ఫ్లోరిడా పశి్చమతీరం నుంచి వలసపోతున్న లక్షలాది అమెరికన్లు
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది.
ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
కుండపోత వర్షాలు
హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన.
జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment