Tampa
-
Hurricane Milton: ముంచుకొస్తున్న మిల్టన్
టంపా(అమెరికా): అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర పశి్చమతీరంపై మిల్టన్ తుపాను విరుచుకుపడనుంది. బుధవారం అర్ధరాత్రి లేదా గురువారం ఉదయం తీరాన్ని దాటి జనావాసాలను అతలాకుతం చేయనుందన్న వార్త అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. గంటకు 260 కి.మీ.ల వేగంతో వీస్తున్న పెనుగాలులకుతోడు జాతీయ హరికేన్ కేంద్రం హెచ్చరికలతో అప్రమత్తమైన లక్షలాది మంది స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా, సారాసోటా, సెయింట్ పీటర్స్బర్గ్ నగరాల ప్రజలు కొందరు సొంతిళ్లను విడిచి వెళ్లలేక, తుపానును ఎలా తట్టుకోవాలో తెలీక బిక్కుబిక్కుమంటున్నారు. దాదాపు 33 లక్షల మంది నివసించే టంపా బే ప్రాంతంలో హరికేన్ దారుణంగా విరుచుకుపడి వినాశనం సృష్టించనుందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈ ప్రాంతంపై ఐదో కేటగిరీ హరికేన్ ఇంతటి భారీ స్థాయిలో విరుచుకుపడుతుండటం ఈ శతాబ్దంలోనే తొలిసారి అనే విశ్లేషణలు వెలువడ్డాయి. బుధవారం సాయంత్రానికి టంపా నగరానికి 485 కిలోమీటర్ల దూరంలో సముద్రంపై కేంద్రీకృతమైన హరికేన్ గంటకు కేవలం 22 కిలోమీటర్ల వేగంతో ఈశాన్యం దిశగా కదులుతోందని, తీరాన్ని తాకే సమయానికి కాస్తంత బలహీనపడే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుండపోత వర్షాలు హరికేన్ కారణంగా వెస్ట్ సెంట్రల్ ఫ్లోరిడా ప్రాంతమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గురువారం 18 అంగుళాల మేర వర్షపాతం నమోదుకావచ్చని తెలుస్తోంది. ద్వీపకల్పంలా ఉండే ఫ్లోరిడా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జాగ్రత్తలు చెప్పింది. ఫ్లోరిడా నేషనల్ సెర్చ్, అండ్ రెసూ్క్క బృందాలు పెద్దమొత్తంలో జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫ్లోరిడా రాష్ట్ర చరిత్రలో ఇంతటి భారీ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హరికేన్ తీరాన్ని తాకితే దాదాపు 5,00,000 ఇళ్లు నాశనమవుతాయని ఓ అంచాన. జనం ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని టంపా సిటీ మేయర్ జన్ కాస్టర్ విన్నవించుకున్నారు. ‘‘మొండిపట్టుదలతో ఇంట్లోనే కూర్చుంటే అదే మీకు శవపేటికగా మారుతుంది’’అని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే హెలెన్ హరికేన్ సృష్టించిన విలయం నుంచి సమీప పుంటా గోర్డా సిటీ ఇంకా కోలుకోలేదు. నగర వీధుల్లో ఎక్కడా చూసినా పాడైన ఫరీ్నచర్లు, దుస్తులు, పుస్తకాలు, వస్తువులు కనిపిస్తున్నాయి. ‘‘మొన్నటి హెలెన్ హరికేన్ ధాటికే వీధుల్లోకి బుల్ షార్క్‌లు కొట్టుకొచ్చాయి. ఇప్పుడేం జరుగుతుందో’’అని స్థానిక అకౌంటెంట్ స్కౌట్ జానర్ ఆందోళన వ్యక్తంచేశారు. -
టెంపాబేలో నిత్యావసరాలు పంపిణీ చేసిన నాట్స్
టెంపా : ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణతో పెట్టిన లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి ఈ నిత్యావసరాల పంపిణీ చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది. అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించింది. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రు లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరాల ఉచిత పంపిణీలో కీలక పాత్ర పోషించారు. అటు బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ నిత్యావసరాల పంపిణికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూనే ఈ నిత్యావసరాల పంపిణి జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది. -
టెంపాబే లో నాట్స్ సాయం
