించి కేకలు వేశారు. డ్రైవర్ నవకోటి మద్యం మత్తులో ఉండటం, నిద్రలోకి జారుకోవడంతో బస్సు చెరువు వద్ద గుంతలో బోల్తా పడింది. ఈ సంఘటనలో నర్రావుల వెంకటేష్ (6వ తరగతి), పోకూరు రోహిత్ (6వ తరగతి), వేముల నాని (6వ తరగతి), తంబిశెట్టి యామిని (5వ తరగతి), పెదనేని చంద్రిక (5వ తరగతి), కొక్కనేటి శ్రీనివాస్‌కుమార్ (9వ తరగతి), వేముల శరణ్య (4వ తరగతి), ఏలేశ్వరం మహేష్ (5వ తరగతి), పత్తిపాటి భానుప్రకాష్ (6వ తరగతి), ఎ.మోహన్ (9వ తరగతి), కుంచెం నిఖిలేస్ (3వ తరగతి), డ్రైవర్ నవకోటిలకు గాయలయ్యాయి. వీరిలో నిఖిలేష్, యామిని, మోహన్ తీవ్రంగా గాయపడ్డారు. సకాలంలో డక్కిలి పోలీసుల స్పందన స్కూల్ బస్సు బోల్తా పడిన విషయాన్ని తెలుసుకున్న డక్కిలి ఎస్సై కామినేని గోపి వెంటనే స్పందించి తన సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. భయాందోళనతో కేకలు వేస్తున్న విద్యార్థులను ఎస్సై, పోలీసు సిబ్బంది స్థానికులు సాయంతో బస్సులో నుంచి బయటకు తీశారు. పోలీసు వ్యాన్‌లో డక్కిలి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ విద్యార్థులకు డాక్టర్ సుధీర్‌కుమార్ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వెంకటగిరిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. గూడూరు ఆర్డీఓ బాపిరెడ్డి, డక్కిలి తహసీల్దార్ మునిలక్ష్మి లు విద్యార్థులను పరామర్శించారు. వైద్యసేవల గురించి ఆరాతీశారు. తహసీల్దార్ కుప్పాయిపాళెం, డీ వడ్డిపల్లి గ్రామాలకు వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఓదార్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా ప్రమాదం గురించి తెలుసుకుని ఘటనా స్థలానికి వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా తెలిపారు. ఈ విషయం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో వెల్లడైందన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. రాత్రంతా నిద్రపోలేదు స్కూల్ బస్సు డ్రైవర్ నవకోటి మద్యం సేవించి బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అతను గురువారం రాత్రి వేటకు వెళ్లి రాత్రంతా నిద్రపోలేదు. శుక్రవారం ఉదయం నవకోటికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 49 శాతం ఆల్కాహాల్ ఉన్నట్లుగా చూపించింది. స్కూల్ నిర్వాహకులు తమ పిల్లలను తీసుకెళ్లే విషయంలో నిబంధనలు పాటించలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కమ్మపల్లి, మిట్టవడ్డిపల్లి, దేవునివెల్లంపల్లి, కుప్పాయపాళెం, డక్కిలి, వెలికల్లు తదితర గ్రామాల నుంచి ప్రతిరోజూ 50 మందికి పైగా విద్యార్థులు బస్సులో వెళుతున్నారు. వాహనం కండీషన్లో లేదని వారు చెబుతున్నారు. క్లీనర్‌ను కూడా నియమించలేదని వాపోయారు. డ్రైవర్ నిద్రలో ఉన్నాడు : విద్యార్థి కుప్పాయిపాళెం గ్రామం దాటగానే చెరువు వద్ద బస్సు పక్కకు వెళ్లి పోతుండటాన్ని గుర్తించి కేకలు వేశాం. అప్పటికే డ్రైవర్ నిద్రలో ఉన్నాడు. బస్సు అదుపుతప్పి గుంతలో పడిపోగానే మేము గాయపడ్డాం. కేకలు వేయగా చుట్టుపక్కల వారు, పోలీసులు వచ్చి కాపాడారు. -
‘వైఎస్సార్సీపీకి 130 సీట్లు వస్తాయి’
