ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం!
వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్‌లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు.
ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్‌ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు.
చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్‌ని స్థానిక ఎఫ్‌ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!.
(చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..)
Comments
Please login to add a commentAdd a comment