నెల్లూరు : ఎడతేరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మంగళవారం అతలాకుతలమైంది. సూళ్లురుపేటలో కాళంగి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్ట్లో నీటిమట్టం 67 టీఎంసీలకు చేరింది. డక్కలి సమీపంలో వరదలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం ఈరోజు ఒడ్డుకు చేరుకుంది. సదరు మహిళ మృతదేహం వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్న రాజ్యలక్ష్మిగా స్థానికులు గుర్తించారు.
అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహన్ని స్వాధీనం చేసుకుని.... పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.