సాక్షి, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పగలు కాంగ్రెస్‌తో, రాత్రి బీజేపీతో సంసారం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆదివారం డక్కలిలో జరిగిన వైఎస్సార్ సీపీ విజయభేరి సభలో ఆయన మాట్లాడుతూ.. సర్వేలన్నీ వైఎస్సార్ సీపీకి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 120 నుంచి 130 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే రెండు నెలల కాలం పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే వైఎస్సార్ సీపీదే విజయమని తెలిపారు. చంద్రబాబు రాజకీయ అవసరాల కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో తప్ప మిగిలిన అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని అన్నారు. పోలవరం అక్రమాలపై కేంద్రం విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఇంకా వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్, పార్టీ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిలతో పాటు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
ఆధ్యాత్మిక నిలయం.. వెంకయస్వామి ఆలయం
నేడు తీర్ధం వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవం డక్కిలి : మండలంలోని దగ్గవోలు గ్రామంలో ఉన్న తీర్ధం వెంకయ్యస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తే కోర్కెలు తీరుతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది. గొలగమూడి, చేజర్లలోని ఆలయాల తర్వాత మహిమ గల దేవస్థానంగా ఇది పేరుగాంచింది. ఇదీ కథ.. మారుమూల పల్లెయిన దగ్గవోలులో ఆలయ ఆవిర్భావం వెనుక ఓ యువకుడి అధ్యాత్మిక అలోచన ఉంది. దగ్గవోలు గ్రామానికి చెందిన తోట ఈశ్వరయ్య, వరలక్ష్మమ్మ కుమారుడు రమణయ్య 18 ఏళ్ల వయస్సులో గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఓరోజు రమణయ్య గొలగమూడిలోని వెంకయ్యస్వామి ఆలయంలో జరిగిన ఆరాధనోత్సవంలో పాల్గొని ఇంటికి వచ్చాడు. వెంకయ్యస్వామిని దర్శించుకున్న క్షణం నుంచి రమణయ్యలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడింది. క్రమంగా అతను గొర్కెలు కాసేందుకు వెళ్లడం ఆపేశాడు. కొద్దిరోజులకు తల్లిదండ్రులు ఆగ్రహించడంతో రమణయ్య గొర్కెల కాపరిగా వెళ్లాడు. ఒకరోజు గొర్రెలు మేపుతూ నిద్రలోకి జారుకున్న రమణయ్యకు కలలో ఓ మహర్షి రూపం కనిపించి దగ్గవోలు చెరువు సమీపంలోని బండరాయిలో రెండు అడుగల లోతులో నీరు పడతుంది. ఆప్రాంతంలో దేవస్థానం నిర్మించాలని మహర్షి చెప్పారు. వెంటనే రమణయ్య మరో ఇద్దరు కలిసి చెరువు వద్దనున్న బండరాయి పగులగొట్టి రెండు అడుగులలోతు తవ్వాగా నీరు ఎగచిమ్మింది. 97లో శంకుస్థాపన కలలో మహర్షి చెప్పింది నిజం కావడంతో రమణయ్య తీర్ధం వెంకయ్యస్వామి దేవస్థానం ఏర్పాటుచేశాడు. మెదట పూరి గుడెసెలో వెంకయ్యస్వామి పటం పెట్టి పూజలు చేశాడు. 1997 సంవత్సరం ఆగస్టు 27 తేదీన ఆలయానికి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం రమణయ్య వయస్సు 39 సంవత్సరాలు. ఆయనే ఆశ్రమ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. చదువుకోకపోయినా తన మదురమైన గొంతుతో వెంకయ్యస్వామి పాటలను గ్రామాల్లో పాడుతూ అధ్యాత్మిక ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆలయం వద్ద ఉన్న రెండు అడుగుల బావిలో నీరు ఎప్పటికీ ఎండదు. నేడు 19వ ఆరాధన మహోత్సవం తీర్ధం వెంకయ్యస్వామి 19వ ఆరాధన మహోత్సవం కార్యక్రమం బుధవారం జరగనుంది. ఉదయం ప్రభాతసేవ, స్వామికి అష్టోత్తర శతనామవళి పూజలు, మధ్యాహ్నం అన్నదానం, నవరత్నాలు భజన, రాత్రి 9 గంటలకు పాండురంగ నాట్యమండలి నెల్లూరువారిచే శ్రీరామాంజనేయయుద్దం, 10 గంటలకు గయోపాఖ్యానం (యుద్దశీను), 11 గంటలకు సత్యహరిశ్చంద్రపూర్తి నాటకం, రాత్రి 12గంటలకు స్వామివారి పల్లకిసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆలయ అభివద్ధికి కషి: రమణానందస్వామి, ఆశ్రమ ధర్మకర్త ఆలయ అభివద్ధికి చిన్న వయస్సు నుండే శక్తి వంచన లేకుండా కషి చేస్తున్నా. ఊరూరు తిరిగి అనేకమంది సహకారం తీసుకున్నాం. -