మెక్సికో: అమెరికాలో తెలుగువారికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాబేలో తెలుగువారికి నిత్యావసరాలు పంపిణీ చేసింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ విధించడంతో ఇబ్బందులు పడుతున్న భారతీయుల కోసం నాట్స్ టెంపాబే విభాగం స్పందించి నిత్యావసరాల సరుకుల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను దాదాపు 300 మందికిపైగా అందించింది. స్థానికంగా ఉండే బటర్ ప్లై ఫార్మసీ కూడా దీనికి తన వంతు సహకారం అందించింది. అవసరమైన వారికి మాస్కులు, గ్లౌజులు కూడా నాట్స్ పంపిణీ చేసింది. (చిన్నారుల ఆశ్రమానికి నాట్స్ చేయూత) ప్లోరిడా హౌస్ ప్రతినిధి మిస్ డయాన్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరై నాట్స్ నాయకులను అభినందించారు. ఈ కష్టకాలంలో నాట్స్ ముందుకు వచ్చి సాయం చేయడాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. స్థానిక పోలీసులు కూడా డ్రైవ్ త్రూ లైన్ లలో ట్రాఫిక్‌ను మళ్లించి ఈ పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేలా చేశారు. దీనికి నాట్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. నాట్స్ టెంపా బే కోర్ టీం సభ్యులు శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేని,రాజేశ్ కాండ్రు, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ ఆరికట్ల, సుధీర్ మిక్కిలినేని తదితరులు ఈ నిత్యావసరసరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. బటర్ ఫ్లై ఫార్మసీ నుంచి జన్ను కుటుంబం, టోని, టుటూ తో పాటు ఫార్మసీ కార్యాలయం సిబ్బంది కూడా ఈ కార్యక్రమానికి సహకరించారు. సామాజిక దూరం పాటిస్తూ నిత్యావసరుకులను పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డ్ ఛైర్మన్ శ్రీథర్ అప్పసాని, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, సెక్రటరీ విష్ణు వీరపనేని, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ మురళీ మేడిచర్లకు నాట్స్ టెంపాబే టీం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. టెంపాబే స్ఫూర్తితో మరిన్ని ఛాప్టర్లలో నాట్స్ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టనుంది.(శాన్ఎన్టానియోలో నాట్స్ ఉదారత) -
కరోనాపై వైద్యనిపుణులతో నాట్స్ వెబినార్
టాంప(ఫ్లోరిడా) : అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులతో వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి కొవిడ్-19 పై ఎంత అప్రమత్తంగా ఉండాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా రాకుండా ఉంటుందనే దానిపై అవగాహన కల్పించారు. అంతే కాకుండా కరోనా పేషంట్లలో ప్రధానంగా తలెత్తుతున్న సమస్యలు ఏమిటి..? ఎలాంటి వారు మరణానికి దగ్గరవుతున్నారు..? అనే విషయాలపై కూడా వైద్య నిపుణులు తమ అనుభవాలను ఈ వెబినార్ లో పంచుకున్నారు. ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా ఈ మహమ్మారి అమెరికాలో పది లక్షల మందికిపైగా వచ్చే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు.. చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిత్యావసరాల కోసం బయటకు వెళ్లినా కూడా శుభ్రంగా చేతులు కడుక్కోనే ఇంట్లోకి రావాలని... పట్టుకునే సంచుల నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. వైరస్ ను మన ఇంట్లోకి మోసుకొస్తున్నామా...? అనే విషయాన్ని పదే పదే గుర్తుంచుకుని వ్యహారించాలని హెచ్చరించారు. కోవిడ్ బారిన పడ్డ ఒక తెలుగు బాధితుడు కూడా ఈ వెబినార్ ద్వారా అందరూ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయాలను తెలియ చేశారు. దాదాపు 500 మంది తెలుగువారు ఈ వెబినార్ ద్వారా ఈ సదస్సులో పాల్గొన్నారు. కరోనాపై తమకు ఉన్న సందేహాలను వైద్య నిపుణుల ద్వారా నివృత్తి చేసుకున్నారు. కరోనా వైరస్ విస్తృతమవుతున్న ఈ తరుణంలో సామాజిక దూరం పాటిస్తూ నాట్స్ వెబినార్ నిర్వహిస్తోంది. నాట్స్ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ బోర్డ్ కార్యదర్శి ప్రశాంత్ పిన్నమనేని, సలహాకమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ మల్లాది, డా. దుర్గారావు పరిమి, టెంపా నాట్స్ కో ఆర్డినేటర్ రాజేశ్ కాండ్రు, సెక్రటరీ సుధీర్ మిక్కిలినేని, సుబ్బా రావు యన్నమని, నాట్స్ గ్లోబల్ టీం నుంచి విష్ణు వీరపనేని తదితరులు ఈ వెబినార్ నిర్వహాణలో తమవంతు సహాయ సహాకారాలు అందించారు. ప్రశాంత్ పిన్నమనేని ఈ వెబినార్‌కు వ్యాఖ్యతగా వ్యవహారించారు. నాట్స్ చైర్మన్ శ్రీధర్ అప్పసాని, అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి టాంప ఫ్లోరిడా చాప్టర్ చేసిన కృషిని ప్రత్యేకంగా అభినందించారు. -
