
టెంపా: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) టెంపాలో క్రికెట్ లీగ్ నిర్వహించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ లీగ్‌లో 12 జట్లు పాల్గొన్నాయి. క్రికెట్ సంఘం టెంపా క్రికెట్ లీగ్‌తో కలిసి, నాట్స్ ఈ క్రికెట్ పోటీలు నిర్వహించింది. టెంపా నాట్స్ సమన్వయకర్త రాజేశ్ కండ్రు నాయకత్వంలో నాట్స్ టీం ఈ క్రికెట్ లీగ్ విజయవంతానికి పక్కా ప్రణాళికతో వ్యవహరించింది. అటు టీసీఎల్ ఛైర్మన్ నితీశ్ శెట్టితో నాట్స్ సమన్వయం చేసుకుంటూ ఈ లీగ్ పోటీలను నిర్వహించింది.
ఈ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించడానికి పెద్ద ఎత్తున స్థానికులు వచ్చి క్రికెటర్లను ప్రోత్సాహించారు. ఈ లీగ్ లో విన్నర్స్, రన్నర్స్ తో పాటు.. అద్భుతంగా ఆడిన ఆటగాళ్లకు ప్రత్యేక బహుమతులు ప్రధానం చేశారు. నాట్స్ బోర్డ్ నుంచి శ్రీనివాస్ గుత్తికొండ, ప్రశాంత్ పిన్నమనేనిలు వచ్చి ఆటగాళ్లకు బహుమతులు అందించారు. నాట్స్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ శివ తాళ్లూరి, అడ్వైజరీ ఛైర్ శ్రీనివాస్ మల్లాది తో పాటు నాట్స్ టెంపా సభ్యులు ప్రసాద్ కొసరాజు, శ్రీనివాస్ బైరెడ్డి, శ్రీథర్ గౌరవెల్లి, భరత్ ముద్దన, శ్రీనివాస్ కశెట్టి తదితరులు ఈ లీగ్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. సుధీర్ మిక్కిలినేని ఈ లీగ్ ను వెబ్ క్యాస్ట్ కూడా చేశారు.





Comments
Please login to add a commentAdd a comment