వృద్ధుడి దారుణహత్య
ఆస్తి పంపకాల్లో బంధువుల మధ్య వివాదమే కారణం? డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు డక్కిలి : ఆస్తి వ్యవహరంలో బంధువుల మధ్య ఏర్పడిన వివాదం ఓ వృద్ధుడి హత్యకు దారి తీసింది. సంచలనం సృష్టించిన ఈ సంఘటన మండలంలోని అల్తూరుపాడులో బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు, డక్కిలి ఇన్చార్జి ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. మండలంలోని అల్తూరుపాడుకు చెందిన పాదిలేటి లక్ష్మణ్‌రెడ్డి(75), అతని బంధువు భారతమ్మ మధ్య కొంత కాలంగా ఆస్తి వివాదాలు ఉన్నాయి. బుధవారం ఉదయం లక్ష్మణ్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి, భారతమ్మ మధ్య పొలంలో వివాదం జరిగింది. ఈ క్రమంలో లక్ష్మణ్‌రెడ్డి బుధవారం రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి వివాదమే హత్యకు కారణమా? లక్ష్మణ్‌రెడ్డి హత్య వెనుక ఆస్తి వివాదమే కారణం అయి ఉంటుందని పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మణ్‌రెడ్డి కుమారుడు ఆస్తి పంచుకుని చాలా ఏళ్ల క్రితమే గూడూరుకు కాపురం వెళ్లిపోయాడు. అయితే అల్తూరుపాడులో తన తండ్రి పేరున ఉన్న ఆస్తిని దక్కించుకునేందుకు 10 రోజుల నుంచి తన వద్దే ఉన్న తండ్రి లక్ష్మణ్‌రెడ్డితో కలిసి భూ సమస్యపై అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం గూడూరు నుంచి అల్తూరుపాడుకు చేరుకుని పొలాన్ని దున్నించేందుకు ప్రయత్నించాడు. అయితే ఈ ఆస్తి తమ దేనని అతని బంధువు భారతమ్మ అడ్డు చెప్పడంతో వెనుదిరిగారు. ఈ క్రమంలో లక్ష్మణ్‌రెడ్డి బుధవారం రాత్రి హత్యకు గురయ్యాడు. అయితే ఎవరు హత్య చేసి ఉంటారని పోలీసులు అన్ని కోణాల్లో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. గురువారం సంఘటన స్థలంలో కుమారుడు భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు బంధువులు, గ్రామస్తులను విచారించారు. లక్ష్మణ్‌రెడ్డిని ఎవరు హత్య చేశారనేది మిస్టరీగా మారింది. హత్యా ఘటన ఛేదించేందుకు డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. లక్కీ అనే జాగిలం సంఘటన స్థలంతో పాటు పరిసర ప్రాంతాలను పరిశీలిచింది. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ సీఐ వెంకటగిరి ఇన్చార్జి శ్రీనివాసులురెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. లక్ష్మణ్‌రెడ్డి కుమార్తె నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు. లక్ష్మణ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇన్చార్జి ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వరదకాలువలో పడి నర్సు మృతి