టెంపాలో నాట్స్ క్రికెట్ లీగ్‌కు విశేష స్పందన
టెంపా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో క్రికెట్ లీగ్ నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొన్నాయి. క్రికెట్ సంఘం టెంపా క్రికెట్ లీగ్‌తో కలిసి, నాట్స్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించింది. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో నాట్స్ టీం ఈ క్రికెట్ లీగ్ విజయవంతానికి పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అటు టీసీఎల్ ఛైర్మన్ నితీశ్ శెట్టితో నాట్స్ సమన్వయం చేసుకుంటూ ఈ లీగ్ పోటీలను నిర్వహించింది. ఈ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించడానికి పెద్ద ఎత్తున స్థానికులు వచ్చి క్రికెటర్లను ప్రోత్సాహించారు. ఈ లీగ్ లో విన్నర్స్, రన్నర్స్ తో పాటు.. అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు. నాట్స్ బోర్డ్ నుంచి శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేనిలు వచ్చి ఆటగాళ్లకు బహుమతులు అందించారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది తో పాటు నాట్స్ టెంపా సభ్యులు ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ బైరెడ్డి, శ్రీథర్ గౌరవెల్లి, భరత్ ముద్దన, శ్రీనివాస్ కశెట్టి తదితరులు ఈ లీగ్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. సుధీర్ మిక్కిలినేని ఈ లీగ్ ను వెబ్ క్యాస్ట్ కూడా చేశారు. -
టెంపాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు విశేష స్పందన
టెంపా: ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో తన సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్థుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. రెండు వారాల సమయంలోనే 1000ఎల్బీల ఫుడ్ క్యాన్స్‌ను తెలుగువారు విరాళంగా అందించారు. విరాళాల రూపంలో సేకరించిన ఫుడ్ క్యాన్స్‌ను స్థానిక ఫీడింగ్ అమెరికా టెంపా డౌన్ టౌన్‌కు నాట్స్ నాయకత్వ బృందం అందించింది. పేదలకు ఉచితంగా ఫీడింగ్ టెంపాబే సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. నాట్స్ చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌పై ఫీడింగ్ టెంపాబే సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. పేదలకు ఆకలి తీర్చడంలో నాట్స్ కూడా తన వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ జాతీయ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్ రాజేశ్ కాండ్రులు ఫుడ్ క్యాన్స్‌ను ఫీడింగ్ టెంపాబే సంస్థకు అందించడంతో పాటు అమెరికాలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీశ్ పాలకుర్తి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుథీర్ మిక్కిలినేని, రమ కామిశెట్టి తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. -
టెంపాలో నాట్స్ ఆర్ధిక అక్షరాస్యత సదస్సు
