
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, డక్కిలి (చిత్తూరు): పదహారేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు క్షుద్ర భయం కల్పించి మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె గర్భందాల్చింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఫోక్సో కేసు నమోదు చేసినట్లు డక్కిలి ఎస్‌ఐ పి.నరసింహారావు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. ఓ గ్రామానికి చెందిన శ్రీరాం సుబ్బయ్య(55), భాస్కర్(60) క్షుద్ర పూజలు చేస్తుంటారు.
ఈక్రమంలో అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో చిన్నపాటి సమస్యలు ఉన్నట్లు ఈ ఇద్దరు వ్యక్తులు బాలికను నమ్మించారు. తాము చెప్పినట్లు వినకపోతే తల్లిదండ్రులకు మరణం తప్పదని భయపెట్టారు. ఇలా మూడు నెలలుగా ఇద్దరూ ఆమెపై లైంగిక దాడికి పాల్పడటంతో గర్భం దాల్చింది.
గత రెండు రోజులుగా కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండటాన్ని గమనించిన తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలికను ఒత్తిడి చేయగా శ్రీరాం సుబ్బయ్య, భాస్కర్ బాగోతం బయటపెట్టింది. విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇద్దరిపైనా పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: (కూతురుపై తండ్రి అత్యాచారం.. సీక్రెట్‌గా వీడియో తీసి!)
Comments
Please login to add a commentAdd a comment