డక్కిలి (నెల్లూరు జిల్లా) : బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఏఎన్ఎంగా పనిచేస్తున్న పైడిపాటి వెంకట రాజ్యలక్ష్మి (35) డక్కిలి-కమ్మపల్లి మార్గంలోని వాగులో పడి సోమవారం రాత్రి మృతి చెందింది. అయితే ఆమె మృతి విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు కథనం మేరకు.. సోమవారం ఆసుపత్రిలో విధులు ముగించుకుని స్కూటీ మీద ఇంటికి వెళ్తుండగా కమ్మపల్లి సమీపంలోని మలుపు వద్ద వాగు వరద ప్రవాహం రోడ్డుపై ప్రవహిస్తుంది. అదే సమయంలో ఇంటికి వెళ్తున్న రాజ్యలక్ష్మి రోడ్డుమార్గం సక్రమంగా కనపడకపోవడంతో ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్నందువల్ల పైకి లేవలేకపోవడంతో వాగులోనే ఇరుక్కుని అక్కడికక్కడే మృతిచెంది ఉండవచ్చునని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వస్తానని బంధువులకు వెంకట రాజ్యలక్ష్మి ఫోన్లో తెలియజేసింది. 7 గంటలకు విధులు ముగించుకుని బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలోని వాగు మృత్యువు రూపంలో కబళించింది. సంఘటనాస్థలంలో మిన్నంటిన రోదనలు.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏఎన్ఎంగా పనిచేస్తున్న వెంకటరాజ్యలక్ష్మి ఆసుపత్రికి వచ్చే రోగులను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ వైద్య సేవలు అందించేది. విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరిస్తున్న ఆమె పట్ల సహ ఉద్యోగులకు కూడా మంచి అభిప్రాయం ఉంది. వెంకట రాజ్యలక్ష్మి రేషన్‌షాపు డీలర్‌గా కూడా పని చేస్తుంది. పేద ప్రజలకు రేషన్ సరుకులు నిజాయితీగా అందిస్తు వారి మన్ననులు కూడా పొందుతుండేది. వాగులో పడి ఆమె అకాల మరణం చెందడంతో ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు, బంధువులు సంఘటనాస్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. మృతిచెందిన తీరుని తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ఆమెతో కలిసి పనిచేసే స్థానిక వైద్య సిబ్బంది బోరున విలపించారు. నీళ్లల్లో ఉన్న మృతదేహాన్ని పోలీసులు వెలికితీసి శవపరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన ఆధికారులు.. వరదకాలువలో పడి మృతి చెందిన ఏఎన్ఎం వెంకటరాజ్యలక్ష్మి మృతదేహాన్ని తహశీల్దార్ రాజ్‌కుమార్, వెంకటగిరి సీఐ ఎం శ్రీనివాసరావు, వైద్యాధికారి సుధీర్‌బాబు తదితరులు పరిశీలించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అక్కడ నుండి తహశీల్దార్ రాజ్‌కుమార్, గూడూరు సబ్‌కలెక్టర్ గిరిషాకి కూడా ఫోన్ ద్వారా తెలియజేశారు. -
మృతురాలు వైద్యురాలిగా గుర్తింపు
నెల్లూరు : ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంగళవారం అతలాకుతలమైంది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. డక్కలి సమీపంలో వరదలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం ఈరోజు ఒడ్డుకు చేరుకుంది. సదరు మహిళ మృతదేహం వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మిగా స్థానికులు గుర్తించారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్‌మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
దక్కిలిలో కారు బోల్తా..ముగ్గురి మృతి
నెల్లూరు: నెల్లూరు జిల్లా దక్కిలి మండలం మిట్టపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. గ్రామంలోని మూల మలుపు వద్ద బుధవారం మధ్యాహ్నాం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. వీరంతా పెళ్లి నిమిత్తం శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలం వెళ్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. (దక్కిలి)