ఫ్లోరిడా : అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో ఆర్ధిక అక్షరాస్యతపై సదస్సు నిర్వహించింది. అమెరికాలో ఆర్ధికాంశాలపై అవగాహన కల్పించేందుకు టెంపాలోని న్యూ టెంపా రీజనల్ లైబ్రరీలో ఈ సదస్సు ఏర్పాటు చేసింది. స్థానిక ప్రముఖ ఆర్ధిక నిపుణులు శ్రీథర్ గౌరవెల్లి ఈ సదస్సుకు విచ్చేసి తన విలువైన సూచనలు సలహాలు అందించారు. దాదాపు 70 మందికి పైగా తెలుగువారు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఉన్నతవిద్యకు ఎలా నిధులు పొందాలి? అమెరికాలో ఏ రిస్క్ కు ఎలాంటి బీమా ఉంటుంది? ట్యాక్స్ ప్రణాళికలో ఎలాంటి వ్యూహాలు ఉండాలి? గృహాలు, ఎస్టేట్ లు కొనటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఆరోగ్య సంరక్షణకు ఎలా మనీ ప్లాన్ చేసుకోవాలి? సంపాదించే డబ్బును చక్కటి ప్రణాళికతో దేనికెంత ఖర్చు చేయాలి? పొదుపు ఎలా చేసుకోవాలి? లాంటి అనేక అంశాలపై చక్కటి అవగాహనను శ్రీథర్ గౌరవెల్లి కల్పించారు. వీటిపై ఈ సదస్సుకు విచ్చేసిన వారి సందేహాలను నివృత్తి చేశారు. ఆర్థికంగా ఎలా ప్రగతి సాధించాలనే అంశాలపై కూడా స్పష్టత ఇచ్చారు. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు స్థానిక తెలుగువారి నుంచి మంచి స్పందన లభించింది. నాట్స్ ఆర్ధిక సదస్సు ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నామని ఈ సదస్సుకు విచ్చేసిన వారు నాట్స్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలోరాజేశ్ కండ్రు, వంశీలతో పాటు పలువురు నాట్స్ సభ్యులు పాల్గొన్నారు. -
టెంపాలో 'టు గెదర్ మీట్'
టెంపా(ఫ్లోరిడా): అమెరికాలో ఉండే ప్రవాస భారతీయుల కోసం టెంపాలో షరిఫ్స్ ఇండియన్ అడ్వైజరీ కౌన్సిల్ 'బిల్డింగ్ ఎ స్ట్రాంగర్ కమ్యూనిటీ టుగెదర్' అనే సదస్సు ఏర్పాటు చేసింది. దీనికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) సలహా కమిటీ సభ్యులు శేఖరంతో పాటు నాట్స్ సభ్యులు కూడా హాజరయ్యారు. ప్రవాస భారతీయుల కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సులో అమెరికాలో ఉండే సవాళ్లు.. వాటిని అధిగమించే మార్గాలపై చర్చించారు. భారతీయులంతా కలిసి ఉంటే అమెరికాలో భారతజాతి సాధించుకునే ప్రయోజనాలపై సమీక్షించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రవాస భారతీయులకు అవార్డులు ప్రదానం చేశారు. మరోవైపు టెంపాలో విద్యార్ధుల కోసం నాట్స్ కాలేజ్ ప్రిపరేషన్ సెమినార్ నిర్వహించింది. టెంపా బే నాట్స్ ఛాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సెమీనార్ లో కాలేజ్ చేరబోయే విద్యార్ధులకు ఉపయోగపడే అనేక అంశాలు వివరించారు. అసలు కాలేజ్ లో చేరడానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీల్లో ప్రవేశానికి రాయాల్సిన వ్యాసాలు, స్టోరీలైన్స్ ఎలా ఉండాలి. వాటిని అర్థవంతంగా ఉండాలి అనే అంశాలపై ఈ సెమీనార్ లో నిపుణులు వివరించారు. కాలేజీలో ప్రవేశానికి చేయాల్సిన అంశాలు.. చేయకూడని అంశాలపై కూడా విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. తమకు తెలియని ఎన్నో కొత్త విషయాలు ఈ సెమీనార్ ద్వారా తెలుసుకున్నామని విద్యార్ధులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమ పిల్లల కాలేజీ అడ్మిషన్ల గురించి తమకు కూడా అవగాహన పెరిగిందని విద్యార్ధుల తల్లిదండ్రులు తెలిపారు. -
మోడీకి శుభాకాంక్షలు తెలిపిన ఓఎఫ్‌బీజేపీ
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని భారత ప్రధాని మంత్రి పదవికి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ఎంపిక చేయడాన్ని యూఎస్‌లోని ఆ పార్టీ అనుబంధ సంస్థ ద ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ (ఓఎఫ్‌బీజేపీ) హార్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మోడీకి శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు ఓఎఫ్‌బీజేపీ శనివారం ఇక్కడ విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బీజేపీ కార్యవర్గం సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ గుజరాత్ సీఎం నరేంద్రమోడీ పేరును ప్రకటించగానే తమకు ఆనందానికి అవధులు లేవని ఆ ప్రకటనలో వెల్లడించింది. ప్రధాని అభ్యర్థిగా మోడీని ఎంపిక చేసినందుకు రాజ్‌నాథ్‌కు ఓఎఫ్‌బీజేపీ ధన్యవాదాలు తెలిపింది. అలాగే ఈ నెల 20 నుంచి 21 వరకు ఫ్లారెడాలోని తంపాలో జరిగే ఓఎఫ్‌బీజేపీ వార్షిక సదస్సులో ఆహ్వానితులను ఉద్దేశించి మోడీ వీడియో కాన్ఫరేన్స్ ద్వారా ప్రసంగిస్తారని ఓఎఫ్‌బీజేపీ వివరించింది.